For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముత్యాల్లాంటి తెల్లటి పళ్లు.. గార పట్టడానికి కారణమయ్యే ఆహారాలు..!

By Swathi
|

వైట్ షర్ట్ పై కాఫీ లేదా టీ పడేస్తే.. ఏమవుతుంది.. మరక పడుతుంది కదా.. అలాగే.. మీ పళ్లకు కూడా అంతే. తెల్లటిపళ్లపై చాలా తేలికగా మరకలు పడతాయి. అందుకే.. ఒక్కోసారి తెల్లగా ఉన్న పళ్లు.. పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి. ఇందుకు కారణం.. మనం తీసుకునే ఆహారమే.

ముఖ్యంగా పళ్లు పసుపు రంగులోకి మారడానికి కలర్ ఫుడ్స్, ఎసిడిక్ ఫుడ్స్ ప్రధాన కారణం. కాబట్టి ఇలాంటి ఆహారాలు తిన్న తర్వాత పళ్లను శుభ్రం చేసుకోవడం మంచిది. కానీ.. వీటి తిన్న గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

అయితే పళ్లు పసుపు పచ్చగా మారడానికి కారణమయ్యే ఆహారాలేంటో తెలుసుకుని.. వాటికి సాధ్యమైనంతవరకు దూరంగా ఉంటే.. మీ పళ్లు.. తెల్లగా, ముత్యాల్లా మెరిసిపోతాయి. మరి ఆ ఫుడ్స్ లిస్ట్ ఏంటో చూసేద్దామా..

బ్లాక్ టీ

బ్లాక్ టీ

బ్లాక్ టీలో టాన్నిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ పళ్ల కలర్ ని మార్చే అవకాశం ఉంది. కాబట్టి.. బ్లాక్ టీ బదులు గ్రీన్ టీ తాగడం మంచిది.

సాఫ్ట్ డ్రింక్స్

సాఫ్ట్ డ్రింక్స్

సాఫ్ట్ డ్రింక్స్ లో ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్ ఉంటాయి. అవి వెంటనే మీ పళ్ల కలర్ ని పచ్చగా మార్చేస్తాయి. అలాగే ఈ డ్రింక్స్ లో సిట్రస్ యాసిడ్, ఎనామిల్, షుగర్ ఉంటుంది. ఇవి టూత్ డికేకి.. కారణమవుతాయి.

గ్రేవీలు

గ్రేవీలు

ఇండియన్స్ గ్రేవీ కర్రీస్ ని ఎక్కువ ఇష్టపడతారు. వీటిల్లో పసుపు, కారం ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆహారాలకు మంచి రంగుని ఇస్తాయి. కానీ.. పంటికి హాని చేస్తాయి. చాలా రెస్టారెంట్స్ ఫుడ్ కలరింగ్ ని ఉపయోగించడం వల్ల ఫుడ్ టేస్టీగా ఉంటుంది.. అలాగే.. పంటి కలర్ ని మార్చేస్తాయి.

బీట్ రూట్

బీట్ రూట్

బీట్ రూట్ లో కలర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి.. జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల.. ఎక్కువ ప్రభావం చూపుతాయి.

బ్లాక్ కాఫీ

బ్లాక్ కాఫీ

కాఫీలో ఎసిడిక్ ఉంటుంది. ఇది.. పంటిలో మరకలకు కారణమవుతుంది. కాఫీలో పాలు చేర్చుకోవడం వల్ల పళ్లు డ్యామేజ్ అవకుండా కొంతవరకు అడ్డుకోవచ్చు.

వైన్

వైన్

రెడ్ వైన్ ను పరిమితిగా తీసుకుంటే గుండెకు ాచలా మంచిది. కానీ.. ఇందులో కూడా టాన్నిన్స్ ఉంటాయి. అవి పంటిపై పసుపు రంగుకి కారణమవుతాయి.

క్యాండీ

క్యాండీ

స్వీట్స్, క్యాండీ, చూయింగ్ గమ్ వంటి వాటిల్లో ఆర్టిఫిషియల్ కలర్స్ ఉంటాయి. అవి.. మీ పంటిపై ఎనామిల్ ని తొలగిస్తాయి. కాబట్టి షుగర్ లేని గమ్స్ తీసుకోవాలి. స్వీట్స్, క్యాండీస్ కి దూరంగా ఉండాలి.

ఫ్రూట్ జ్యూస్

ఫ్రూట్ జ్యూస్

ఫ్రూట్ జ్యూస్ లు ముఖ్యంగా డార్క్ కలర్ వి గ్రేప్, క్రాన్ బెర్రీ వంటి కలర్ ఫుల్ జ్యూస్ లు.. పంటిపై, నాలుకపై అలానే ఉంటాయి. కాబట్టి ఎంత వీలైతే అంత జ్యూస్ లకంటే.. అలాగే ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది.

సోయా సాస్

సోయా సాస్

సోయా సాస్ ని ఎక్కువ చైనీస్ వంటకాల్లో వాడతారు. ఇందులో డార్క్ కలర్ ఉంటుంది. కానీ.. ఈ కలర్ మీ పళ్లపై మరకలు ఏర్పడటానికి కారణమవుతుంది.

English summary

These 9 Foods Are Turning Your Pearly Whites Yellow

These 9 Foods Are Turning Your Pearly Whites Yellow. Here’s a list of foods and beverages you should watch out for.
Story first published: Friday, October 7, 2016, 13:29 [IST]
Desktop Bottom Promotion