Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
వీపు మీద మొటిమలు, మచ్చలను తొలగించే ఎఫెక్టివ్ నేచురల్ టిప్స్
సాధారణంగా మహిళలు ఎంతటి సౌందర్యవతులలో అందరికి తెలిసిన విషయమే. అయితే సహజ సౌందర్యానికి మరికొన్ని మెరుగులు దిద్దుకొంటే ఆ సౌదర్యం ఎప్పటీ అలాగే నిలిచి ఉంటుంది. అందంగా, రూపవతిగా, పుట్టడమే కాదు పుట్టనప్పటి నుండి వయస్సు పెరిగే కొద్ది శరీరం మీద, అలంకరణ మీద, వస్త్రాల మీద మహిళలకు మోజు పెరుగుతుంటుంది. ప్రతిదీ కొత్తగా వేసుకోవాలని, కొత్తగా కనబడాలని ఆరాటపడుతుంటుంది.
ఒక్కొక్కో సందర్భంలో ఒక్కోరకంగా తయారవడానికి ఉత్సాహం చూపిస్తుంది. ముఖ్యంగా మహిళలు వేసుకొనే మేకప్ విషయంలోనూ, వారు ధరించే దుస్తుల విషయంలోనూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకొంటారు .మేకప్ ఎలా వేసుకొన్నా దానికి తగ్గ వస్త్రాదారణ ఉండాలి. ముఖ్యంగా మహిళలు ముఖం, కాళ్ళు, చేతులు వంటి బాహ్యంగా కనిపించే అవయవాలను ఎంత ప్రాధాన్యత ను ఇస్తారో అంతే ప్రాదాన్యతను వీపు బాగంలో కూడా చూపించాలి. లేదంటే ఎంత మేకప్ చేసుకొన్నా ముందు వైపు ఎక్కువ ఆకర్షించేలా ఉండి, వెనుక వైపు ఆస్యహించుకొనేలా ఉండకూడదు. ముందువైపు నునుపుగా ఉన్నట్లే, వెనకవైపు కూడా ఎలాంటి మచ్చలు మరియు మొటిమలు లేకుండా క్లియర్ గా ఉండాలి. .
మహిళలు ఒకప్పుడు శరీరం నిండుగా కప్పిఉండే విధంగా బ్లౌజులు (జాకెట్లు) కుట్టించుకొనే వారు. అయితే అది రాను రాను ఫ్యాషన్ వైపు మొగ్గు చూపడంతో కొద్దికొద్దిగా బ్యాక్ నెక్, ఫ్రెంట్ నెక్ క్రిందికి తగ్గించి ఒళ్ళు కనబడేలా ఇతరులను ఆకర్షించేలా వేసుకోవడం ప్రారంభించారు. అయితే అలా వేసుకోవాలంటే చక్కటి శరీర ఆకతి, శరీర చాయతో పాటు, ఎటువంటి చర్మ సంబంద సమస్యలు లేకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే కొంత మంది మహిళల వీపు నిండా మొటిమలు, కాయలు, వంటివి వుండి అందరూ ధరించే అందమైన వి-నెక్, లేదా ఓ-నెక్ జాకెట్లు వేసుకోవాలంటే ఇబ్బందిగా వుంటుంది. స్లీవ్ లెస్, స్ట్రాప్ లెస్ డ్రెస్సు వేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. వీపులో మొటిలము ఏర్పడుట వల్ల చర్మం దురద, ఇన్ఫెక్షన్ కు గురౌతుంది. నల్లని మచ్చలకు దారి తీస్తుంది. ఇలాంటి మచ్చలను కవర్ చేయడానికి డ్రెస్సు వేసుకున్నా, మీకు నచ్చిన దుస్తులను వేసుకోలేరు.
వీపు మీద చ్చే మొటిమలు మచ్చలు, స్కిన్ ఇరిటేషన్ కు కారణమవుతాయి . ఇవి హార్మోనుల అసమతుల్యత, చెమట వల్ల కూడా వస్తాయి. ఉతకని దుస్తులు వేసుకున్నా కూడా మొటిమలకు కారణమవుతుంది. మహిళలకు ముందు భాగమే కాదు...వెనుక భాగం కూడా నున్నగా నిగ, నిగ లాడుతూ వుంటే, మరింత సెక్సీ అపీల్ కనపడుతుంది. వీపు భాగంలో మొటిమలను మచ్చలను నేచురల్ గా తగ్గించుకోవడానికి కొన్ని నేచురల్ ఎఫెక్టివ్ టిప్స్ ..

1. ఓట్ మీల్ స్క్రబ్:
2 చెంచాల ఓట్ మీల్ ను పాలు లేదా నీళ్ళలో మిక్స్ చేసి స్క్రబ్ గా ఉపయోగించాలి . ఓట్ మీల్ ఒక అద్భుతమైన స్కిన్ ఎక్సఫ్లోయేటింగ్ ఏజెంట్ . ఇది వీపుబాగంలో ఉండే డెడ్ స్కిన్ సెల్స్ ను మరియు మలినాలను తొలగిస్తుంది. దాంతో మొటిమలు మచ్చలకు తావుండదు.

2. టీట్రీ ఆయిల్ క్లీన్స్:
టీట్రీ ఆయిల్ నేచురల్ స్కిన్ క్లెన్సర్ మరియు టోనర్, ఇది చాలా డీప్ గా చర్మ రంద్రాలను శుభ్రం చేస్తుంది. చర్మ రంద్రాల్లో చేరిన బ్యాక్టీరియా మరియు మురికిని తొలగిస్తుంది . దాంతో వీపు బాగంలో మొటిమలను నివారించబడుతుంది . టీట్రీ ఆయిల్లో కొద్దిగా కాటన్ మిక్స్ చేసి మొటిమలున్న ప్రాంతంలో అప్లై చేసి, అరగంట తర్వాత స్నానం చేయాలి.

3. ఆపిల్ సైడర్ వెనిగర్:
మరో నేచురల్ స్కిన్ క్లెన్సర్ ఆపిల్ సైడర్ వెనిగర్ . కొద్దిగా వెనిగర్ మొటిమలు, మచ్చల మీద అప్లై చేయడం వల్ల బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. టాక్సిన్స్ తొలగిపోతాయి . పింపుల్స్ కారణంగా వచ్చే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

4.ఎప్సమ్ సాల్ట్ స్కిన్ మాస్క్:
వీపు బాగంలో మొటిమలు, మచ్చలను నివారించడానికి ఎప్సమ్ సాల్ట్ ఒక నేచురల్ రెమెడీ . ఇది వీపు బాగంలో మొటిమలను నివారిస్తుంది . మలినాలను మరియు టాక్సిన్స్ ను తొలగిస్తుంది . ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో గొప్పగా పనిచేస్తుంది. ఎప్సమ్ సాల్ట్ ను నీటిలో కలిపి, ఆ నీటిని ఎఫెక్టెడ్ ఏరియాలో అప్లై చేయాలి.

5. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి :
ఉతికిన దుస్తులు మాత్రమే ధరించాలి. ఉతకనివి ఒకసారి వాడినవి తిరిగి వాడకూడదు. ప్రతి రోజూ రెగ్యులర్ గా స్నానం చేయాలి. . స్నానానికి యాంటీ బ్యాక్టీరియల్, బాడీ వాష్ ను ఉపయోగించాలి.

6. మంచి ఆహారం తీసుకోవాలి:
వీపు బాగంలో మొటిమలు, మచ్చల నివారణకు మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. ఫ్యాట్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, డైరీ ప్రొడక్ట్స్, స్నాక్స్, చాక్లెట్స్, స్వీట్స్ తినడం నివారించడం వల్ల మొటిమలను తగ్గించుకోవచ్చు.

7. బేకింగ్ సోడా స్కిన్ మాస్క్:
బేకింగ్ సోడాను నీటిలో మిక్స్ చేసి బ్యాక్ పోర్షన్ లో అప్లై చేయాలి. ఇది మొటిమలను, మచ్చలను తొలగిస్తుంది. ఇందులో ఉండే యాంటీసెప్టిక్ నేచరల్ ,ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.



Click it and Unblock the Notifications