Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పచ్చగా ఉన్న పళ్లను తెల్లగా మార్చే సర్‌ప్రైజింగ్ హోం రెమిడీస్
ముఖానికి అందం చిరునవ్వు... చిరునవ్వుకి ఆకర్షణ మెరిసే పళ్లు. అందంగా కనిపించాలన్నా.. ఆకట్టుకునేలా నవ్వాలన్నా.. పళ్ల వరుస ఎట్రాక్టివ్ గా ఉండాలి. మిళమిళ మెరిసే తెల్లటి పళ్లు ఉండాలి. నలుగురిలో హాయిగా నవ్వడానికి.. ఆకర్షణీయంగా కనపడటానికి పళ్ల పాత్ర చాలానే ఉంది. కాబట్టి పళ్లు అందంగా.. ఎట్రాక్టివ్ గా.. ఉండాలి.
రోజూ బ్రష్ చేసినా.. కొంతమందికి పళ్లు పచ్చగా.. అందవిహీనంగా కనిపిస్తూ ఉంటాయి. మరికొందరికి ఆల్కహాల్, స్మోకింగ్ కారణంగా పళ్లు గారపట్టింటాయి. గారపట్టిన పళ్ల వల్ల నలుగురిలో హాయిగా నవ్వలేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. గారపోగొట్టుకోవడానికి రోజుకి రెండుసార్లు బ్రష్ చేసినా కొంతమందికి పచ్చగానే కనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇంట్లోనే ఉండే సహజ వస్తువులతో.. కొంతకాలంలోనే మీ పళ్లను తెల్లగా మార్చేసే అద్భుతాలున్నాయి. మెరిసే దంతాల కోసం ఈ ఈజీ అండ్ హెల్తీ టిప్స్ మీ కోసం...

చార్‌కోల్
చార్‌కోల్ తో పళ్లను బ్రష్ చేసుకోవడం వల్ల క్రిములు, పసుపు దనం ఎఫెక్టివ్ గా తొలగిపోతుంది. చార్ కోల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటటం వల్ల పళ్లపై ఉండే క్రిములను తొలగిస్తాయి.

అరటితొక్క
అరటి తొక్కతో రెగ్యులర్ గా పంటిపై రుద్దుతూ ఉండటం వల్ల.. పళ్లు తెల్లగా మారతాయి. అరటిపండు తొక్కలో మెగ్నీషినం, పొటాషియం ఉండటం వల్ల న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది.

యాపిల్ సైడర్ వెనిగర్
యాపిల్ సైడర్ వెనిగర్ లో న్యాచురల్ బ్లీచింగ్ గుణాలు ఉంటాయి.. ఇవి పళ్లను తెల్లగా మారుస్తాయి. బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

పసుపు
పసుపు ఉపయోగించి.. పళ్లను బ్రష్ చేసుకోవడం వల్ల.. పళ్లు తెల్లగా, షైనీగా మారుతాయి. ఇవి న్యాచురల్ పాలిషింగ్ ఎఫెక్ట్ ని ఇస్తాయి.

కొబ్బరినూనె
కొబ్బరినూనెతో పళ్లను రుద్దుకోవడం వల్ల.. అవి తెల్లగా మారతాయి. పాచి, క్రిములను తొలగిస్తుంది.

సాల్ట్
పళ్లపై పాచిని తొలగించి క్రిములను తొలగించే న్యాచురల్ పదార్థం సాల్ట్. దీంతో పళ్లను స్క్రబ్ చేస్తే ఎఫెక్టివ్ ఫలితాలు పొందవచ్చు.

స్ట్రాబెర్రీ
ఫ్రెష్ స్ట్రాబెర్రీతో పంటిపై రుద్దాలి. ఇది పళ్లు తెల్లబడటానికి సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల పళ్లు తెల్లగా మెరిసిపోవడానికి సహాయపడతాయి.

డార్క్ చాకొలేట్
మీరు విన్నది నిజమే. స్వీట్ ఎక్కువగా ఉండదు కాబట్టి డార్క్ చాకొలేట్ పంటి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే.. థియోబ్రొమైన్ దంతాల ఎనామిల్ ని ప్రొటెక్ట్ చేస్తూ.. పసుపుదనాన్ని, క్రిములను పోగొడుతుంది.

బేకింగ్ సోడా
బేకింగ్ సోడా.. దంతాల సంరక్షణలో ఉపయోగపడుతుంది. సగం గ్లాస్ నీళ్లలో, సంగం టీ స్పూన్ బేకింగ్ సోడా మిక్స్ చేయాలి. అందులో మీ బ్రష్ ముంచి.. దంతాలను శుభ్రం చేసుకోవాలి. రోజూ ఇలా చేయడం వల్ల.. నెలరోజుల్లో మీ పళ్లు మెరిసిపోతాయి.

నారింజ తొక్క
మెరిసే దంతాలకు నారింజ లాంటి సిట్రస్ ఫ్రూట్స్ బాగా ఉపయోగపడతాయి. నారింజ తొక్కలో డి నెమనిన్ ఉంటుంది. ఇది స్మోకింగ్ వల్ల పళ్లపై ఏర్పడే క్రిములను తొలగించడానికి సహాయపడుతుంది. కాబట్టి ఆరంజ్ తొక్కతో రోజుకి రెండుసార్లు పళ్లపై మసాజ్ చేసి చూడండి.. ఫలితం మీకే తెలుస్తుంది.

తులసి
దంతాల సంరక్షణకు, దంతాల తెల్లదనానికి తులసి సహజ ఔషధం. ఇది పళ్లపై పేరుకున్న బ్యాక్టీరియాని తొలగించి.. దంతాలు తెల్లగా మెరిసిపోవడానికి సహాయపడతాయి. కాబట్టి రోజూ తులసి ఆకులను నమలడం అలవరుచుకోండి.



Click it and Unblock the Notifications