Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మోచేతులు, మోకాళ్లు తేలికగా తెల్లగా మార్చే హోం రెమెడీ
మోచేతులు, మోకాళ్లు కనిపించేలా డ్రెస్ లు వేసుకోవడానికి ఇబ్బందిపడుతున్నారా ? అవి నల్లగా ఉండటంతో నలుగురిలోకి వెళ్లేటప్పుడు వాటిని కప్పి ఉంచే ప్రయత్నం చేస్తున్నారా ? ఒక వేళ అదే నిజమైతే.. ఇలాంటి సమస్య నుంచి తేలికగా బయటపడే సింపుల్ టిప్ మీకు అందుబాటులో ఉంది.
శరీరంలో ఏ పార్ట్ నల్లగా మారినా చాలా ఇబ్బందిపడాల్సి వస్తుంది. నలుగురిలో అసౌకర్యంగా ఫీలవుతారు. ముఖ్యంగా చర్మంపై డార్క్ ప్యాచెస్ ఎక్కువ ఇబ్బందికి గురిచేస్తాయి. మోచేతులు, మోకాళ్లు.. నల్లగా మారిన సమస్య చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. ఇది మొత్తం అందాన్నే దెబ్బతీసేలా ఉంటాయి.

మోకాళ్లు మోచేతులు డ్రైనెస్, విటమిన్ డెఫిసియోన్సీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అసమతుల్య ఆహారం, చర్మ సంరక్షణ పట్టించుకోకపోవడం వల్ల నల్లగా మారతాయి. కారణమేదైనా.. ఇలాంటి సమస్యను పరిష్కరించడానికి చక్కటి హోం రెమెడీస్ ఉన్నాయి. కాస్మొటిక్ ప్రొడక్ట్స్ ప్రయత్నించి.. ఫలితం లేక విసుగుపోయి ఉంటారు. ఇప్పుడు న్యాచురల్ ట్రీట్మెంట్ ట్రై చేయండి.. మీరే షాక్ అవుతారు.
కావాల్సిన పదార్థాలు
పంచదార 1 టేబుల్ స్పూన్
బేకింగ్ సోడా 2 టీస్పూన్లు
అలోవెరా జ్యూస్ 1 టేబుల్ స్పూన్

మీకు మోచేతులు, మోకాళ్లు తెల్లగా కావాలి అని ఉంటే.. ఈ మూడు పదార్థాల మిశ్రమాన్ని రెగ్యులర్ గా ఉపయోగించండి. ఇది న్యాచురల్ స్కిన్ ఎక్స్ ఫోలియేటింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. ఈ స్క్రబ్ డెడ్ స్కిన్ లేయర్ ని తొలగిస్తుంది. కొత్త కణాలు ఏర్పడేలా చేసి.. మోచేతులు, మోకాళ్లు తెల్లగా మెరిసిపోవడానికి సహాయపడుతుంది. తఅంతేకాకుండా.. బేకింగ్ సోడా.. న్యాచురల్ బ్లీచింగ్ లా పనిచేస్తుంది. దీనివల్ల పిగ్మెంటేషన్, డార్క్ ప్యాచెస్ తగ్గిపోతాయి. దీంతో మోచేతులు, మోకాళ్లు స్కిన్ టోన్ బ్రైట్ గా మారుతుంది.

ఈ మాస్క్ తయారు చేసే విధానం
పైన చెప్పిన అన్ని పదార్థాలను ఒక గిన్నెలో మిక్స్ చేయాలి.
అన్నింటినీ బాగా కలిపి పేస్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మోచేతులు, మోకాళ్లకు పట్టించాలి.
కొన్ని నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి.
15 నిమిషాల పాటు ఆరిన తర్వాత మైల్డ్ సోపు ఉపయోగించి.. శుభ్రం చేసుకోవాలి.
ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే.. మోచేతులు, మోకాళ్ల నలుపుదనం తగ్గిపోతుంది.



Click it and Unblock the Notifications