Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
హెయిర్ రిమూవింగ్ కి రేజర్ ఉపయోగించేవాళ్లు చేయకూడని పొరపాట్లు..!
మీరు ఇంట్లోనే అన్ వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకుంటారా..? అది కూడా రేజర్ ఉపయోగించి షేవ్ చేసుకుంటారా.. ? చాలా సందర్భాల్లో వ్యాక్సింగ్ కి టైం లేక.. ఇంట్లోనే రేజర్ చేసుకోవాలని డిసైడ్ అవుతారు. ఇలాంటప్పుడు కాళ్లపై ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి.. కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి.
చాలా మంది మహిళలు చాలా సందర్భాల్లో పార్లర్ కి వెళ్లే టైంలేక ఇంట్లోనే.. రేజర్ తో హెయిర్ రిమూవ్ చేసుకుంటారు. అలాగే రెగ్యులర్ గగా పార్లర్ లో చేయించుకోవడానికి డబ్బులు కూడా ఎక్కువ అవుతాయి. అందుకే.. రేజర్ తో హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
అలాగే చాలామంది హెయిర్ షేవింగ్ కంటే హెయిర్ వ్యాక్సింగ్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని నమ్ముతారు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో రేజర్ తో తొలగించుకుంటారు. అయితే.. షేవింగ్ చేసుకునేటప్పుడు చాలామంది మహిళలు కొన్ని తప్పులు చేస్తారు. ఈ తప్పులు చర్మాన్ని డ్యామేజ్ చేసి.. హెయిర్ గ్రోత్ కి కారణమవుతాయి.
కాబట్టి చర్మానికి హాని కలిగించే.. ఆ తప్పులు ఏంటి పొరపాట్లు చేయకుండా.. తేలికగా రేజర్ తో హెయిర్ తొలగించుకునే టెక్నిక్స్ చూద్దాం..

వేగంగా షేవ్ చేయడం
చాలామంది టైం లేదన్న తొందరలో చాలా వేగంగా.. రేజర్ తో హెయిర్ రిమూవ్ చేస్తారు. దీనివల్ల రేజర్ బర్న్స్ ఏర్పడతాయి. స్కిన్ టిష్యూ స్ కి కూడా డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి.. నెమ్మదిగా, జాగ్రత్తగా హెయిర్ తొలగించుకోవాలి.

క్రీమ్ వాడకపోవడం
కాళ్లకు షేవింగ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా షేవింగ్ క్రీమ్ లేదా సోప్ వాడాలి. దీనివల్ల హెయిర్ సాఫ్ట్ గా మారి.. తేలికగా తొలగిపోతాయి.

చర్మాన్ని తడి చేయకపోవడం
షేవింగ్ ముందు కాళ్లను నీటిలో కొన్ని నిమిషాలు నానబెట్టడం లేదా స్నానం చేసిన తర్వాత షేవ్ చేసుకోవడం వల్ల.. హెయిర్ సాఫ్ట్ గా, తొలగించడానికి తేలికగా మారుతుంది.

సింగిల్ బ్లేడ్ రేజర్ వాడటం
చాలా రేజర్స్ కి ఎక్కువ బ్లేడ్స్ ఉండి, తేలికగా హెయిర్ తొలగించడమే కాకుండా.. చర్మాన్ని స్మూత్ చేసేలా ఉంటాయి. కానీ.. ఇలా కాకుండా.. ఒకే బ్లేడ్ ఉన్న రేజర్ వాడకూడదు.

రెగ్యులర్ గా ఎక్స్ ఫోలియేట్ చేయకపోవడం
రెగ్యులర్ గా మీ కాళ్లను షేవ్ చేస్తుంటే.. ఖచ్చితంగా చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయాలి. స్క్రబ్ ఉపయోగించడం వల్ల ఇన్ గ్రోన్ హెయిర్ ని నివారించవచ్చు.

మాయిశ్చరైజర్ ఉపయోగించకపోవడం
షేవింగ్ చేసిన తర్వాత ఖచ్చితంగా కాళ్లను చల్లటి నీటితో శుభ్రం చేసి.. కొద్దిగా మాయిశ్చరూజర్ అప్లై చేయాలి. దీనివల్ల రాషెస్, ఇరిటేషన్, బర్న్ ని నివారించవచ్చు.

రేజర్ షేర్ చేసుకోవడం
రేజర్ ని ఫ్యామిలీ మెంబర్స్ తో, లేదా ఫ్రెండ్స్ ఎట్టిపరిస్థితుల్లో షేర్ చేసుకోకూడదు. దీనివల్ల ఇన్ఫెక్షన్స్, వ్యాధులను అరికట్టవచ్చు.



Click it and Unblock the Notifications