For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట్లోనే పర్ఫెక్ట్ గా పెడిక్యూర్ చేసుకునే సింపుల్ స్టెప్స్..!!

By Swathi
|

మనం నిర్లక్ష్యం చేసేవాటిలో పాదాలు ఒకటి. ఎందుకంటే.. పాదాలను ఎవరు పట్టించుకుంటారులే.. ఎవరు చూస్తారులే అని భావిస్తారు. కానీ.. అది తప్పు. పాదాలు, చేతులను సరిగ్గా మెయింటెయిన్ చేయని వాళ్లపై.. ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బ్యాడ్ గా పడుతుందని.. ఆఖరికి పార్ట్ నర్స్ కూడా.. అసహ్యించుకుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.

పాదాలకు చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఎక్కువగా నడవడం, వర్క్ షెడ్యూల్స్ కారణంగా.. చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అలాగే.. సన్ ఎక్స్ పోజర్ కూడా.. పాదాలకు చాలా డ్యామేజ్ చేస్తుంది. అలాగే పాదాలు ఎక్కువగా ఎక్స్ పోజ్ అవుతూ ఉంటాయి, అలాగే.. సన్ స్క్రీన్ లోషన్స్, మాయిశ్చరైజర్ ఉపయోగించకుండా.. పాదాలను నిర్లక్ష్యం చేస్తుంటాం.

కాళ్లపై ఉండే చర్మంతో పోల్చితే.. పాదాలపై ఉండే చర్మం చాలా పల్చగా ఉంటుంది. అందుకే.. చాలా త్వరగా, ఎక్కువగా డ్యామేజ్ అయి, ముడతలు కనిపిస్తాయి. దీనివల్ల పాదాలు చాలా ఓల్డ్ గా కనిపిస్తాయి. అలాగే.. ఏజింగ్ లక్షణాలు.. మొదటగా.. పాదాల్లోనే కనిపిస్తాయి.

పాదాల సంరక్షణకు రెగ్యులర్ గా సన్ స్క్రీన్ రాసుకోవడం చాలా అవసరం. అయితే.. ఇప్పటికే డ్యామేజ్ అయిన వాటికి ఏం చేయాలి ? పెడిక్యూర్ చక్కటి పరిష్కారం. అయితే.. పెడిక్యూర్ కోసం పార్లర్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే సింపుల్ గా పెడిక్యూర్ చేసుకోవచ్చు. అదెలాగో.. స్టెప్ బై స్టెప్ చూద్దాం..

నానబెట్టడం

నానబెట్టడం

చిన్న టబ్ తీసుకుని గోరువెచ్చని నీటితో నింపాలి. కొద్దిగా షాంపూ లేదా బాడీ వాష్ కలపాలి. నెయిల్ పాలిష్ లేకుండా.. కాలి వేళ్లు ఉండాలి. ఇప్పుడు టబ్ లో పాదాలను నానబెట్టుకోవాలి. 2 నుంచి 5 నిమిషాలు ఇలానే నీటిలో ఉంచుకోవాలి.

ప్యూమిస్ స్టోన్

ప్యూమిస్ స్టోన్

5 నిమిషాల తర్వాత పాదాలను నీటిలో నుంచి తీసేయాలి. ఇప్పుడు డెడ్ స్కిన్ సాఫ్ట్ గా మారి ఉంటుంది. తేలికగా స్క్రబ్ చేయవచ్చు. ఇప్పుడు ప్యూమిస్ స్టోన్ ఉపయోగించి.. స్క్రబ్ చేస్తూ.. అరికాళ్లలో డెడ్ స్కిన్ తొలగించాలి.

స్క్రబ్

స్క్రబ్

పాదాల పైభాగాన్ని ఫూట్ స్క్రబ్ తో లేదా ఆలివ్ ఆయిల్, సాల్ట్ మిశ్రమంతో స్క్రబ్ చేయాలి. గుండ్రంగా స్క్రబ్ చేయాలి. తర్వాత పాదాలను శుభ్రం చేసుకోవాలి.

నెయిల్

నెయిల్

పాదాల గోళ్లను కట్ చేసి.. మంచి షేప్ చేసుకోవాలి. ప్యూమిస్ స్టోన్ ఉపయోగించి.. శుభ్రంగా కనిపించేలా చేసుకోవాలి.

ఆయిల్

ఆయిల్

ఆముదం లేదా ఆల్మండ్ ఆయిల్ ని గోళ్లకు రాసుకోవాలి. 5 నిమిషాల తర్వాత.. చిగుళ్లను మర్దనా చేయాలి. ఆయిల్ గోళ్లను సాఫ్ట్ గా మారుస్తుంది.

పాలిష్

పాలిష్

మీకు నచ్చిన నెయిల్ పాలిష్ ఉపయోగించాలి. ట్రాస్పరెంట్ బేస్ కోట్ వేసుకుని తర్వాత.. రెండు మూడు కోట్స్ నెయిల్ పాలిష్ అప్లై చేయాలి.

మాయిశ్చరైజర్

మాయిశ్చరైజర్

చివరగా.. పాదాలకు మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. అంతే సింపుల్ గా ఇంట్లోనే పెడిక్యూర్ పూర్తయింది.

English summary

Steps For A Perfect Pedicure At Home!

Steps For A Perfect Pedicure At Home! Our feet are often the most ignored because we tend to think that no one ever really notices them. Well, that is a misconception, dear readers.
Story first published:Thursday, July 28, 2016, 17:17 [IST]
Desktop Bottom Promotion