Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వారం రోజుల్లో మెడ నలుపుదనాన్ని పోగొట్టే ఎఫెక్టివ్ హోం రెమిడీ..
కొంతమందికి శరీరం మొత్తం తెల్లగా, సాధారణంగా ఉంటుంది. కానీ.. మెడ విషయానికి వచ్చేసరికి.. నల్లగా మారి, అసహ్యంగా కనిపిస్తుంది. దీనివల్ల నలుగురిలోకి వెళ్లినప్పుడు అది ఎక్కడ హైలెట్ అవుతుందో అన్న టెన్షన్ ఉంటుంది. ఇలాంటి సమస్య మీరు ఫేస్ చేస్తుంటే.. టెన్షన్ పడకండి.. ఇక్కడ చెప్పబోయే సింపుల్ హోం రెమిడీ ట్రై చేయండి.
శరీరంలో త్వరగా గుర్తించే భాగాల్లో మెడ ఒకటి. ఎలాంటి డ్రెస్ వేసుకున్నా.. మెడ మాత్రం ఇట్టే కనిపిస్తుంది. అలాగే.. మోచేతులనైనా.. డ్రెస్ తో కవర్ చేయవచ్చు.. కానీ.. మెడను కవర్ చేయడం కష్టం. ప్రతిసారి నెక్ ని కవర్ చేయలేం.

మెడ నల్లగా మారడానికి చాలా కారణాలుంటాయి. క్లీన్ చేయకపోవడం, స్క్రబ్ చేయకపోవడం, ఆత్రంతా స్నానం చేయడం వల్ల మెడ శుభ్రతను నిర్లక్ష్యం చేయడం వల్ల.. అక్కడ డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోతాయి. దీనివల్ల అది నల్లగా మారుతుంది.
ఇలాంటి డార్క్ నెక్ ని తెల్లగా, మెరిసేలా మార్చుకోవాలని మీరు భావిస్తే.. ఇక్కడున్న హోంమేడ్ ప్యాక్ ట్రై చేయండి. కేవలం వారం రోజుల్లో మీ మెడ నలుపుదనాన్ని పోగొట్టుకోవచ్చు. అయితే ఈ ప్యాక్ ని రెగ్యులర్ గా వారం రోజులు వేసుకోవాలి.

కావాల్సిన పదార్థాలు
ఆలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్
ఉప్పు 2 టీ స్పూన్లు
బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్
మీ నెక్ వారం రోజుల్లో తెల్లగా మారాలంటే.. ఈ ప్యాక్ ని రెగ్యులర్ గా అప్లై చేయాలి. ఆలివ్ ఆయిల్, ఉప్పు, బేకింగ్ సోడా అన్ని చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అలాగే చర్మ సంరక్షణపై శ్రద్ధ వహించాలి. ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఈ ఉంటుంది. ఇది చర్మానికి పోషణను అందిస్తుంది.

ఉప్పు న్యాచురల్ స్కిన్ ఎక్స్ ఫోలియేటింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ని బయటకు పంపి.. చర్మాన్ని స్మూత్ గా మార్చేస్తుంది. బేకింగ్ సోడా న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని తెల్లగా మార్చడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
ప్యాక్ తయారు చేసే విధానం, ఉపయోగించే విధానం
పైన చెప్పిన పదార్థాలన్నింటినీ.. ఒక గిన్నెలో మిక్స్ చేసుకోవాలి.
అన్నింటినీ బాగా కలిపి.. పేస్ట్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని నల్లగా మారిన మెడకు పట్టించాలి.
కొన్ని నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలి.
15 నిమిషాలు ఆరిన తర్వాత.. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications