For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెల్యులైట్, స్ట్రెచ్ మార్క్ ను పోగొట్టడానికి ఇంట్లో స్వయంగా తయారుచేసుకునే కాఫీ స్క్రబ్!

By Ashwini Pappireddy
|

మీ చర్మంలో అంతర్లీనమైన కొవ్వు నిల్వవుండటం వలన ఆ ప్రాంతం చూడటానికి బుడపలగా మరియు ఎత్తుగా ఉండవచ్చు. ఈ అత్యంత సాధారణ చర్మ పరిస్థితి ఎక్కువగా తొడలు మరియు పిరుదుల ప్రాంతంలో రావడం జరుగుతుంది.

ఈ భయానక చర్మ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా 90% మంది మహిళల మీద ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా సెల్యులైట్ సమస్యను ఎదుర్కోవటానికి లెక్కలేనన్ని స్టోర్- లో చర్మ సంరక్షణ వస్తువులు అందుబాటులో ఉన్నప్పటికీ, నిజానికి అవి దీని మీద చాలా తక్కువగా పనిచేస్తాయి.

ఎలాంటి క్రీమ్స్ అందుబాటులో ఉన్నప్పటికీ, మిమల్ని మీరే ప్రశ్నించుకునే రసాయలనాలను కలిగి ఉన్నటువంటి సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించటానికి మీరు సంశయిస్తూ,భయపడుతూ ఉంటే, అప్పుడు మీరు సహజ చర్మ సంరక్షణ పదార్ధాలను ఎన్నుకోవడం మంచిది.

diy scrubs with coffee

కాఫీ తో తయారుచేసే స్కర్బ్స్

100% నాటురల్ పదార్థాలతో తయారుచేసినటువంటి వివిధ రకాల స్కర్బ్స్ మనకి అందుబాటులో ఉన్నప్పటికీ, ముఖ్యంగా ఈ చర్మ సమస్య కి అద్భుతమైన ఫలితాలనిచ్చే ఒక ప్రత్యేకమైన పదార్థముంది. ఏమైవుంటుందనే ఆలోచితున్నారా! అదేనండి మనందరికీ బాగా తెలిసినటువంటి కాఫీ.

<strong>చలికాలంలో మీ చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసే షుగర్ స్క్రబ్స్..!</strong>చలికాలంలో మీ చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసే షుగర్ స్క్రబ్స్..!

సెల్లులైట్ ని తొలగించే ఆయుర్వేద మూలికలు

కాఫీ గింజలలో శక్తివంతమైన అనామ్లజనకాలు ఉండటం వల్ల అవి సెల్యులేట్ యొక్క ప్రాముఖ్యతను తగ్గిస్తుంది మరియు మీ చర్మాన్ని స్మూత్ గా చేసి మరియు మంచి ఆకృతిని ఇస్తుంది.

ఎక్సఫోలియేషన్ కి నిజంగా మంచి ఫలితాలను కలిగివుండటం వలన, కాఫీ గింజలను తరచూ స్క్రబ్స్ లాగా ఉపయోగిస్తారు. దీనిని క్రమం తప్పకుండా స్క్రబ్స్ ఉపయోగించడం వలన సెల్లులైట్ లేని క్లియర్ చర్మాన్ని పొందడానికి సహాయపడుతుంది. ఇవన్నీ మీకు సులభంగా అర్థం అవడానికి, మేము కాఫీ ని వుపయోగించి సెల్లులైట్ ని సులభంగా తొలగించే కొన్ని ఇంట్లోనే తయారుచేసుకునే రెసిపీ లిస్ట్ మీకోసం తెలియజేయడం జరిగింది.

ఈ రెసిపీ ల గురించి తెలుసుకోవడానికి చదవడం కంటిన్యూ చేయండి.

1. కాఫీ + ఆపిల్ సిడర్ వినెగర్

1. కాఫీ + ఆపిల్ సిడర్ వినెగర్

ఎలా ఉపయోగించాలి:

- ¼ కప్పు కాఫీ పౌడర్ కి 2 టేబుల్ స్పూన్ల, ఆపిల్ సైడర్ వెనీగర్ మరియు గులాబీ

నీటితో కలపాలి.

- ప్రభావిత ప్రాంతంలో ఈ పేస్ట్ ని రాయాలి.

- స్క్రబ్ ప్యాడ్ తో ప్రాంతం మొత్తం పూర్తిగా శుభ్రం చేయాలి.

- మరొక 15 నిమిషాల పాటు వదిలివేయండి.

- గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి

- మంచి ఫలితాలను పొందడానికి వారానికొకసారి దీనిని ఉపయోగించండి.

2. కాఫీ + జునిపెర్ సీడ్ ఆయిల్

2. కాఫీ + జునిపెర్ సీడ్ ఆయిల్

ఎలా వాడాలి:-

- జుబిపెర్ సీడ్ ఆయిల్ 2 టీస్పూన్లు మరియు గులాబీ నీరు 1 టేబుల్ స్పూన్ , కాఫీ పొడి 3-4 టేబుల్

స్పూన్లు కలపండి.

- దీనిని మీ చర్మం ఫై అప్లై చేసి 5-10 నిమిషాలు మసాజ్ చేయండి.

- మరొక 20 నిముషాల పాటు అలాగే ఉండనివ్వాలి.

- ఆ మిశ్రమాన్ని తొలగించడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించండి.

- ఈ స్క్రబ్ ని వారానికి ఒకసారి అప్లై చేసుకోవడం వలన సానుకూల ఫలితాలను పొందవచ్చు.

3. కాఫీ + గ్రీన్ టీ

3. కాఫీ + గ్రీన్ టీ

ఎలా ఉపయోగించాలి:

- చల్లార్చిన గ్రీన్ టీ 4-5 టేబుల్ తో ¼ కప్ కాఫీ పొడి తో కలపాలి.

- ప్రభావిత ప్రాంతంలో ఈ మిశ్రమాన్ని మెల్లగా అప్లై చేయండి.

- మీ చర్మం లో స్థిరపడటానికి 30 నిమిషాలు దానిని వదిలివేయండి.

- తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచండి.

- సెల్లులైట్- ఫ్రీ చర్మం పొందడానికి ప్రతివారం తప్పకుండా దీనిని ఉపయోగించండి.

4. కాఫీ + కొబ్బరి నూనె

4. కాఫీ + కొబ్బరి నూనె

ఎలా ఉపయోగించాలి:-

- 4-5 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె లో ¼ కప్పు కాఫీ పొడి ని కలపండి.

- ప్రభావిత ప్రాంతంలోని మిశ్రమాన్ని ఉంచండి మరియు 5-10 నిమిషాలు స్కర్బ్ చేయండి.

- దానిని మరొక 30 నిముషాల పాటు వదిలేయండి.

- తరవాత వెచ్చని నీటితో కడిగేయండి.

- చక్కని ఫలితాలు పొందడానికి వారంలో రెండుసార్లు దీనిని ఉపయోగించండి.

5. కాఫీ + బ్రౌన్ షుగర్

5. కాఫీ + బ్రౌన్ షుగర్

ఎలా ఉపయోగించాలి:-

- 2-3 టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగర్, 3 టేబుల్ స్పూన్లు గులాబీ నీరు మరియు ¼ కప్పు కాఫీ పొడి ని

కలపండి.

- సమస్యాత్మక ప్రాంతాల్లో దీనిని నెమ్మదిగా అప్లై చేయండి.

- దీనిని 25-30 నిమిషాలు పాటు ఉంచండి.

- గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయండి.

- సెల్లులైట్ ని పోగొట్టడానికి వారానికి ఒకసారి ఈ స్కర్బ్ ని ఉపయోగించండి.

6. కాఫీ + చమోమిలే టీ

6. కాఫీ + చమోమిలే టీ

ఎలా ఉపయోగించాలి:-

- 2 టేబుల్ స్పూన్ల కామోమిల్ టీ లో 3-4 టేబుల్ స్పూన్ల కాఫీ పొడిని కలపండి.

- సమస్యాత్మక ప్రాంతంలో ఈ మిశ్రమాన్ని రాయండి.

- 5-10 నిమిషాల పాటు స్కర్బ్ ప్యాడ్ తో మసాజ్ చేయండి.

- 30 నిమిషాలు దానిని వదిలేయండి.

- తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

- గొప్ప ఫలితాలను పొందడానికి వారానికి ఒకసారి ఉపయోగించండి.

7. కాఫీ + అలోయి వెరా జెల్

7. కాఫీ + అలోయి వెరా జెల్

ఎలా ఉపయోగించాలి:

- 3 టేబుల్ స్పూన్స్ కలబంద జెల్ లో ¼ కప్ కాఫీ పొడిని కలపండి.

- ప్రభావిత ప్రాంతాల్లో అప్లై చేసి 10 నిమిషాల పాటు స్కర్బ్ చేయండి

- మరొక 40 నిముషాల పాటు ఉండనివ్వండి.

- తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

- సానుకూల ఫలితాల కోసం వారానికి ఒకసారి మీ ఇంట్లో నే తయారు చేసిన స్కర్బ్ తో మీ చర్మానికి

చికిత్స చేసుకోండి.

8. కాఫీ + వోట్మీల్

8. కాఫీ + వోట్మీల్

ఎలా ఉపయోగించాలి:-

- జస్ట్ 3-4 టేబుల్ స్పూన్ల గులాబీ నీటిలో కాఫీ పొడి మరియు వోట్మీల్ నికలపండి.

- సమస్యాత్మక ప్రాంతాల్లోని అప్లై చేసి నెమ్మదిగా స్కర్బ్ చేయండి.

- 5 నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత, మీ చర్మంపై మరో 15 నిముషాలు ఆ మిశ్రమాన్ని అలానే

ఉంచండి.

- గోరు వెచ్చని నీటి తో శుభ్రం చేసుకోండి.

9. కాఫీ + లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్

9. కాఫీ + లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్

ఎలా ఉపయోగించాలి:-

- 2 టేబుల్ స్పూన్ల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ లో3-4 చుక్కల ఆలివ్ ఆయిల్ మరియు 3 టేబుల్

స్పూన్ ల కాఫీ పొడి ని కలపండి.

- సమస్యాత్మక ప్రాంతంలో దీనిని అప్లై చేసి 5-10 నిముషాల పాటు స్కర్బ్ చేయండి.

- మీ చర్మం ఉపరితలంపై మరొక 30 నిముషాల పాటు ఉండనివ్వండి

- తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

English summary

DIY Coffee Scrubs To Get Rid Of Cellulite

Check out these diy coffee scrub recipes that helps you get rid of cellulite.
Desktop Bottom Promotion