For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆమ్లా వాటర్ తో చర్మం, జుట్టు సమస్యలు మాయం

ఆమ్లా వాటర్ లో బెనిఫిట్స్ గురించి మీకు తెలుసా? ఆమ్లా అంటే ఉసిరి. ఉసిరి కాయని చూస్తే నోరు ఊరంది ఎవరికి చెప్పండి... పకృతి మానవ జీవనానికి ఇచ్చిన అద్భుతవరం ఉసిరి.

|

ఆమ్లా వాటర్ లో బెనిఫిట్స్ గురించి మీకు తెలుసా? ఆమ్లా అంటే ఉసిరి. ఉసిరి కాయని చూస్తే నోరు ఊరంది ఎవరికి చెప్పండి... పకృతి మానవ జీవనానికి ఇచ్చిన అద్భుతవరం ఉసిరి ఇందులోని ఎన్నో సుగుణాలు ఔషదపరంగా మానవళి అందానికి, ఆరోగ్యానికి ఎంతగానో సహకరిస్తున్నాయన్నది వాస్తవం. కాసింత వగరుగా... మరికొంత పులుపుగా... మరికాస్త తీయ్యగా.... అనేక రుచులు కలగలపిన ఈ ఉసిరిని మనం వివిధ రకాలుగా తీసుకుంటాం.

 <strong>బాబోయ్...ఇది ఉసిరి కాయ కాదు...ఆరోగ్యపు సిరిసంపద...! </strong> బాబోయ్...ఇది ఉసిరి కాయ కాదు...ఆరోగ్యపు సిరిసంపద...!

అయితే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉసిరికాల జ్యూస్(ఉసిరికాయ నీళ్లు) తాగితే ఎనలేని సౌందర్యం, ఆరోగ్యం మన సొంతమవుతుందన్న విషయం పకృతి వైద్యనిపుణులు తేల్చి చెప్పున్నారు. ఉసిరి మానవాళికి అందిస్తున్న అందం ఆరోగ్య సంబంధిత విషయాలని ఓసారి పరిశీలిస్తే అద్భుతం అనిపంచక మానదు.

ఆమ్లా వాటర్

ఉసిరికాయలో విటమిన్ సి, అధికంగా ఉంటుంది. ఇంకా వ్యాధినిరోధకశక్తిని పెంచే గుణాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇందులో సౌందర్యాన్ని పెంచే విటమిన్స్ మరియు న్యూట్రీషియన్స్ కూడా అధికంగా ఉన్నాయి. ఈ పోషకాలతో అన్ని రకాల చర్మ, జుట్టు సమస్యలను నివారించుకోవచ్చు. ఉసిరికాయ నీళ్లు సౌందర్యాన్ని పెంచడంలో గ్రేట్ గా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

<strong>కేశ సౌందర్యాన్ని పెంపొందించడంలో ఉసిరి ప్రాధాన్యత...</strong>కేశ సౌందర్యాన్ని పెంపొందించడంలో ఉసిరి ప్రాధాన్యత...

ఆమ్లా వాటర్ ను ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. అందుకోసం 3-4 ఉసిరికాయలను తీసుకుని, నీళ్లో వేసి నానబెట్టాలి. తర్వాత జ్యూసర్ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ వాటర్ ను జుట్టు మరియు చర్మ సమస్యలను నివారించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఈ ట్రెడిషినల్ రెమెడీని ఉపయోగించడం వల్ల పొందే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..

ఆమ్లా వాటర్ స్కిన్ కాంప్లెక్షన్ పెంచుతుంది

ఆమ్లా వాటర్ స్కిన్ కాంప్లెక్షన్ పెంచుతుంది

ఆమ్లా వాటర్ ను చర్మానికి ఉపయోగించినప్పుడు ఇది స్కిన్ కాంప్లెక్షన్ పెంచుతుంది.ఉసిరిలో ఉండే కొన్ని గుణాలు వల్ల చర్మం బ్రైట్ గా మారుతుంది. ఈ ఆమ్లా వాటర్ ను ముఖం శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించాలి. కొన్ని వారాల పాటు ఈ రెమెడీని ఉపయోగిస్తుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది.

ఆమ్లా వాటర్ ఏజింగ్ లక్షణాలను ఆలస్యం చేస్తుంది

ఆమ్లా వాటర్ ఏజింగ్ లక్షణాలను ఆలస్యం చేస్తుంది

ఆమ్లా వాటర్ ను రెగ్యులర్ గా వాడటం వల్ల స్కిన్ ఎలాసిటి పెరుగుతుంది, కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. దాంతో ఏజింగ్ లక్షణాలు దూరం అవుతాయి. చర్మంలో ముడుతలు, చారలు వంటివి కనబడవు.

నేచురల్ డిస్ ఇన్ఫెక్ట్ గా పనిచేస్తుంది :

నేచురల్ డిస్ ఇన్ఫెక్ట్ గా పనిచేస్తుంది :

వివిధ రకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ నివారించుకోవడంలో ఆమ్లా వాటర్ గ్రేట్ గా పనిచేస్తుంది. ఆమ్లా వాటర్ లో ఉండే యాంటీసెప్టిక్ గుణాలు ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా నివారిస్తుంది. ఆమ్లా వాటర్ లో కాటన్ డిప్ చేసి తర్వాత చర్మం మీద అప్లై చేసి మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ నుండి ఉపశమనం కలుగుతుంది

వైట్ హెడ్స్ తొలగిస్తుంది

వైట్ హెడ్స్ తొలగిస్తుంది

ముఖంలో వైట్ హెడ్స్ తొలగించడంలో ఆమ్లా వాటర్ గ్రేట్ గా పనిచేస్తుంది. ఇది చర్మ రంద్రాలను తెరచుకునేలా చేసి శుభ్రం చేస్తుంది. చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది. దీన్ని వారానికొకసారి ఉపయోగిస్తుంటే వైట్ హెడ్స్ పూర్తిగా తొలగిపోతాయి.

స్కిన్ రీజనరేషన్

స్కిన్ రీజనరేషన్

స్కిన్ రీజనరేషన్ కు గ్రేట్ గా సహాయపడుతుంది. యువి కిరణాలు మరియు కాలుష్యం, నుండి చర్మాన్ని కాపాడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని, చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం వారానికొకసారి ఆమ్లా వాటర్ ను ఉపయోగించుకోవాలి.

డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది

డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది

డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించుకోవడం కోసం ఆమ్లా వాటర్ ను చాలా మంది మహిళలు ఉపయోగిస్తుంటారు. ఈ ట్రెడిషినల్ రెమెడీలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది. ఆమ్లా వాటర్ లో కొద్ది తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే చర్మంలో తప్పకుండా మార్పులు వస్తాయి.

తలలో దురదను తగ్గిస్తుంది

తలలో దురదను తగ్గిస్తుంది

ఆమ్లా వాటర్ కేవలం చర్మ సమస్యలను నివారించడానికి మాత్రమే కాదు, జుట్టు సమస్యలను కూడా నివారిస్తుంది. చుండ్రు, తలలో దురద, తలలో ఇన్ఫెక్షన్ వంటి వాటిని నివారించడంలో ఎఫెక్టివ్ రెమెడీ. ఆమ్లా వాటర్ లో కాటన్ డిప్ చేసి తలలో అప్లై చేసి మర్దన చేయాలి. ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి

ఆమ్లా వాటర్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది

ఆమ్లా వాటర్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది

ఆమ్లా వాటర్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల ఎఫెక్టివ్ గా జుట్టుకు పోషణను అందిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. హెయిర్ ఫోలిసెల్స్ పెంచుతుంది. ఆమ్లా వాటర్ ను వారానికొకసారి జుట్టుకు అప్లై చేస్తుంటే జుట్టు రాలడం తగ్గుతుంది.

ఆమ్లా వాటర్ జుట్టు నిగనిగలాడేలా చేస్తుంది

ఆమ్లా వాటర్ జుట్టు నిగనిగలాడేలా చేస్తుంది

జుట్టు పల్చగా మారడాన్ని నివారిస్తుంది. జుట్టు పల్చగా ఉండటం వల్ల త్వరగా డ్యామేజ్ అవ్వడం, లేదా బ్రేక్ అవ్వడం జరుగుతుంటుంది. అందువల్ల తలకు రెగ్యులర్ గా ఆమ్లా వాటర్ ను అప్లై చేయడం ద్వారా హెయిర్ వాల్యూమ్ పెరిగి జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది. దాంతో జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది

English summary

Top Benefits Of Using Amla Water For Skin And Hair Care

Using amla water on the skin and hair is a common beauty care practice that thousands of women indulge in. So, go ahead and pamper your skin and hair with this traditional remedy and raise your beauty quotient.
Desktop Bottom Promotion