For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మ అందానికి బంగాళదుంప అందించే బ్యూటిఫుల్ బెనిఫిట్స్

|

ఎప్పుడూ వంటింట్లో అందుబాటులో ఉండే బంగాళా దుంప రుచికే కాదు.. అందానికీ చక్కగా దోహదం చేస్తుంది. అందానికి అడ్డుగా నిలిచే ఎన్నో సమస్యల్ని తీర్చడానికి బంగాళ దుంప ఉత్తమం. కళ్ల నుంచి జుట్టు వరకు అందాన్ని పెంపొందించడంలో ముందుటుంది. బంగాళదుంపలో గంజి, వివిధ రకాల న్యూట్రీషియన్స్ కూడా అధికంగా ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ సి మరియు కార్బోహైడ్రేట్స్ వివిధ మార్గాల్లో ప్రయోజనాలను అంధిస్తాయి.

అందానికి బంగాళదుంప

బంగాళదుంప కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందానికి కూడా ఎంతో బాగా సహాయపడుతుంది. బంగాళదుంప అనేక చర్మ సమస్యలను నివారించడంలో ముఖ్య పాత్ను పోషిస్తుంది. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి ఎక్కువగా సహాయపడుతుంది. ఆరోగ్యానికే కాదు, అందానికి కూడా బంగాళదుంప గ్రేట్ గా సహాయపడుతుందని, నిరూపించుకోవడానికి కొన్ని చిట్కాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి..

డార్క్ సర్కిల్స్ ను పోగొడుతుంది:

డార్క్ సర్కిల్స్ ను పోగొడుతుంది:

అందాన్ని పాడు చేయడంలో బ్లాక్ సర్కిల్స్ ఒకటి. బంగాళదుంపలో స్కిన్ బ్రైట్ గా మార్చే గుణాలతో పాటు, చర్మాన్ని సాప్ట్ గా మార్చే గుణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కళ్ళ క్రింద నల్లని వలయాలను పోగొడుతుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా..బంగాళదుంప తీసుకుని, స్లైస్ గా కట్ చేసి, చల్లటి నీటిలో వేసి ఒక గంట సేపు నానబెట్టాలి. తర్వాత వాటిని బయటకు తీసి, కళ్ళ మీద ఉంచి, అరగంట సమయం విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

సన్ బర్న్ నివారిస్తుంది:

సన్ బర్న్ నివారిస్తుంది:

సన్ బర్న్, మరియు సన్ డ్యామేజ్ నుండి చర్మానికి రక్షణ కల్పించడంలో బంగాళదుంప ఉత్తమ హోం రెమెడీ. కొన్ని బంగాళదుంప స్లైస్ తీసుకుని, సన్ బర్న్ అయిన చర్మం మీద అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత, చల్లటి నీటితో కడిగేసుకోవాలి. బంగాళదుంపను ఉపయోగించే మరో మార్గం: బంగాళదుంపను మెత్తగా పేస్ట్ చేసి, అందు నుండి రసం తీసి, ఈ రసంలో కాటన్ డిప్ చేసి సన్ టాన్, సన్ బర్న్ అయిన ప్రదేశంలో అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

డ్రై స్కిన్ నివారించుకోవాలి:

డ్రై స్కిన్ నివారించుకోవాలి:

మీరు కనుక డ్రై డ్యామేజ్డ్, డల్ స్కిన్ తో బాధపడుతుంటే, బంగాళదుంపను డైలీ డైట్ లో చేర్చుకోవాలి. బంగాళదుంపలో నేచురల్ స్కిన్ స్మూతింగ్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది డ్రై స్కిన్ ను ఎఫెక్టివ్ గా సులభంగా నివారిస్తుంది.

ఒక బంగాళదుంప తీసుకుని, తురమాలి. అందులో ఫ్రెష్ అలోవెర జెల్ మిక్స్ చియాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 40 నిముషాల తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

స్కిన్ లైటనింగ్ ట్రీట్మెంట్ కు గ్రేట్ గా సహాయపడుతుంది:

స్కిన్ లైటనింగ్ ట్రీట్మెంట్ కు గ్రేట్ గా సహాయపడుతుంది:

బంగాళదుంపలో ఉండే నేచురల్ బ్లీచింగ్ లక్షణాలు వల్ల స్కిన్ లైటనింగ్ ట్రీట్మెంట్ లో దీన్ని ఉపయోగించుకోవచ్చు.

ఫ్రెష్ గా ఉండే బంగాళదుంప తీసుకుని తురుముకోవాలి. అందులో ఒక స్పూన్ పెరుగు చేర్చి, సన్ బర్న్ అయిన చర్మానికి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత కొద్ది సమయం మసాజ్ చేయాలి. 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

కళ్ల క్రింద ఉబ్బును తొలగిస్తుంది:

కళ్ల క్రింద ఉబ్బును తొలగిస్తుంది:

బంగాళదుంప కళ్ళ క్రింద నల్లని వలయాలను మాత్రమే కాదు, కళ్ళ క్రింద ఉబ్బును కూడా తొలగిస్తుంది.

5 స్పూన్ల బంగాళదుంప పేస్ట్ తీసుకుని, అందులో మూడు స్పూన్ల కీరదోసకాయ పేస్ట్ మిక్స్ చేయాలి. ఇప్పుడు అందులో రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్, కీరదోసకాయ, బంగాళదుం పేస్ట్ మిక్స్ చేయాలి. మొత్తం బాగా మిక్స్ చేసి, కళ్ళ క్రింద అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

డార్క్ స్పాట్స్ ను తొలగిస్తుంది:

డార్క్ స్పాట్స్ ను తొలగిస్తుంది:

బంగాళదుంప అద్భుతమైన స్కిన్ లైటనింగ్ ఏజెంట్ . ఇది డార్క్ స్పాట్స్ ను , చర్మంలో ఇతర మచ్చలను తొలగిస్తుంది. ఒక పచ్చిబంగాళదుంప తీసుకుని, దానికి 2 స్పూన్ల నిమ్మరసం మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేిస, డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

స్కిన్ ఇరిటేషన్ తగ్గిస్తుంది:

స్కిన్ ఇరిటేషన్ తగ్గిస్తుంది:

చర్మానికి బంగాళదుంపను ఉపయోగించడం వల్ల చర్మంలో చీకాకును, చర్మంలో దురదను తగ్గిస్తుంది. కొద్దిగా బంగాళదుంప రసం తీసుకుని, అందులో ఎగ్ వైట్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రదేశంలో అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ హోం రెమెడీని ఉపయోగించుకోవడం వల్ల చర్మంలో దురద, చీకాకు మరియు స్కిన్ రెడ్ నెస్ తొలగిస్తుంది.

చర్మంలో ఆయిల్ నెస్ తగ్గిస్తుంది:

చర్మంలో ఆయిల్ నెస్ తగ్గిస్తుంది:

జిడ్డు చర్మానికి బంగాళదుంప ఉత్తమ హోం రెమెడీ. బంగాళదుంపను తురిమి , అందులో నుండి రసం తీసి, దీనికి 6 స్పూన్ల నిమ్మరసం మిక్స్ చేసి, ఆయిల్ స్కిన్ మీద అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

English summary

Different Ways How Potatoes Can Be Used For Skin Care

There is no denying the fact that potato plays a major role in treating several skin issues and is also known for maintaining healthy hair. So, if you aren't aware of the beauty benefits of a potato, here we mention to you about some of the incredible ones. Take a look.
Story first published: Monday, June 5, 2017, 11:58 [IST]
Desktop Bottom Promotion