For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ శీతాకాలంలో మీ పాదాలను ఎలా సంరక్షించుకుంటారు

By :lakshmi Bai Praharaju
|

ఈ శీతాకాలంలో, మీ చర్మంపై అదనపు శ్రద్ధ తీసుకోవాలి అనుకోవడం చాలా ముఖ్యం. ఈ కాలంలో ఉండే కష్టమైనా వాతావరణ పరిస్దితులకి మీ చర్మ ఆరోగ్యం, ఆకృతి సమస్య లాంటివి.

అయితే, పాదాల రక్షణ పట్ల శ్రద్ధ తీసుకోవడం మర్చిపోఎవాళ్ళు చాలా మంది ఉన్నారు. దాని ఫలితంగా, చివరికి పాదాలు పగిలి, పొడిబారినట్లు కనిపిస్తాయి. గాలి అలాగే వాతావరణంలో మార్పు వల్ల చర్మంపై ఉండాల్సిన సహజమైన తేమ తగ్గిపోయి చర్మం పొడిగా, రఫ్ గా కనిపిస్తుంది.

How To Take Care Of Your Feet This Winter

అలా జరగడాన్ని ఆపాలి అంటే, అతను/ఆమె వారి పాదాలపై ఉన్న చర్మం పై తగిన శ్రద్ధ తీసుకోవాలి. శీతాకాలంలో పాదాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సహాయపడే మార్గాల జాబితాలను బోల్డ్ స్కై వారు ఒకచోటికి చేర్చారు.

ఈ చిట్కాలు మీ చర్మంపై అద్భుతంగా పనిచేస్తాయి, పగుళ్ళు, ఆనేల వంటి కనిపించని సమస్యలకు కారణమయ్యే చర్మంపై మృతకణాలు కనిపించకుండా పోతాయి.

కాబట్టి, మీ దైనందిన చర్మ సంరక్షణ లో ఈ చిట్కాలను అనుసరిస్తే ఈ శీతాకాలాన్ని తేలిక చేసి, మీ పాదాలు మృదువుగా, సున్నితంగా ఉండడానికి సహాయపడతాయి.

మాయిశ్చరైజ్

మాయిశ్చరైజ్

శీతాకాలంలో ప్రతిరోజూ మీ పాదాలను మాయిశ్చరైజ్ చేయడం చాలా ముఖ్యం. ఇది మీ పాదంపై ఉన్న చర్మాన్ని సున్నితంగా చేయడమే కాకుండా పొడిబార కుండా కూడా చేస్తుంది. రోజుకు ఒకసారి, మీ రెండు పాదాలకు మాయిశ్చరైజర్ ని రాసినత్లయితే ఆ ప్రదేశం లోని చర్మం మృదువుగా, సున్నితంగా ఉండడానికి సహాయపడుతుంది.

ఎక్స్ఫోలిఎషన్

ఎక్స్ఫోలిఎషన్

డెడ్ స్కిన్ సేల్స్ ని తొలగించడానికి ఎక్స్ఫోలిఎషన్ చాలా అవసరం, మీ చర్మం పై మలినాలు సేకరించాడంవల్ల విఇద రకాల సమస్యలు వస్తాయి. మీరు ఏదైనా స్టోర్ నుండి ఫుట్ స్క్రబ్ తెచ్చుకోండి లేదా సహజ పదార్ధాలను ఉపయోగించి మీ స్వంతంగా స్క్రబ్ ని తయారుచేసుకోండి.

ప్యూమిక్ స్టోన్ వాడండి

ప్యూమిక్ స్టోన్ వాడండి

పాదాల సంరక్షణకు ప్యూమిక్ స్టోన్ చాలా ఉపయోగకరమైన వస్తువు. శీతాకాలంలో ఈ స్టోన్ తో మీ పాదం పై సున్నితంగా రుద్దడం ద్వారా పగుళ్ళు, ఆనెలు వంటి వాటిని నిరోధించవచ్చు. వారంలో, 3-4 సార్లు ఈ స్టోన్ ని ఉపయోగిస్తే మీ పాదంపై ఉన్న చర్మం సున్నితంగా అయి, సమస్యలు లేకుండా ఉంటుంది.

సాక్స్ లు ధరించండి

సాక్స్ లు ధరించండి

సాక్స్ లు మీ పాదాలకు వెచ్చదనాన్ని ఇస్తాయి, కానీ శీతాకాలంలో అవి మీ పాదంపై ఉన్న చర్మానికి సంరక్షను ఇవ్వడం అనేది అత్యంత ముఖ్యమైనది, దీనివల్ల చర్మంపై; ఉన్న తేమ కూడా పోకుండా ఉంటుంది.

మీ పాదాలపై మాయిశ్చరైజర్ ని మందంగా రాసిన తరువాత, ఒక జత సాక్స్ తో కప్పి ఉంచండి. ఈ కాలం మొత్తం, మంచి చర్మం కోసం ఈ మంచి చిట్కాను అనుసరించండి.

వేడి నీటి చికిత్స

వేడి నీటి చికిత్స

మీ పాదాలపై ఉన్న చర్మాన్ని వేడి నీటితో చికిత్స చేయడం మీరు శీతాకాలంలో తప్పక అనుసరించాల్సిన మరో చిట్కా. గోరువెచ్చని నీటితో కడుక్కోవడం లేదా వేడి నీరు ఉన్న టబ్ లో మీ పాదాలను ఉంచండి. ఈ తేలికైన చిట్కాతో మీ పాదంపై ఉన్న చర్మాన్నిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోండి.

కొబ్బరి నూనెతో మసాజ్

కొబ్బరి నూనెతో మసాజ్

మీ పాదాలను కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం అనేది అద్భుతమైన మార్గం ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

రక్త ప్రసరణ బాగుంటే చర్మం మృదువుగా కనిపిస్తుంది. ఇలా మీరు రోజుకు 2-3 సార్లు చేస్తే మీ పాదాలు ఆర్ద్రంగా ఉంది, మృదువుగా ఉంటాయి.

పాదాలు నానపెట్టడం

పాదాలు నానపెట్టడం

శీతాకాలంలో మీ పాదాలు పగుళ్ళు లేకుండా మృదువుగా ఉండాలి అంటే, మీ దైనందిన సౌందర్య కార్యక్రమంలో పాదాలను ననపెట్టడం అనేది ఒక ముఖ్యమైన భాగం. ఒక బకెట్ నిండా గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో సహజ పదార్ధాలను జోడించి మీ పాదాలను 10-15 నిమిషాల పాటు నానపెట్టి ఉంచితే, మీ ;చర్మంపై ఉన్న టాక్సిన్స్ తొలగిపోతాయి.

రాత్రిపూట ఆలివ్ ఆయిల్ చికిత్స

రాత్రిపూట ఆలివ్ ఆయిల్ చికిత్స

ఆలివ్ ఆయిల్ సహజ మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది, ఇది మీ చర్మ౦లో తేలికగా గ్రహించబడి, పొడిగా ఉండడానికి ప్రభావవంతమైన పద్ధతిలో పని చేస్తుంది. పడుకోబోయే ముందు మీ పాదాలకు ఆలివ్ ఆయిల్ అప్లై చేసి రాత్రంతా అలా వదిలేయండి. మంచి ఫలితాల కోసం ఇలా ప్రతిరోజూ చేయడానికి ప్రయత్నించండి.

షియా బటర్ అప్లై చేయడం

షియా బటర్ అప్లై చేయడం

షియా బటర్ సమర్ధవంతంగా పొడిబారిన చర్మానికి చికిత్స చేసే అద్భుతమైన పదార్ధం. అంతేకాకుండా, ఇది చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది, ఛాయను మెరుగుపరుస్తుంది కూడా. మీ చర్మంపై కరిగిన షియా బటర్ ని బాగా రాసి, గోరువెచ్చని నీటితో ఆ అవశేషాలను కడిగే ముందు 30 నిమిషాల పాటు వదిలేయడం మంచిది.

English summary

How To Take Care Of Your Feet This Winter

So, help your feet stay soft, smooth and supple this winter by incorporating the following tips in your daily skin care routine.
Desktop Bottom Promotion