Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
అప్పర్ లిప్ హెయిర్ ను తొలగించే 8 ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ...
పెదాలు అందంగా ఉంటే, ఆ ముఖ సౌందర్యం మరింత అందంగా కనిపిస్తుంది. అదే పైపెదవి మీద సన్నని హెయిర్ ఉన్నట్లైతే, అవి బయటకు కనబడుతుంటే, ఆ పెదాలకు లిప్ స్టిక్ వేసినా, అందవిహీనంగా మారిపోతుంది. అందమైన ముఖంలో పెదాల మీద సన్నగా వెంట్రుకలు కనబడుట వల్ల పురుషల వలే కనబడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగని రెగ్యులర్ గా వాక్సింగ్, థ్రెండింగ్ చేయించుకోవడం వల్ల డార్క్ ప్యాచెస్ ఎక్కువ అవుతాయి.
అప్పర్ లిప్ ఏరియా చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. నొప్పితో పాటు చాలా ఇబ్బంది కలిగించే అవాంఛిత రోమాలను ఎప్పటికప్పుడు తొలగించుకోవడం మంచిది. అలాగని ఎప్పుడూ రేజర్ ఉపయోగించడం వల్ల ఆ ప్రదేశంలో స్కిన్ రఫ్ గా మరియు డ్రైగా మారుతుంది. ఎట్టువంటి నొప్పి లేకుండా నేచురల్ గా అప్పర్ లిప్ హెయిర్ తొలగించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. అప్పర్ లిప్ హెయిర్ తొలగించుకోవడానికి హోం రెమెడీస్ ను సరైన సమయంలో సరిగా ఉపయోగిస్తే, మంచి ఫలితం ఉంటుంది. అలాంటి హోం రెమెడీస్ లో నేచురల్ గా పసుు, గుడ్డు, నిమ్మరసం వంటి చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి అప్పర్ లిప్ హెయిర్ ను తొలగిస్తాయి.
అప్పర్ లిప్ హెయిర్ నేచురల్ గా తొలగించే 10 సింపుల్ చిట్కాలు
అప్పర్ లిప్ హెయిర్ ను తొలగించుకోవడానికి మార్కెట్లో కనుక్కోవడం కష్టమైనా, ఇంట్లోనే కొన్ని నేచురల్ రెమెడీస్ సులభంగా అందుబాటులో ఉన్నాయి అప్పర్ లిప్ హెయిర్ తొలగించడానికి కొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఈ టిప్స్ ను క్రమంగా ఉపయోగిస్తే, అప్పర్ లిప్ హెయిర్ ను చాలా సున్నితంగా తొలగించుకోవచ్చు .
సూచన: చాలా సున్నితమైన చర్మతత్వం కలిగిన వారు, ఈ హోం రెమెడీస్ ఉపయోగించడానికి ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. అప్పర్ లిప్ హెయిర్ తొలగించే హోం రెమెడీస్ ఏంటో ఒక సారి చూద్దాం....
డార్క్ లిప్స్ ను పింక్ అండ్ సాప్ట్ గా మార్చే గ్లిజరిన్...
హోం రెమెడీస్ ఉపయోగించడానికి ముందు, ప్యాచ్ టెస్ట్ ను చెవులకు వెనుకభాగంలో చేసుకోవాలి. ఏదైనా లైట్ గా దురద, ఎర్రగా మారినట్లైతే, అది మీ అప్పర్ లిప్ హెయిర్ తొలగించడానికి కష్టం అవుతుంది. ఏటువంటి మార్పు లేకుంటే, ఈ నేచురల్ హోం రెమెడీస్ ను మీరు నేరుగా ఉపయోగించవచ్చు. రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం...

1. వైట్ షుగర్ మరియు నిమ్మరసం:
ఒక బౌల్లో షుగర్ తీసుకొని అందులో నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి. పేస్ట్ గా మారిన తర్వాత అప్పర్ లిప్ మీద అప్లై చేసి సున్నితంగా మర్ధన చేయాలి . స్ర్కబ్ చేసిన 15నిముషాలత తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా వారానికొకసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

2. పసుపు-పాలు:
పసుపు చర్మం ఇన్ఫెక్షన్ కు గురికాకుండా చేస్తుంది. అలాగే చర్మానికి మాయిశ్చరైజరన్ ను అందిస్తుంది . పసుపు, పాలను ఒక బౌల్లో తీసుకొని మిక్స్ చేయాలి . పేస్ట్ లా చేసుకున్నాక, ఈ పేస్ట్ ను అవాంఛిత రోమాలున్న ప్రదేశంలో అప్లై చేసి మర్ధన చేయాలి. 10 నిముసాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

3. బ్రౌన్ షుగర్ వాక్సింగ్:
బ్రౌన్ షుగర్ , కొద్దిగా నీరు, కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి సన్నని మంట మీద వేడి చేయాలి. చిక్కగా వాక్సింగ్ గా తయారువుతుంది. దీన్ని స్పాటుల సహాయంతో అప్పర్ లిప్ ఏరియాలో అప్లై చేసి మర్ధన చేయాలి. తర్వాత దానీ మీద క్లాత్ ను ప్రెస్ చేసి పెట్టాలి. డ్రై అయిన తర్వాత స్మూత్ గా ఆపోజిట్ డైరెక్షన్ లో స్పాటులను తొలగించాలి. ఇలా చేయడం వల్ల అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.

4. ఎగ్ వైట్ :
అప్పర్ లిప్ హెయిర్ తొలగించడానికి ఎగ్ వైట్ గ్రేట్ గా సహాయపడుతుంది . ఎగ్ వైట్ లో కొద్దిగా షుగర్, కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసి పై పెదవుల మీద అప్లై చేసి డ్రై అయిన తర్వాత అరగంట తర్వాత పీలింగ్ లా తొలగించాలి. ఈ పద్దతిని వారంలో రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

5. శెనగపిండి:
కొన్ని వందల సంవత్సరాల నుండి శెనగపిండిని బ్యూటీ ప్రొడక్ట్ గా ఉపయోగిస్తున్నారు. ఫేషియల్స్ కోసం ఉపయోగిస్తున్నారు . శెనగపిండిలో కొద్ది పసుపు, సరిపడా నీరు పోసి పేస్ట్ చేసి అప్పర్ లిప్ ఏరియాలో అప్లై చేసి మర్ధన చేయాలి. 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.

6. పెరుగు, శెనగపిండి మరియు పసుపు:
ఈ మూడు పదార్థాలను తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో మిక్స్ చేసి , ప్యాక్ లా వేసుకోవాలి. బాగా మర్ధన చేయాలి. 20నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.వారంలో రెండు మూడు సార్లు ఇలా చేస్తుంటే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.

7. పొటాటో జ్యూస్ :
అప్పర్ లిప్ హెయిర్ తొలగించడంలో బంగాళదుంప రసం గ్రేట్ గా సహాయపడుతుంది . అంతే కాదు డార్క్ స్పాట్స్ ను నివారించడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. పొటాటోను పేస్ట్ చేసి, అందులోని రసాన్ని తీసి అప్పర్ లిప్ ఏరియాలో అప్లై చేయాలి. రాత్రి నిద్రించే ముందు అప్లై చేసి, ఉదయం కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.

8. రెడ్ లెంటిల్స్ మరియు పాలు:
సున్నిపిండి హోం రెమెడీ , పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. పెసరపప్పును మెత్తగా పౌడర్ చేసి, అందులో పాలు మిక్స్ చేసి పేస్ట్ ను అవాంఛిత రోమాలున్న ప్రదేశంలో అప్లై చేసి స్ర్కబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.



Click it and Unblock the Notifications