For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆశ్చర్యపరుస్తున్న పచ్చబొట్టుకు సంబంధించిన నిజాలు :

By R Vishnu Vardhan Reddy
|

టాటూస్‌! ఆధునిక అలంకరణలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన ఫ్యాషన్‌. బ్రాండెడ్‌ దుస్తులు, గాగుల్స్‌, పలురకాల హెయిర్‌ స్టయిల్స్‌, చెవిపోగులు, బ్రాస్‌లెట్‌...ఈ వరుసలో యువకుల అలంకరణలో టాటూలు వచ్చి చేరాయి. తెల్లని మెరిసే చర్మం మీద రంగురంగుల టాటూ చూడటానికి చాలా అందంగా కనబడుతుంది.

ఇక అమ్మాయిలు కూడా నడుము, చేతులు, ఛాతీ ఇలా శరీరంలోని వివిధ భాగాలమీద టాటూలు వేయించుకుని తమ ప్రత్యేకతను, అభిరుచిని చాటుకుంటున్నారు. ఇది వరకు చేతిమీద మాత్రమే పండే గోరింట ఇప్పుడు ఒళ్లంతా పండుతోంది. యువతరంలో అత్యంత ఇమేజ్‌ తెచ్చుకుని తన హవా చూపిస్తున్న టాటూ గురించి కొన్ని వాస్తవాలు ఈ క్రింది విధంగా...

#1 మంచు మనిషి

#1 మంచు మనిషి

మంచు మనిషి ( 3300 నుండి 3200 క్రీస్తు పూర్వం ), వీళ్ళ ఆనవాళ్లు భౌతికంగా ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలానే ఉన్నాయి. వీటిని ఎన్నో సంవత్సరాలుగా సంరక్షిస్తున్నారు. అత్యంత ప్రాచీన పచ్చబొట్లుగా వీటిని గుర్తించారు. ఎడమ మోకాలి లోపల ఒక నల్లటి రంగులో శిలువ గుర్తు, వెనుక వైపు క్రిందన ఆరు తిన్నని గీతాలు మరియు మోచేయి, కాళ్ళు మరియు మణికట్టు పైన సమాంతర గీతాలు ఉన్నాయి. శాస్త్రజ్ఞులు ఆ శరీరాన్ని ఎక్స్ రే తీసినప్పుడు, ప్రతి ఒక్క పచ్చబొట్టు క్రింద నొప్పులకు సంబంధించిన వ్యాధి ఉందనే విషయాన్ని గుర్తించారు. ఆ నొప్పుల భాద నుండి బయటపడటానికి ఈ పచ్చబొట్లు వాడేవారని బలంగా నమ్ముతున్నారు.

#2 ఫ్రాన్స్, పోర్చుగల్ మరియు స్కాండినేవియా దేశాలకు

#2 ఫ్రాన్స్, పోర్చుగల్ మరియు స్కాండినేవియా దేశాలకు

ఫ్రాన్స్, పోర్చుగల్ మరియు స్కాండినేవియా దేశాలకు సంబంధించిన పురావస్తు శాఖ నిపుణులు, కొన్ని పనిముట్లను వెలికి తీశారు. వాటినన్నింటిని ఇంతకుమునుపు పచ్చబొట్లువేయడానికి ఉపయోగించేవారని భావిస్తున్నారు. ఈ పరికరాలు కనీసం అంటే 12000 సంవత్సరాలకు ముందువి అయిఉంటాయని లేదా మంచు యుగం నాటివి అయిఉంటాయని చెబుతున్నారు.

#3 టాటూ అనే ఈ ఆంగ్ల పదం పాలినేషియన్ పదం అయిన

#3 టాటూ అనే ఈ ఆంగ్ల పదం పాలినేషియన్ పదం అయిన "ట" నుండి ఉద్భవించింది.

పచ్చబొట్లని ఆంగ్లంలో "టాటూ " అంటారు. టాటూ అనే ఈ ఆంగ్ల పదం పాలినేషియన్ పదం అయిన "ట" నుండి ఉద్భవించింది. ఒక పదునైన కడ్డీని ఉపయోగించి చర్మానికి పచ్చబొట్టు వేసే విధానాన్ని ఇది తెలియపరుస్తుంది. మొదటి సారి టాటూ అనే పదాన్ని ప్రకృతి శాస్త్రవేత్త కెప్టెన్ కూక్స్ షిప్ వాడినట్లు, జోసెఫ్ బ్యాంక్స్ అనే పత్రికలో ఈ విషయం పొందుపరిచి ఉంది, మొదటిసారి టాటూ అనే పదం అప్పుడే వాడినట్లు తెలుస్తుంది. అప్పటి వరకు యూరోపియన్లు టాటూ ని " మార్క్స్ " లేదా " ప్రిక్స్ " అని పిలిచేవారు.

#4 యూరోపియన్లు దక్షిణ పసిఫిక్ ప్రాంతానికి రాకముందే

#4 యూరోపియన్లు దక్షిణ పసిఫిక్ ప్రాంతానికి రాకముందే

యూరోపియన్లు దక్షిణ పసిఫిక్ ప్రాంతానికి రాకముందే, పోలినేషియన్లుకు పచ్చబొట్లు వేయడం అనే సంస్కృతిని వాళ్ళు అనుసరించేవారు. వీరు వీటిని వేయడంలో చాలా నేర్పరులుగా పేరు సంపాదించారు.

#5 పూర్వ కాలం శరీరం పై వేసిన ఈ పచ్చబొట్లను

#5 పూర్వ కాలం శరీరం పై వేసిన ఈ పచ్చబొట్లను

పూర్వ కాలం శరీరం పై వేసిన ఈ పచ్చబొట్లను తీసివేయడం కోసం చాలా పాత పురాణ పద్దతులను వాడేవారు. అందులో భాగంగా కుండ అడుగున ఉండే మడ్డిని చాలా శక్తివంతమైన వెనిగర్ తో కానీ లేదా పావురాల యొక్క మలాన్ని వెనిగర్ తో కలిపేవారు. ఆ కలిపినా మిశ్రమాన్ని పిండికట్టు పద్దతి లో చాలా కాలం పాటు ఆ యొక్క పచ్చబొట్టు పై ఉంచేవారు.

 #6 ఇప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో పెరిగిపోయింది.

#6 ఇప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో పెరిగిపోయింది.

ఇప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో పెరిగిపోయింది.శరీరం పై ఉన్న పచ్చబొట్లను తీసివేయడానికి ఎన్నో రకాల పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో అత్యంత ఆదరణ పొంది, సఫలీకృతమైన పద్దతి లేజర్ చికిత్స. ఈ లేజర్ చికిత్స ద్వారా చాలా సులువుగా, ఖచ్చితత్వంతో పచ్చబొట్టుని చర్మం పై నుండి తీసివేయవచ్చు. లేజర్ కిరణాలు చర్మం లోపలి చొచ్చుకుపోయి, ఈ పచ్చబొట్లు ఉన్న ప్రదేశంలో వర్ణ ద్రవ్యాలను విచ్ఛిన్నం చేసి శరీరంలో ఉన్న వ్యాధి నిరోధక శక్తికి ఎటువంటి నష్టం చేకూరకుండా, వాటి యొక్క సహాయంతో సహజసిద్ధమైన ప్రక్రియ ద్వారా ఈ తతంగాన్ని అంతా పూర్తి చేసేస్తున్నారు. నలువు రంగులో ఉన్న పచ్చ బొట్టుని చాలా సులువుగా తీసివేయవచ్చు. ఎందుచేతనంటే, ఈ రంగు లేజర్ కిరణాలను ఎక్కువగా గ్రహిస్తుంది. పసుపుపచ్చ మరియు ఆకుపచ్చ రంగులను తొలగించడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం.

#7 గ్రీకులు పెర్షియన్ల దగ్గర నుండి ఈ పచ్చబొట్లు వేసే విధానాన్ని నేర్చుకున్నారు.

#7 గ్రీకులు పెర్షియన్ల దగ్గర నుండి ఈ పచ్చబొట్లు వేసే విధానాన్ని నేర్చుకున్నారు.

గ్రీకులు పెర్షియన్ల దగ్గర నుండి ఈ పచ్చబొట్లు వేసే విధానాన్ని నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఉండే బానిసలకు మరియు నేరస్థులకు పచ్చబొట్లు వేయడం ప్రారంభించారు. ఒకవేళ వారు గనుక తప్పించుకొని పారిపోతే వాళ్ళను సులువుగా గుర్తించడానికి ఈ పద్దతిని ఎంచుకున్నారు. రోమన్లు గ్రీకుల దగ్గర నుండి ఈ పచ్చబొట్ల విధానాన్ని నేర్చుకున్నారు. వీరు కూడా బానిసలను గుర్తించడానికి మరియు పారిపోతే పట్టుకోవడానికి సులువుగా ఉంటుందని పచ్చబొట్లను బానిసలకు వేసేవారు.

#8 అందరు రోమన్ చక్రవర్తులలో, కాలిగుల అనే చక్రవర్తి

#8 అందరు రోమన్ చక్రవర్తులలో, కాలిగుల అనే చక్రవర్తి

అందరు రోమన్ చక్రవర్తులలో, కాలిగుల అనే చక్రవర్తిని చాలా ఎక్కువ వెర్రి ఉన్న చక్రవర్తిగా అభివర్ణిస్తుంటారు. ఎందుచేతనంటే, తనకున్న మోజుకు అనుగుణంగా తనయొక్క దర్బారులో ఉన్న వ్యక్తులందరూ పచ్చబొట్లు వేసుకోవాల్సిందిగా తరచూ హుకుం జారీచేసేవాడు.

#9 787 లో, పోప్ హెడ్రియాన్ 1 పచ్చబొట్టు ని ఏ విధానంలో కూడా

#9 787 లో, పోప్ హెడ్రియాన్ 1 పచ్చబొట్టు ని ఏ విధానంలో కూడా

787 లో, పోప్ హెడ్రియాన్ 1 పచ్చబొట్టు ని ఏ విధానంలో కూడా అనుమతించకూడదు అనే ఉద్దేశ్యంతో పూర్తిగా ఆ విధానాన్నే నిషేధించాడు. నేరస్థులు మరియు యోదులపై కూడా వీటిని వేయకూడదు అని చెప్పాడు. ఇక అప్పటి నుండి 19 వ శతాబ్దం వరకు పచ్చబొట్టు అనే విధానం పడమర యూరోప్ లో అసలు ఎవ్వరికి తెలియదనే చెప్పాలి.

#10

#10

పచ్చబొట్టు విధానాన్ని తూర్పు యూరోప్ లో కూడా అంత సానుకూల దృక్పధంతో ఏమి చూడరు. మరీ ముఖ్యంగా బైజాన్టిన్ సామ్రాజ్యంలో. చూడటానికి కొద్దిగా అసభ్యంగా ఉండే పచ్చబొట్లు నుదిటిపై వేసుకున్న ఇద్దరు సన్యాసులు బహిరంగంగా గ్రీకు చక్రవర్తి థియోఫిల్స్ ను విమర్శించినందుకు గాను, వారి పై ఆయన ప్రతీకారం తీర్చుకున్నట్లు చెబుతుంటారు.

English summary

Surprising Facts About Tattoos Series

Surprising Facts About Tattoos Series
Desktop Bottom Promotion