For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆలివ్ ఆయిల్ ని ఉపయోగించి స్ట్రెచ్ మార్క్స్ ని వదిలించుకోవటం ఎలా?

By Ashwini Pappireddy
|

మీ చర్మం మీద స్ట్రెచ్ మార్క్స్ గుర్తులొచ్చాయా? అది మీ అప్పీరెన్స్ ని పోగొడుతోందా! అయితే దీనిని చదవండి.

మీ బరువు లో ఏర్పడే అనుకోని మార్పుల వలన మీ చర్మంపై చారాలతో కూడిన మచ్చలు కనిపిస్తాయి.ఈ చారలు సాధారణంగా ఎలాంటి రంగుని కలిగి ఉండక మరియు మచ్చల లాగా కనిపిస్తూ ఉంటాయి.

ఈ రోజుల్లో ఎక్కువమంది స్త్రీలు వారి చర్మంపై ఈ చారాలను కలిగివుంటారు. ఎందుకంటే, నిజానికి ఇది అందరిలోనూ సర్వ సాధారణం. దీని గురించి ప్రత్యేకంగా అలోచించి కలత చెందాల్సిన అవసరం లేదు. ఈ స్ట్రెచ్ మార్క్స్ ని పోగొట్టడానికి అనేకరకాల మందులు అన్ని బ్యూటీ స్టోర్స్ లో అందుబాటులో వున్నాయి.

స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టుకోవడానికి క్యారెట్ తో ప్యాక్స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టుకోవడానికి క్యారెట్ తో ప్యాక్

How To Get Rid Of Stretch Marks Using Olive Oil

ఎన్ని క్రీమ్స్ అంబాటులో ఉన్నప్పటికీ, వాటిలో ఎక్కువ భాగం ఈ మార్క్స్ పై తక్కువ లేదా ఎలాంటి ప్రభావం, ప్రయోజనం ఉండటం లేదు. మీరు ఇలాంటి క్రీమ్స్ కోసం డబ్బు ఖర్చు పెట్టి అలసిపోయి,విరక్తి పొందినట్లయితే, ఎన్నో శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నటువంటి ఈ నాచురల్ రెమెడీ ని మీరు తప్పకుండా ప్రయత్నించాల్సిందే. మరియు ఇలాంటి స్ట్రెచ్ మార్క్స్ కి ఇది అద్భుతమైన ఫలితాలనిస్తుందని పేరు కూడా వుంది కాబట్టి ప్రయత్నించి చూడండి.

మేము మీకు తెలియజేసే పరిష్కారం ఆలివ్ నూనె. అవును, ఈ ట్రెడిషనల్ ఆయిల్ చర్మానికి పవర్ హౌస్ లాంటిది. ఇందులో వుండే పోషకాలు మరియు యాంటీఆక్సిడాంట్స్ మీ చర్మపు రక్త ప్రసరణను ప్రేరేపించి దాని రూపాన్ని మారుస్తుంది మరియు తద్వారా మీ చర్మం మీద వున్న స్ట్రెచ్ మార్క్స్ ని తొలగించడంలో సహాయపడుతుంది.

ఇక్కడ, మేము మొండి చారలను పోగొట్టడానికి ఆలివ్ నూనెను ఎన్నిరకాలుగా ఉపయోగించుకోవచ్చో మీకోసం ఇక్కడ తెలియజేశాము. చర్మం యొక్క మంచి ఫలితాల కోసం ఒకసారి దీనిని వాడటం మొదలు పెట్టాక మీరు ఈ హోమ్ రెమెడీ ని అసలు విడిచిపెట్టరు.

<strong>స్తనాల మీద స్ట్రెచ్ మార్క్స్ నివారించే 8 హోం రెమెడీస్</strong>స్తనాల మీద స్ట్రెచ్ మార్క్స్ నివారించే 8 హోం రెమెడీస్

అవేంటో ఇక్కడ చూసి తెలుసుకోండి:

1. డైరెక్ట్ అప్లికేషన్

1. డైరెక్ట్ అప్లికేషన్

- 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ ని తీసుకొని 30-40 సెకన్ల పాటు మైక్రోవేవ్ లో వేడి చేసి తీసేయండి.

- ఇప్పుడు వేడిచేసిన ఆయిల్ ని చారాలున్న ప్రాంతంలో మసాజ్ చేయండి మరియు ఫుల్ నైట్ అంతా అలానే వదిలేయండి.

- మొండి గుర్తులు, మచ్చలను వదిలించుకోవడానికి ప్రతి రోజు ఇదే పద్దతిని అనుసరించి స్ట్రెచ్ మార్క్స్ ని పోగొట్టుకోండి.

2.ఆలివ్ నూనె తో నిమ్మ రసం మరియు బ్రౌన్ షుగర్

2.ఆలివ్ నూనె తో నిమ్మ రసం మరియు బ్రౌన్ షుగర్

- 2 టబుల్స్పూన్స్ ఆలివ్ నూనె, 2 టీస్పూన్స్ బ్రౌన్ షుగర్ మరియు 1 టీస్పూన్ నిమ్మరసం తో బాగా కలిపి పేస్ట్ లాగా తయారు చేయండి.

- ఇప్పుడు ఈ పేస్ట్ ని స్ట్రెచ్ మార్క్స్ వున్న ప్రాంతంలో మందమైన లేయర్ గా అప్లై చేయండి.

- దీనిని 5-10 నిమిషాల పాటు మసాజ్ చేసి 30 నిమిషాలు దానిని అలానే వదిలేయండి.

- కాస్సేపటి తరువాత వెచ్చని నీటిలో ముంచిన ఒక తడి తడిగుడ్డతో ఈ మిశ్రమాన్నితొలగించండి.

- స్ట్రెచ్ మార్క్స్ నుండి విముక్తులవడానికి ఈ రెమెడీ ని ప్రతి రోజు ప్రయత్నించండి.

3. ఆలివ్ ఆయిల్ విత్ విటమిన్ ఇ ఆయిల్ మరియు ఆరెంజ్ పీల్ పౌడర్

3. ఆలివ్ ఆయిల్ విత్ విటమిన్ ఇ ఆయిల్ మరియు ఆరెంజ్ పీల్ పౌడర్

- ఒక విటమిన్ E క్యాప్సూల్ మరియు 1 టీస్పూన్ నారింజ పీల్ పౌడర్ లో 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె ను కలిపి పేస్ట్ లాగ సిద్ధం చేయండి.

- ఈ మిశ్రమాన్ని మీ శరీరం మీద మచ్చలు, చారాలున్న ప్రాంతంలో అప్లై చేయండి.

- 10 నిమిషాలు మసాజ్ చేసిన తరవాత 30 నిముషాల పాటు వుంచి తర్వాత శుభ్రం చేసుకోండి.

- మొండి మచ్చలను తొలగించడానికి ఈ మిశ్రమాన్ని వారానికి 3-4 సార్లు ఉపయోగించండి.

4. ఆలివ్ ఆయిల్ తో ఆర్గాన్ ఆయిల్ మరియు కోకో బటర్

4. ఆలివ్ ఆయిల్ తో ఆర్గాన్ ఆయిల్ మరియు కోకో బటర్

- 1 టేబుల్ స్పూన్ ఆర్గాన్ ఆయిల్ మరియు 1 టేబుల్ స్పూన్ కోకో బటర్ లో 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె ని కలిపి మిశ్రమంలా చేయండి.

- ఈ పేస్ట్ ని స్ట్రెచ్ మార్క్స్ వున్న ప్రాంతంలో అప్లై చేసి కాస్సేపు మసాజ్ చేసి 30 నిముషాలు ఆరనివ్వండి.

- ఆరాక గోరు వెచ్చని నీటితో కడిగేయండి.

- మంచి ఫలితాలను పొందడానికి వారానికి కనీసం 3-4 సార్లు వాడండి.

5. ఆలివ్ ఆయిల్ తో ఆపిల్ సైడర్ వినెగార్

5. ఆలివ్ ఆయిల్ తో ఆపిల్ సైడర్ వినెగార్

-1 టీస్పూన్ ఆపిల్ సైడర్ వినెగార్ లో 2 టేబుల్ స్పూన్ ల ఆలివ్ నూనె ని కలపండి.

- ఈ మిశ్రమాన్ని స్ట్రెచ్ మార్క్స్ వున్న ప్రాంతంలో థిక్ లేయర్ గా అప్లై చేయండి.

- మంచి ఫలితాల కోసం కాస్సేపు మసాజ్ చేసి 30 నిముషాల పాటు వదిలేయండి.

- 30 నిముషాల తర్వాత చల్లని నీటితో కలిగేయండి.

- తక్షణ ఫలితాలను పొందడానికి వారంలో కనీసం 2-3 సార్లు ఈ హోమ్ రెమెడీని ఉపయోగించండి.

6. ఆలివ్ ఆయిల్ తో ఆల్మాండ్ పౌడర్

6. ఆలివ్ ఆయిల్ తో ఆల్మాండ్ పౌడర్

- 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె లో 1 టీస్పూన్ బాదం పౌడర్ ని పేస్ట్ లాగా సిద్ధం చేయండి.

- స్ట్రెచ్ మార్క్స్ వున్న ప్రాంతంలో ఈ మిశ్రమాన్ని అప్లై చేసి కాస్సేపు మసాజ్ చేయండి.

- 30 నిముషాల పాటు ఆరిన తరవాత వెచ్చని నీటి తో కడిగేయండి.

- కనిపించే స్ట్రెచ్ మార్క్స్ ని తగ్గించడానికి ఈ పద్ధతిని రోజువారీగా పునరావృతం చేయండి.

7. ఆలివ్ ఆయిల్ తో కాఫీ పౌడర్

7. ఆలివ్ ఆయిల్ తో కాఫీ పౌడర్

- ఒక గిన్నెలో 1 టీస్పూన్ కాఫీ పౌడర్ తో పాటు 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె ని కలపాలి.

- దీనిని మీ చర్మంపై స్ట్రెచ్ మార్క్స్ వున్న ప్రాంతంలో అప్లై చేసి కాసేపు మర్దనా చేయండి.

- 30-35 నిముషాల పాటు ఉంచి పొడిగా అయ్యాక వెచ్చని నీటితో శుభ్రం చేయండి.

- కనిపించే మచ్చలను తగ్గించడానికి ప్రతి రోజు ఇదే పద్ధతిని ఉపయోగించండి.

8. ఆలివ్ ఆయిల్ తో బేకింగ్ సోడా

8. ఆలివ్ ఆయిల్ తో బేకింగ్ సోడా

-½ టీస్పూన్ బేకింగ్ సోడా ని 2 టేబుల్ స్పూన్ ల ఆలివ్ ఆయిల్ తో కలపండి.

- మచ్చలున్న ప్రదేశంలో అప్లై చేయండి.

- 10 నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత, అద్భుతమైన ఫలితాల కోసం 30 నిముషాలు ఆరనివ్వండి.

- గొప్ప ఫలితాలను పొందడానికి ఇంట్లో తయారు చేసిన ఈ మిశ్రమాన్ని మీ చర్మంపై మార్క్స్ వున్న ప్రాంతంలో ప్రతి రోజు వాడండి.

9. ఆలివ్ నూనె తో పసుపు పౌడర్

9. ఆలివ్ నూనె తో పసుపు పౌడర్

- 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ మిశ్రమాన్ని మరియు ½ టీస్పూన్ పసుపు పొడి తో కలపాలి.

- అన్నిచోట్ల మీ చర్మం మీద ప్రభావితమయిన ప్రాంతానికి అప్లై చేసి,10 నిమిషాలు శాంతముగా మసాజ్ చేయండి.

- వెచ్చని నీటితో శుభ్రం చేయడానికి ముందు మరొక 30 నిముషాల పాటు వదిలివేయండి.

- వారంలో కనీసం 3-4 సార్లు దీనిని ఉపయోగించడం ద్వారా మీ చర్మం వున్న

చారాలనువదిలించుకోవడానికి సహాయపడుతుంది.

10. ఆలివ్ ఆయిల్ తో అలోయి వెరా

10. ఆలివ్ ఆయిల్ తో అలోయి వెరా

- 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె ను 2 టీస్పూన్ల అలోయి వెరా మిశ్రమం తో జత చేయండి.

- సుమారు 5 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని సమస్యాత్మక ప్రాంతంలో రుద్దడం మరియు మసాజ్ చేయండి.

- ఆ మిశ్రమాన్ని మీ చర్మం మీద కనీసం 30 నిముషాలు ఉంచి తర్వాత కలిగేయండి. కావలసిన ఫలితాలను పొందడానికి రోజూ ప్రయత్నించండి.

English summary

How To Get Rid Of Stretch Marks Using Olive Oil

Did you know that by using olive oil you can actually get rid of stretch marks? Read to know more on how to use olive oil to get rid of stretch marks.
Desktop Bottom Promotion