For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మంపై అసహ్యంగా కనిపించే కాలిన మచ్చలు నివారించే రెమిడీస్..!

By Swathi
|

భారతీయ మహిళలు.. వర్క్ చేసేవాళ్లైనా, హౌస్ వైఫ్ లు అయినా.. రోజుకి 6 నుంచి 12 గంటలు వంటగదిలోనే గడుపుతారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఆయిల్ చిట్లడం, వేడిగా ఉన్న కుక్కర్ నుంచి స్కీమ్ బయటకు రావడం వంటి కారణాల వల్ల చర్మంపై కాలుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు.. కాలిన మచ్చలు నివారించడానికి హోం రెమిడీస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

అయితే కాలిన వెంటనే.. మచ్చలు పడకుండా, పొంగకుండా, రెడ్ గా ఏర్పడకుండా.. ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఖచ్చితంగా తీసుకోవాలి. కాలిన వెంటనే చల్లటి నీటితో కాలిన ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి. చల్లటి నీటిలో క్లాత్ ముంచి, నీటిని పిండేసి.. కాలిన చర్మంపై కొన్ని గంటలపాటు క్లాతును ఉంచాలి.

ఐస్ ని కూడా కాలిన చర్మంపై పెట్టుకోవచ్చు. దీనివల్ల రక్తప్రసరణను అరికట్టవచ్చు. దీనివల్ల బ్లడ్ క్లాట్ అవడాన్ని నివారించవచ్చు. ఒక్కసారి గాయమంతా పూర్తీగా నయం అయిన తర్వాత.. చిన్న చిన్న మచ్చలు బ్రౌన్ కలర్ లో కనిపిస్తాయి. లేదా చర్మం రఫ్ గా మారుతుంది. ఇలాంటప్పుడు.. కొన్ని హోం రెమిడీస్ ప్రయత్నిస్తే.. ఎఫెక్టివ్ ఫలితాలు చూడవచ్చు.

టమోటా జ్యూస్

టమోటా జ్యూస్

టమోటాలో న్యాచురల్ బ్లీచింగ్ ఉంటుంది. ఇది మృత కణాలను తొలగిస్తుంది. కాబట్టి కొన్ని చుక్కల టమోటా రసాన్ని కాలిన మచ్చలు ఏర్పడిన దానిపై డైరెక్ట్ పై అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేస్తే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

ఆల్మండ్ ఆయిల్

ఆల్మండ్ ఆయిల్

విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్స్ ఆల్మండ్ ఆయిల్ లో పుష్కలంగా ఉండటం వల్ల.. కాలిన మచ్చలను త్వరగా నయం చేసి, పోషణ అందిస్తుంది. దీనివల్ల కొత్త కణాలు ఏర్పడతాయి. కొద్దిగా ఆల్మండ్ ఆయిల్ తీసుకుని ప్రతి రోజూ రాత్రిపూట మసాజ్ చేసుకోవాలి.

పెరుగు, పసుపు

పెరుగు, పసుపు

పెరుగులో లాక్టిక్ యాసిడ్, పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్.. కాలిన గాయాలను వెంటనే నయం చేస్తుంది. వాపుని, మచ్చలు తగ్గిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ పెరుగులో చిటికెడు పసుపు కలిపి.. అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత చల్లటినీటితో శుభ్రం చేయాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేయాలి.

బ్లాక్ టీ బ్యాగ్

బ్లాక్ టీ బ్యాగ్

టీ బ్యాగ్ చర్మాన్ని టైట్ గా మార్చి, డ్యామేజ్ అయిన చర్మకణాలను తొలగిస్తుంది. మచ్చలను తొలగిస్తుంది. బ్లాక్ టీ బ్యాగ్ తీసుకుని కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టి తర్వాత కాలిన చర్మంపై పెట్టాలి. చర్మం వెచ్చగా అయిన తర్వాత.. తీసేయాలి. ఇలా.. రోజుకి రెండు మూడు సార్లు చేయాలి.

కొబ్బరినూనె

కొబ్బరినూనె

కొబ్బరినూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉండటం వల్ల.. గాయమైన స్కిన్ టిష్యూస్ ని నయం చేస్తుంది. అలాగే కొత్త కణాలు ఏర్పడేలా చేస్తుంది. కొద్దిగా కొబ్బరినూనె తీసుకుని.. మసాజ్ చేయాలి. అందులోని పోషకాలను చర్మం గ్రహిస్తుంది. ఇలా రోజుకి రెండు, మూడు సార్లు చేస్తే.. బర్న్ మార్క్స్ తొలగిపోతాయి.

బంగాళాదుంప

బంగాళాదుంప

బంగాళాదుంపలో బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలిన మచ్చలను లైట్ గా మార్చేస్తాయి. బంగాళాదుంపను కొన్ని ముక్కలుగా కట్ చేసి.. కాలిన చర్మంపై రబ్ చేయాలి. క్లాక్ వైట్, యాంటీ క్లాక్ వైజ్ రుద్దాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేయాలి.

పాలు

పాలు

పాలల్లో ప్రొటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్, క్యాల్షియం ఉండటం వల్ల.. స్కిన్ టిఫ్యూష్ ని మెరుగుపరిచి, మచ్చలను తగ్గిస్తాయి. కాటన్ బాల్ ని పచ్చిపాలలో ముంచి.. కాలిన మచ్చలపై పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత.. శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకి మూడుసార్లు చేయాలి.

అలోవెరా

అలోవెరా

అలోవెరాలో అలోసిన్ ఉంటుంది. ఇది.. చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ ని ఎక్స్ ఫోలియేట్ చేస్తుంది. చర్మాన్ని టైట్ గా మారుస్తుంది. మచ్చలను తగ్గిస్తుంది. కాబట్టి కలబంద నుంచి జెల్ తీసి.. అప్లై చేయాలి. ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ న్యాచురల్ రెమిడీని రోజుకి మూడు సార్లు అప్లై చేస్తే.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

ఉల్లిపాయ

ఉల్లిపాయ

ఉల్లిపాయలో సల్ఫర్ ఉండటం వల్ల.. కాలిన మచ్చలను తొలగిస్తుంది. ఉల్లిపాయను గ్రైండ్ చేసి రసం తీయాలి. కాటన్ బాల్ ఉపయోగించి.. చర్మంపై రాసుకోవాలి. 5 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేయాలి.

లావెండర్ ఆయిల్

లావెండర్ ఆయిల్

లావెండర్ ఆయిల్ లో యాంటీ సెప్టిక్ గుణాలుంటాయి. చర్మంపై గాయాలను చాలా వేగంగా తగ్గిస్తుంది. కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ ని కాలిన వెంటనే చర్మంపై అప్లై చేయాలి. కాలిన గాయాన్ని త్వరగా తగ్గించడమే కాకుండా.. మచ్చలు పడకుండా అడ్డుకుంటుంది.

తేనె

తేనె

తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. ఇది ఉపశమనం కలిగించడమే కాకుండా.. కొత్త కణాలు ఏర్పడటానికి సహాయపడుతుంది. కొన్ని చుక్కల తేనెతో.. కాలిన చర్మంపై మసాజ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత.. చల్లటి నీటితో శుభ్రం చేయాలి. ఈ హోం రెమిడీ.. అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా

బేకింగ్ సోడాలో ఉండే సోడియం బైకార్బొనేట్ డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగిస్తుంది. ఇన్ఫెక్షన్ కి కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను కావాల్సినన్ని నీటిలో కలపాలి. పేస్ట్ చేసుకుని.. చర్మంపై అప్లై చేయాలి. ఆరిన తర్వాత.. చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకి ఒకసారి చేయాలి.

English summary

Home Remedies To Remove Burn Marks On Skin

Home Remedies To Remove Burn Marks On Skin. Indian women, working or a housewife, spend roughly around 6 to 12 hours in a day in the kitchen.
Story first published: Thursday, September 22, 2016, 12:45 [IST]
Desktop Bottom Promotion