For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఖర్జూరంతో చర్మం, జుట్టు సమస్యలకు చెక్!

|

ఖర్జూరం(డేట్స్) గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. ఏ పండయినా పండుగానే బాగుంటుంది. కానీ ఖర్జూరపండు ఎండినా రుచే. నట్‌గా మారిన ఎండు ఖర్జూరంలోని నీళ్లన్నీ ఆవిరైపోవడంతో అది మరింత తియ్యగా ఉంటుంది. మెత్తని పండ్లకోసం అయితే ఇవి రంగు మారి దోరరంగులోకి రాగానే చెట్టు నుంచి తీస్తారు. అదే ఎండు ఖర్జూరాల కోసం అయితే చెట్టునే బాగా ఎండనిచ్చి తెంచుతారు. కోశాక వాటిని కొంతకాలం తేమ వాతావరణంలో ఉంచి కాస్త మెత్తబడేలా చేస్తారు. వేసవిలో ఎండుఖర్జూర నీళ్లు తాగని పసిపిల్లలు అరుదే. స్వీట్లు, పుడ్డింగ్‌లు, కేకులు, డెజర్ట్‌ల తయారీలో ఖర్జూరం ఉండి తీరాల్సిందే.

ఖర్జూరం అత్యధికంగా న్యూట్రీషియన్స్ ఉన్నటువంటి ఆహారం పదార్థం. ఎందుకంటే ఖర్జూరంలో విటమిన్స్, మినిరల్స్, క్యాల్షియం, మినిరల్స్, మరియు ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఈ హెల్తీ ఫుడ్ అనీమియా నుండి అన్ని రకాల ఆరోగ్య సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అందుకే దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలని కోరుతున్నారు పోషకాహార నిపుణులు.

ఖర్జూరంతో చర్మం, జుట్టు సమస్యలు బలాదూర్!

ఖర్జూరాల్లో ఐరన్, ఫైబర్ ఎక్కువ. క్యాల్షియం, పొటాషియం, కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్స్, కాపర్ పాళ్లు కూడా పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల డేట్స్‌లో 8-10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. డేట్స్‌ను పాలతో కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే పిల్లల్లో, వృద్ధుల్లో, ఏదైనా జబ్బు నుంచి కోలుకునే వారికి ఇది మంచి ఆహారం. ఖర్జూరం తినడం వల్ల ఎల్‌డీఎల్ కొలస్ట్రాల్ బాగా తగ్గి గుండె పనితీరు బాగుంటుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఖర్జూరంలో ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు, అందానికి కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. చర్మ సౌందర్యానికి, జుట్టు అందాన్ని డేట్స్ ఏవిధంగా పెంచుతాయో తెలుసుకుందాం..

ఒక్క రోజుకు 3 ఖర్జూరాలు చాలు మిమ్మల్ని హెల్తీగా ఉంచడానికి..!ఒక్క రోజుకు 3 ఖర్జూరాలు చాలు మిమ్మల్ని హెల్తీగా ఉంచడానికి..!

చర్మంను యవ్వనంగా మార్చుతుంది :

చర్మంను యవ్వనంగా మార్చుతుంది :

ఖర్జూరంలో ఉండే ప్రోటీన్స్, మరియు ఎంజైమ్స్ చర్మంను ఆరోగ్యంగా ఉంచుతుంది. రెగ్యులర్ గా ఎండు ఖర్జూరాలను తినడం వల్ల చర్మం మెరుస్తుంటుంది. అందమైన చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. ఖర్జూరాల్లోని విత్తనాలు తీసేసి, పాలలో వేసి రాత్రంతా నానబెట్టి, ఉదయం పాలతో సహా మొత్తగా పేస్ట్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

ఏజింగ్ లక్షణాను నివారిస్తుంది

ఏజింగ్ లక్షణాను నివారిస్తుంది

ఖర్జూరంలో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీరాడికల్స్ ను తొలగించి ఏజింగ్ సమస్యలను తగ్గిస్తుంది. చర్మంలో ముడుతలను, సన్నని ఛారలను నివారిస్తుంది. యాంటీఏజింగ్ మాస్క్ కోసం డేట్స్ ను మెత్తగా పేస్ట్ చేసి, అందులో ఒక స్పూన్ పెరుగు, తేనె కలిపి , ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

ప్రతిరోజూ అరగ్లాసు దానిమ్మ జ్యూస్, 3కర్జూరాలు తింటే ఏమవుతుంది ? ప్రతిరోజూ అరగ్లాసు దానిమ్మ జ్యూస్, 3కర్జూరాలు తింటే ఏమవుతుంది ?

చర్మం యొక్క స్థితి స్థాపకతను పెంచుతుంది:

చర్మం యొక్క స్థితి స్థాపకతను పెంచుతుంది:

డేట్స్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంది. ఇది స్కిన్ ఎలాసిటి పెంచుతుంది. డేట్స్ లో ఉండే న్యూట్రీషియన్స్, స్కిన్ టిష్యు క్వాలిటి పెంచుతుంది. డేట్స్ తీసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి. అందులో కొద్ది సాండిల్ వుడ్ పౌడర్, పసుపు , పాలు కలపాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి, అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి

స్ట్రెచ్ మార్క్స్ ను సులభంగా తగ్గిస్తుంది:

స్ట్రెచ్ మార్క్స్ ను సులభంగా తగ్గిస్తుంది:

స్ట్రెచ్ మార్క్స్ ను తొలగించడంలో మంచి హోం రెమెడీ డేట్స్, డేట్స్ లో ఉండే విటమిన్ డి స్ట్రెచ్ మార్క్స్ ను తొలగిస్తుంది. ఇతర చర్మ సమస్యలను కూడా నివారిస్తుంది. డేట్స్ ను పాలలో నానబెట్టి, మెత్తగా పేస్ట్ చేయాలి. దీనికి కొద్దిగా అలోవెర జెల్ ను మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

సాప్ట్ అండ్ సపెల్ స్కిన్

సాప్ట్ అండ్ సపెల్ స్కిన్

డేట్స్ మాత్రమే కాదు డేట్ ఆయిల్ కూడా చర్మానికి అందంగా మార్చుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, అన్ని రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది. డేట్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. డేట్ ఆయిల్ కూడా మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం సాప్ట్ గా మారుతుంది

జుట్టు రాలడం తగ్గిస్తుంది:

జుట్టు రాలడం తగ్గిస్తుంది:

జుట్టు రాలడం తగ్గించడంలో డేట్స్ ఎఫెక్టివ్ హోం రెమెడీ. విటమిన్స్ లోపం వల్ల జుట్టు బలహీనంగా మారి, జుట్టు రాలడం తగ్గుతుంది. డేట్స్ లో ఐరన్ , ఇతర విటమిన్స్ అధికంగా ఉండటం వల్ల ఇది జుట్టు రాలడం తగ్గించి జుట్టు పెరిగేలా చేస్తుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో డేట్స్ ను చేర్చుకోవాలి. అలాగే డేట్స్ పేస్ట్ ను జుట్టుకు అప్లై చేయవచ్చు.

ఖర్జూరం +పాలలో దాగున్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!!ఖర్జూరం +పాలలో దాగున్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!!

పొడవాటి, ఒత్తైన జుట్టు:

పొడవాటి, ఒత్తైన జుట్టు:

డేట్ ఆయిల్ ను జుట్టుకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇందులో ఉండే న్యూట్రీషియన్స్, విటమిన్స్ జుట్టును పొడవుగా ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. తెల్ల జుట్టును నివారిస్తుంది

తలలో దురద తగ్గిస్తుంది:

తలలో దురద తగ్గిస్తుంది:

తలలో దురదను తగ్గించడంలో డేట్స్ సహాయపడుతాయి. డేట్స్ పేస్ట్ ను తలకు అప్లై చేయడం వల్ల తలలో దురద తగ్గుతుంది.. డేట్స్ ను మెత్తగా పేస్ట్ చేసి అందలో అరకప్పు మయోనైజ్ మిక్స్ చేసి, మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి , 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి

English summary

Skin And Hair Benefits Of Dates in Telugu

Dates are packed with a host of nutrients and proteins, which not only benefit your body but also benefit your skin and hair in many ways when included in the beauty regimen. So, here we would mention to you about the skin and hair benefits of dates
Desktop Bottom Promotion