For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పెదవులు, గడ్డం చుట్టూ నల్లబడిన చర్మాన్ని వదిలించుకోటానికి ఇంటి చిట్కాలు

పెదవులు మరియు గడ్డం ప్రాంతంలో నల్లటి చర్మం మీ మిగతా ముఖరంగుతో సరిపోక విచిత్రంగా కన్పించవచ్చు. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలామంది స్త్రీ పురుషులకి ఉన్న సాధారణ చర్మసమస్య.

|

పెదవులు మరియు గడ్డం ప్రాంతంలో నల్లటి చర్మం మీ మిగతా ముఖరంగుతో సరిపోక విచిత్రంగా కన్పించవచ్చు. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలామంది స్త్రీ పురుషులకి ఉన్న సాధారణ చర్మసమస్య.

ఈ ప్రాంతాల్లో అధికంగా రంగు ఏర్పడటానికి అనేక కారణాలుండవచ్చు. ఇవి కలుషితాలు, విషపదార్థాలు కావచ్చు లేదా థ్రెడింగ్ మరియు వ్యాక్సింగ్ వలన పెదవులు మరియు గడ్డం చుట్టూ చర్మం నల్లగా మారటానికి కారణం కావచ్చు.

home remedies to get rid of dark skin around lips

ఏ కారణమైనా, ఈ సమస్య ఎవరికైనా చికాకును కలిగించి కన్సీలర్ వంటి మేకప్ వెనకాల పడేలా చేస్తుంది.

కానీ మీరు పెద్ద పనిలేకుండా, సహజంగా, సురక్షితంగా మీ పెదవులు మరియు గడ్డం చుట్టూ నల్లచర్మాన్ని తెలుపు చేసుకునే మార్గాన్ని వెతుకుతున్నట్లయితే, ఇదిగో మీకు మేమున్నాం. ఈ రోజు బోల్డ్ స్కైలో ఈ సాధారణ సమస్యకి ఇంటి చిట్కాలు తెలియచేస్తున్నాం.

ఈ చిట్కాలను కింద చదివి మీ పెదవులు మరియు గడ్డం చుట్టూ నల్లదనాన్ని సహజంగా ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకోండి.

1. బంగాళదుంప

1. బంగాళదుంప

సహజమైన బ్లీచింగ్ ఏజెంట్ గా పేరుపొందిన బంగాళదుంప పెదవులు, గడ్డం చుట్టూ పేరుకున్న నల్లదనానికి మంచి ఉపాయం.

ఆలుగడ్డను కొన్ని ముక్కలుగా కోసి, ఆ ప్రాంతాలు అంతా పెట్టుకోండి. 15-20 నిమిషాలు అలా ఉంచి గోరువెచ్చని నీరుతో కడిగేయండి. రోజూ ఇలా చేస్తూ మంచి ఫలితాలు చూడండి.

2. నిమ్మ రసం

2. నిమ్మ రసం

సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే నిమ్మరసం మీ పెదవులు,గడ్డం చుట్టూ నల్లదనాన్ని పోగొట్టే మరో అద్భుతమైన పదార్థం.

2 చెంచాల నిమ్మరసాన్ని 1 చెంచా రోజ్ వాటర్ తో కలపండి. కాటన్ దూదిని అందులో ముంచి మొహమంతా రాసుకోండి. 10-15 నిమిషాల తర్వాత మీ చర్మాన్ని గోరువెచ్చని నీరుతో కడగండి. దీన్ని వారానికి 4-5 సార్లు చేసి మంచి ఫలితాలు పొందండి.

3. ఆలోవెరా జెల్

3. ఆలోవెరా జెల్

ఆలోవెరా జెల్ యొక్క పోషకవిలువలు ఈ చర్మ సమస్యకి మరో సహజమైన చిట్కాగా పనిచేస్తుంది.

ఆలోవెరా జెల్ ను నేరుగా నల్లబడిన ప్రదేశం మొత్తం పట్టించండి. ఒక గంట ఉంచి గోరువెచ్చని నీరుతో కడిగేయండి. ఇలా రోజులో చాలా సార్లు చేసి ప్రభావవంతమైన మార్పును చూడండి.

4.గంధపు పొడి

4.గంధపు పొడి

గంధం పొడిలోని చర్మాన్ని తెల్లబర్చే గుణాలు పెదవులు, గడ్డం చుట్టూ పేరుకున్న నల్లదనాన్ని పోగొట్టేలా చేస్తుంది.

ఒక చెంచా గంధపు పొడిని, 2చెంచాల రోజ్ వాటర్ తో కలిపి ఆ ప్రదేశాలలో పూయండి. 20నిమిషాల తర్వాత గోరువెచ్చని నీరుతో కడిగేయండి. వారానికి 3-4 సార్లు ఇలా చేసి తొందరగా ఫలితాలను చూడండి.

5.తేనె

5.తేనె

యాంటీ ఆక్సిడెంట్లతో నిండి వుండే తేనెను చర్మాన్ని తెల్లబర్చే పదార్థాలలో ఒకటిగా వాడతారు. దీన్ని తరచుగా వాడుతూ ఉండటం వలన మీ పెదవులు, గడ్డం చుట్టూ ఉన్న నల్లదనాన్ని పోగొట్టుకోవచ్చు.

కొంచెం తేనెను నేరుగా ఆ ప్రాంతాలలో రాసి 15-20 నిమిషాలు ఉంచేసి, గోరువెచ్చని నీరుతో కడిగేయండి. రోజుకి ఒకసారి ఇలా చేసి మంచి ఫలితాలను చూడండి.

6. పసుపు

6. పసుపు

ఇది సాంప్రదాయకమైన చిట్కా. దీనిలో నిండి ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి ఉపయోగకరమైనవి. ఇవి పెదవులు, గడ్డంపై ఏర్పడ్డ నల్లచర్మంపై ప్రభావవంతంగా పనిచేస్తాయి.

ఒక చిటికెడు పసుపును 1 చెంచా పెరుగుతో కలపండి. ఈ పేస్టును నల్లచర్మం ఉన్నచోట్ల రాయండి. 10-15 నిమిషాలు అలా వదిలేసాక గోరువెచ్చని నీరుతో కడగండి. ఈ ఇంటిలో తయారుచేసుకునే మిశ్రమం వారానికి ఒకసారి వాడి కావాల్సిన ఫలితాలను పొందండి.

7. ఓట్ మీల్

7. ఓట్ మీల్

ఓట్ మీల్ లో ఉండే ఎక్స్ ఫోలియేటింగ్ ఏజెంట్లు చర్మం ఉపరితలంపై ఉండే మృతకణాలు, దుమ్ముధూళిని తొలగించి రంగును తేలికపరుస్తుంది.

ఒక చెంచా ఓట్ మీల్ ను అరచెంచా రోజ్ వాటర్ మరియు మరో అరచెంచా కొబ్బరినూనెతో కలపండి. ఈ పేస్టును నల్లబడిన ప్రదేశాలపై మెల్లగా రుద్దుతూ రాయండి. తర్వాత గోరువెచ్చని నీరుతో కడిగేయండి. ఈ ఇంటిలో తయారుచేసుకునే మిశ్రమంను వారానికి 2-3 సార్లు వాడి మంచి ఫలితాలను పొందండి.

8.ఆలివ్ నూనె

8.ఆలివ్ నూనె

అన్ని రకాల చర్మసమస్యలకి ఇష్టమైన తరుణోపాయం అయిన ఆలివ్ నూనె మరొక సహజమైన చిట్కా. ఇందులో ఉండే చర్మాన్ని తెల్లబర్చే గుణాలు మీ పెదవులు, గడ్డం చుట్టూ నల్లబడిన చర్మాన్ని తెల్లబరుస్తాయి.

కొంచెం ఆలివ్ నూనెను ఆ నల్లబడిన ప్రాంతాలపై రాసి, రాత్రంతా అలా వదిలేయండి. పొద్దున్న గోరువెచ్చని నీరుతో కడిగేయండి. రోజూ ఇలా చేసి పెదవులు, గడ్డం చుట్టూ ఏర్పడ్డ నల్లచర్మాన్ని తొలగించుకోండి.

English summary

Home Remedies To Get Rid Of Dark Skin Around Lips and Chin

Dark skin around the lips and chin area can make your skin tone appear uneven. This is a highly common skin-related concern for several men and women around the world. However, there are potent home remedies that can be used for treating this common and unsightly skin problem.
Desktop Bottom Promotion