For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అధిక చెమటను న్యాచురల్ గా తగ్గించే టాప్ సొల్యూషన్స్

By Swathi
|

కొంతమందికి స్నానం చేసీ చేయగానే.. చెమటతో ఇబ్బందిపడుతుంటారు. చెమట ఎక్కువగా ఉందని రెండు మూడు సార్లు స్నానం చేసినా.. ఫలితం ఉంటుంది. మళ్లీ అదే సమస్య. ఫ్యాన్లు, ఏసీల కోసం ఆరాటపడుతుంటారు. అండర్ ఆర్మ్స్ తో పాటు చేతులు, పాదాల అడుగుభాగంలో ఎక్కువగా చెమట పడుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ల కోసం కొన్ని సింపుల్ హోం రెమిడీస్ ఉన్నాయి.

సమ్మర్ లో ఉదయాన్నే పుదిన వాటర్ తాగడం వల్ల పొందే హెల్త్ బెన్ఫిట్స్

సాధారణంగా చెమట ద్వారా.. శరీరం నార్మల్ టెంపరేచర్ కలిగి ఉండటానికి, టాక్సిన్స్ శరీరంలో నుంచి బయటకు వెళ్లడానికి సహాయపడతాయి. సాధారణంగా కంటే.. ఎక్కువ చెమట పట్టడాన్ని ఎక్సెసివ్ స్వెట్టింగ్ అని పిలుస్తారు. ఇది శరీరంలోని అనేక భాగాలపై ప్రభావం చూపుతుంది. నుదురు, స్కాల్ఫ్, నెక్, చంకలు, అరచేతులు, పాదాల అడుగుభాగంలో కనిపిస్తుంది. ఇలా చెమట ఎక్కువగా పట్టడం వల్ల దుర్వాసన వస్తుంటుంది.

రాత్రిపూట నిద్రకు భంగం కలిగించే చెమటకు చెక్ పెట్టే రెమిడీస్

చెమట ఎక్కువగా పట్టడానికి అధిక బరువు, డయాబెటిస్, హార్మోనల్ చేంజెస్, హెరిడిటీ, ఒత్తిడి, ఆందోళన, వాతావరణంలో మార్పులు, కోపం, హార్ట్ ఫెయిల్యూర్, పోషకాహార లోపం, డిప్రెషన్, లంగ్ డిసీజ్, శ్వాససంబంధిత సమస్యలు, ప్రెగ్నెన్సీ వంటి రకరకాల అనారోగ్య సమస్యల కారణంగా కూడా.. చెమట ఎక్కువగా పడుతుంది. ఎక్సెసివ్ స్వెట్టింగ్ తో బాధపడేవాళ్లు నలుగురిలో కలవడానికి, కలిసినప్పుడు ఇబ్బందికి లోనవుతారు. దుర్వాసన కారణంగా ఆందోళనకు గురవుతుంటారు. దాన్ని తగ్గించుకోవడానికి సింపుల్ అండ్ ఎఫెక్టివ్ హోం రెమిడీస్ మీకోసం..

టమోటా జ్యూస్

టమోటా జ్యూస్

ప్రతి రోజూ ఒక గ్లాస్ ఫ్రెష్ టమోటా జ్యూస్ తాగడం వల్ల అధిక చెమట సమస్యను నివారించవచ్చు.

బంగాళదుంప

బంగాళదుంప

ఇది సింపుల్ అండ్ ఈజీ సొల్యూషన్. బంగాళదుంపను ముక్కలుగా కట్ చేసి.. అండ్ ఆర్మ్స్ దగ్గర బాగా రుద్దాలి. అంతే చెమట నుంచి ఉపశమనం పొందవచ్చు.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా

కార్న్ స్టార్చ్, బేకింగ్ సోడా సమానంగా తీసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అండర్ ఆర్మ్స్ కి అప్లై చేసి.. అరగంట తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఈ మిశ్రమానికి ఎసెన్షియల్ ఆయిల్ లేదా డియోడరెంట్ కూడా ఉపయోగించవచ్చు.

కొబ్బరినూనె

కొబ్బరినూనె

10గ్రాముల కర్పూరం, కొంచెం కొబ్బరి నూనె తీసుకుని బాగా మిక్స్ చేసి.. స్వెట్టింగ్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రాసుకుని.. కాసేపటి తర్వాత శుభ్రం చేసుకుంటే.. న్యాచురల్ గా సమస్యను నివారిస్తుంది.

ద్రాక్ష

ద్రాక్ష

రోజూ గ్రేప్స్ తినడం వల్ల ఎక్సెసివ్ స్వెట్టింగ్ నివారించవచ్చు. ఇందులో న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల శరీరంలో టెంపరేచర్ ని బ్యాలెన్స్ చేస్తుంది.

ఉప్పు

ఉప్పు

నిమ్మరసానికి 1 టేబుల్ స్పూన్ ఉప్పు కలిపి.. మసాజ్ చేయాలి. స్వెట్ గ్లాంగ్స్ ని ఇది తగ్గించి.. ఎక్సెసివ్ స్వెట్టింగ్ ని నివారిస్తుంది.

నిమ్మరసం, బేకింగ్ సోడా

నిమ్మరసం, బేకింగ్ సోడా

నిమ్మరసం, బేకింగ్ సోడాలను సమానంగా తీసుకోవాలి. బాగా మిక్స్ చేసి.. దూది ముంచి అండర్ ఆర్మ్స్ కి అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. మీ సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు.

టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్ లో కాటన్ బాల్ ముంచి.. చెమట ఎక్కువగా ఉండే శరీర భాగాల్లో రాసుకోవాలి. ఒకవేళ మీది సెన్సిటివ్ స్కిన్ అయితే.. 5 చుక్కల టీ ట్రీ ఆయిల్ ని, అరకప్పు నీటిలో కలిపి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చెమట పట్టడాన్ని నివారించవచ్చు.

వెనిగర్

వెనిగర్

ముందుగా వెనిగర్ తీసుకుని.. అందులో దూది ముంచి రాత్రి పడుకోవడానికి ముందు అండర్ ఆర్మ్స్ కి రాసుకోవాలి. ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల చెమట నుంచి ఉపశమనం పొందవచ్చు.

నిమ్మరసం, ఉప్పు

నిమ్మరసం, ఉప్పు

2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని చెమట ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రాసుకుని.. కొన్ని నిమిషాల పాటు మసాజ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేయాలి.

కొన్ని జాగ్రత్తలు

కొన్ని జాగ్రత్తలు

ఈ చిట్కాలతో పాటు.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చెమట నివారించవచ్చు. ఎక్కువగా నీళ్లు, పండ్ల రసాలు తాగడం, ఒత్తిడికి లోనుకాకుండా ఉండటం, ఆల్కహాల్, సిగరెట్స్ కి దూరంగా ఉండటం, కాఫీలు తగ్గించడం, వేడినీటి స్నానానికి దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకున్నా.. చెమట పట్టడాన్ని నివారించవచ్చు.

Story first published:Wednesday, April 13, 2016, 17:06 [IST]
Desktop Bottom Promotion