Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇప్పటికిప్పుడే మీ పెదాలను పింక్ గా మార్చే సింపుల్ టిప్..
సాఫ్ట్ గా, అందంగా ఉండే పెదాలను ఎవరు కోరుకోరు చెప్పండి. కానీ.. కొన్ని కాస్మొటిక్స్, అన్ హెల్తీ హ్యాబిట్స్ అయిన స్మోకింగ్, డ్రింకింగ్ వంటివి మీ పెదాల ఆకర్షణనే దెబ్బతీస్తాయి. అందంగా ఆకట్టుకోవాల్సిన పెదాలు నల్లగా, అసహ్యంగా మారేలా చేస్తాయి.
కాబట్టి మీరు అందమైన పెదాల కోసం ఎదురుచూస్తుంటే.. ఇక్కడో సింపుల్ చిట్కా అందుబాటులో ఉంది. అది కూడా చాలా తేలికగా ఇంట్లోనే లిప్ స్క్రబ్ తయారు చేసుకుని.. అందమైన, పింక్ కలర్ పెదాలను పొందవచ్చు.
ఈ స్క్రబ్ తయారు చేయడానికి కేవలం బ్రౌన్ షుగర్, కొబ్బరి నూనె అవసరమవుతాయి. ఈ రెండు పవర్ ఫుల్ పదార్థాలు చాలు.. మీ పెదాలను స్మూత్ అండ్ సాఫ్ట్ షైనీ లుక్ అందివ్వడానికి. ఈ లిప్ స్క్రబ్ తయారు చేసుకుని వాడటం వల్ల.. పెదాలు వెంటనే.. మంచి రంగును పొందుతాయి.

బ్రౌన్ షుగర్ న్యాచురల్ ఎక్ఫోలియంట్ గా పనిచేస్తుంది. వ్యర్థాలను తొలగించడమే కాకుండా, డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగిస్తుంది. కొబ్బరినూనె పెదాలకు ఎక్సలెంట్ మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. కొబ్బరినూనెలో దాగున్న బ్యూటీ బెన్ఫిట్స్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు కదూ.
పెదాలకు సంబంధించిన ఎలాంటి సమస్యకైనా.. ఈ హోంమేడ్ స్క్రబ్ చక్కటి పరిష్కారం. డ్రైనెస్ ని తొలగిస్తుంది. నల్లగా కమిలిన పెదాలను నివారిస్తుంది. ఈ రెండు పదార్థాలతో తయారు చేసిన స్క్రబ్ తో మీకు కావాల్సిన పెదాల అందం పొందవచ్చు.

కావాల్సిన పదార్థాలు
2 టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగర్
1 టీస్పూన్ కొబ్బరినూనె
1 టీస్పూన్ ఆర్గానిక్ హనీ (అవసరమైతే)
తయారు చేసే విధానం
అన్నింటినీ ఒక గిన్నెలో కలపాలి.
బాగా మిక్స్ చేసి పేస్ట్ తయారు చేసుకోవాలి
ఈ మిశ్రమాన్ని 10 నుంచి 15 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టాలి
బయటకు తీసి.. కాసేపు కలపాలి
దీన్ని లిప్స్ పట్టించాలి.
స్క్రబ్ ప్యాడ్ తీసుకుని.. కాసేపు స్క్రబ్ చేయాలి
15 నుంచి 25 నిమిషాల తర్వాత.. గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి
దీన్ని ఒక టైట్ కంటెయినర్ లో భద్రపరుచుకోవాలి. ఒకవేళ టెంపరేచర్ పెరిగితే.. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. లేదంటే కరిగిపోతుంది. ఈ స్క్రబ్ ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల.. పగిలిన, నల్లగామారిన పెదాలు.. స్మూత్ గా, పింక్ కలర్ లోకి మారుతాయి.



Click it and Unblock the Notifications