Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆలివ్ ఆయిల్లోని అమేజింగ్ బ్యూటీ బెనిఫిట్స్
ఆలివ్ రుచినీ, సువాస ననీ, విటమిన్స్‌నీ, సహజ లక్షణా లనీ, గుణాలనీ పదిలపరచు కున్న సహజమైన ఫలరసం ఆలి వ్ ఆయిల్. ఆలివ్ పండులోంచి పిండగానే వెనువెంటనే ఎంతో స్వాదిష్టంగా సేవించగలిగిన ఆయిల్ ఇది ఒక్కటే. ఆలివ్ ఆయిల్‌ని ఎప్పుడూ సూర్యరశ్మి సోకే చోట వుంచకూడదు. సీసా మూత గట్టిగా మూసి, చల్లగా పొడిగా వుండే ప్రదేశాల్లో మాత్రమే పెట్టాలి.
ఏ ఉష్ణోగ్రతలలోనైనా ఆలివ్ ఆయిల్‌కి కొద్దిగా గాలి సోకినా అందులో రాన్‌సిడిటీ పెరిగిపోతుంది. కనుక మన గుండె బలానికీ, క్యాన్సర్ నివారణకీ ఎంతగానో దోహదం చేసే ఆలివ్ ఆయిల్‌ని ఎంతో భద్రంగా పదిల పరచి వాడుకుంటే, నిస్సందేహంగా ఆలివ్ ఆయిల్ మనపాలిట సంజీవనిగా పనిచేస్తుంది. అంతే కాకుండా ఆలివ్ ఆయిల్ చర్మ సంరక్షణలోనూ, జుట్టు సంరక్షణలోనూ ఎంతో ఉపయోగపడుతుంది.

పొడిచర్మం
పొడిచర్మం ఉన్నవారు ఆలివ్‌ఆయిల్‌లో నిమ్మరసాన్ని కలిపి ముఖానికి ఆరారగా రాస్తూంటే ముఖ చర్మం తేమగా ఉంటుంది. కాంతిగానూ, మృదువుగానూ మారుతుంది.

పాదాల పగుళ్
ఆలివ్‌ఆయిల్‌లో పసుపుపొడిని కలిపి పాదాల పగుళ్ళకు, వేళ్ళమధ్య పాసిన చర్మానికి రాస్తూంటే ఆ బాధ తగ్గిపోయి, చర్మం చక్కగా ఉంటుంది.

పెదాలకు
ఆలివ్‌ఆయిల్‌లో నిమ్మరసాన్ని కలిపి పెదాలకు రాయడం వల్ల పెదాలు పగలవు.

గోళ్ళ ధృడత్వం
ఆలివ్ ఆయిల్‌లో టమాటోరసం, క్యారెట్‌జ్యూస్, పెరుగు కలిపి మచ్చల మీద రాస్తూంటే, గోళ్ళ దృఢత్వం, అందం పెరుగుతాయి. ఆలివ్‌ఆయిల్‌ను గోళ్ళమీద ప్రతిరోజూ రాస్తూంటే, గోళ్ళ ధృడత్వం, అందం పెరుగుతాయి.

చర్మానికి మంచి కాంతి, నునుపుదనం, తేమ
చర్మం పొడారిపోయినట్లుగా కళావిహీనంగా ఉంటే ఆలివ్ ఆయిల్‌లో పాలనుకానీ, పాలమీగడను కానీ కలిపి ఆ మిశ్రమంతో మృదువుగా మసాజ్‌చేసి, ఆ తర్వాత నీటితో చర్మాన్ని శుభ్రపరిస్తే చర్మానికి మంచి కాంతి, నునుపుదనం, తేమ ఏర్పడతాయి.

ముఖవర్ఛస్సు పెరుగుతుంది
ఆలివ్ ఆయిల్‌తో తేనెను కలిపి ముఖానికి రాసి, కొంతసేపయిన తర్వాత ముఖాన్ని మెత్తని సున్నిపిండితో రుద్దుకుని కడుక్కుంటే ముఖవర్ఛస్సు పెరుగుతుంది.

స్నానం చేసే నీటిలో ఆలివ్ ఆయిల్‌ని
స్నానం చేసే నీటిలో ఆలివ్ ఆయిల్‌ని కలిపి, ఆ నీటితో స్నానం చేసినట్ల యితే చర్మానికి నూతన కాంతి కలుగుతుంది.

ఆలివ్ ఆయిల్‌తో చర్మాన్ని మసాజ్
ఆలివ్ ఆయిల్‌తో చర్మాన్ని మసాజ్ చేయడం వల్ల చర్మానికి మృదుత్వం ఏర్పడుతుంది.

చేతులు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి.
చెంచా గ్లిజరిన్, కొద్దిగా రోజ్‌వాటర్, రెండుచెంచాల ఆలివ్‌నూనె, కాస్త నిమ్మరసం, గుడ్డులోని తెల్లసొన కలిపి చేతులకు,కాళ్లకు పూతలా వేసుకోవచ్చు. ఆరాక కడిగేసుకుంటే చాలు... చేతులు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి.

చర్మం పొడారిపోయినట్లుగా కళావిహీనంగా ఉంటే
చర్మం పొడారిపోయినట్లుగా కళావిహీనంగా ఉంటే ఆలివ్ ఆయిల్‌లో పాలనుకానీ, పాలమీగడను కానీ కలిపి ఆ మిశ్రమంతో మృదువుగా మసాజ్‌చేసి, ఆ తర్వాత నీటితో చర్మాన్ని శుభ్రపరిస్తే చర్మానికి మంచి కాంతి, నునుపుదనం, తేమ ఏర్పడతాయి.



Click it and Unblock the Notifications