Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
లిప్ బామ్ రాసినా... వెంటనే పెదాలు పొడిబారిపోతున్నాయా ?
చూడగానే ఆకట్టుకునేవి పెదాలు. మాట్లాడినా, నవ్వినా ఎదుటివాళ్ల చూపు పెదాలవైపే వెళ్తుంది. కాబట్టి అవి అందంగా, స్మూత్ గా ఉంటేనే మీరు ఎట్రాక్టివ్ గా కనిపిస్తారు. అందుకోసం లిప్ బామ్, లిప్ కేర్ వంటివి వాడుతూ ఉంటారు. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు లిప్ స్టిక్ తో మరింత ఆకర్షణీయంగా.. పెదాల అందాన్ని మార్చేస్తారు.
కానీ కొంతమందికి పెదాలు మాటిమాటికీ తడారిపోతూ ఉంటాయి. ఎన్ని సార్లు లిప్ కేర్ రాసినా, ఎంత మోతాదులో మంచినీళ్లు తాగినే.. పెదాలు మాత్రం పొడిబారి తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పెదాలు డ్రై అయితే.. చాలా అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఇలా చాలా పొడిబారిన పెదాలను హోం రెమిడీస్ తో ట్రీట్ చేయండి.. స్మూత్ అండ్ షైనీ లిప్స్ మీ సొంతం చేసుకోండి.

పంచదార
పంచదార తీసుకుని స్క్రబ్ లా ఉపయోగించండి. ఇది పెదాలపై డార్క్ నెస్, డెడ్ స్కిన్ ని తొలగించి.. పింక్ కలర్ లిప్స్ పొందేలా చేస్తుంది. రోజూ పంచదారతో స్క్రబ్ చేస్తూ ఉంటే.. డార్క్ లిప్స్ ని పింక్ లిప్స్ గా మార్చేయవచ్చు.

పాలు, గులాబీ రెక్కలు
కొన్ని గులాబీ రెక్కలు తీసుకుని పాలు కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని లిప్స్ పై రాస్తూ ఉండాలి. పాలు డార్క్ కలర్ ని తొలగిస్తే, గులాబీ రెక్కలు.. పింక్ అండ్ గార్జియస్ పెదాలను అందిస్తాయి.

కొత్తిమీర
రాత్రి పడుకోవడానికి ముందు తాజా కొత్తిమీర తీసుకుని పెదాలపై రుద్దాలి. రాత్రంతా అలానే ఉంచుకుని.. ఉదయాన్నే తేడా గమనించండి.

ఆలివ్ ఆయిల్
పెదాలపై ఒకటి లేదా రెండు చుక్కల ఆలివ్ ఆయిల్ తీసుకుని మసాజ్ చేయాలి. పెదాలపై డార్క్ నెస్ తగ్గించి.. పెదాలకు మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది.

నిమ్మరసం
నిమ్మరసం చర్మం, జుట్టు సంరక్షణలో చాలా బాగా పనిచేస్తుందని అందరికీ తెలుసు. కానీ ఇది పెదాల అందానికి కూడా ఉపయోగపడుతుందని చాలామందికి తెలియకపోవచ్చు. రెండు, మూడు చుక్కల నిమ్మరసం పెదాలకు పట్టించాలి. తర్వాత బాగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే పెదాలపై ఉండే నలుపుదనం పోతుంది.

గులాబీ
రెండు, మూడు చుక్కల రోజ్ ఫ్లవర్ ఆయిల్ తీసుకుని పెదాలకు రాసుకోవాలి. ఇది పెదాలకు న్యాచురల్ గా పింక్ కలర్ ఇస్తుంది.

ఆరంజ్ పీల్
నారింజ తొక్క పెదాల అందానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఆరంజ్ పీల్ తో పెదాలను మసాజ్ చేసి చూడండి.. ఎలాంటి మిరాకిల్ జరుగుతుందో.

బ్రష్
ఉదయాన్నే టూత్ బ్రష్సింగ్ అయ్యాక.. మీ పెదాలకు బ్రష్ చేయండి. రోజూ ఇలా బ్రష్ చేస్తూ ఉంటే.. డెడ్ స్కిన్ తొలగిపోతుంది. ఇలా బ్రష్ చేసిన తర్వాత లిప్ బామ్ రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

కొబ్బరినూనె, ఆల్మండ్ ఆయిల్
కొబ్బరినూనె, ఆల్మండ్ ఆయిల్ సమానంగా తీసుకుని మిక్స్ చేయాలి. ఈ మిక్స్ ని లిప్ బామ్ మాదిరిగా తరచుగా అప్లై చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే.. పెదాలు పొడిబారడం తగ్గిపోయి.. పింక్ కలర్ లోకి మారతాయి.

వెన్న
పెదాలకు వెన్న రాసుకోండి. రెగ్యులర్ గా వెన్నను పెదాలకు రాయడం వల్ల సహజ మాయిశ్చరైజర్ లా పనిచేసి.. స్మూత్ గా ఉండటానికి సహాయపడుతుంది. నెయ్యి కూడా పొడిబారిన పెదాలకు మంచి ట్రీట్మెంట్.



Click it and Unblock the Notifications