For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పళ్ళను సహజంగా తెల్లబర్చే 5 ఇంటి చిట్కాలు

|

ఒక మనిషి వ్యక్తిత్వం తన పళ్ళ ద్వారా తెలుస్తుంది. కానీ చాలా కారణాల వలన మీ పళ్ళు డల్ గా మారి, మెరుపును కోల్పోతాయి. కొన్నిసార్లు కొన్ని ఆహారపదార్థాల మరకలు పింగాణీ ఎనామెల్ (పళ్ళపై ఉండే బయటపొర)పై పడిపోతాయి.ఇంకా, కొన్నిసార్లు పళ్లకి గారపట్టడం వలన అవి పసుపుపచ్చ రంగులో కన్పిస్తాయి. కానీ రకమైన రంగు మారిపోయే, కోల్పోయే సమస్యను సులభంగా ఇంటిలోనే సహజ చిట్కాలతో పరిష్కరించుకోవచ్చు. అలాంటి ఒక ఐదు చిట్కాలను చదివి తెలుసుకోండి.

కొబ్బరినూనె

కొబ్బరినూనె

నిజమే, మీరు చదివినది నిజమే! కొబ్బరినూనె నిజానికి మీ పళ్ళను శుభ్రపర్చగలదు. ఒక చెంచాడు కొబ్బరినూనెను మీ నోట్లోకి వేసుకుని ఐదు నిమిషాల పాటు పుక్కిలిపట్టండి. మీరు టూత్ బ్రష్ పై కూడా కొన్ని చుక్కల కొబ్బరినూనెను వేసుకుని దానితో పళ్ళను ఐదు నిమిషాల పాటు బ్రష్ చేయవచ్చు. తర్వాత మీ నోటిని కడుక్కుని మెల్లగా ఫలితాలను మీరే చూడండి.

యాపిల్ సిడర్ వెనిగర్

యాపిల్ సిడర్ వెనిగర్

యాపిల్ సిడర్ వెనిగర్ లో ఎసిటిక్ యాసిడ్, పొటాషియం ఇంకా మెగ్నీషియం వంటివి ఉండి చెడ్డ బ్యాక్టీరియాను చంపేసి, గారపట్టిన పళ్ళను బాగుచేస్తాయి. ఇంకా, యాపిల్ సిడర్ వెనిగర్ కి ఉండే పిహెచ్ వలన పళ్ళపై మరకలు తొలగిపోతాయి. మీరు చేయాల్సిందల్లా కొంచెం యాపిల్ సిడర్ వెనిగర్ ను పళ్ళపై రెండు నిమిషాలపాటు రుద్ది, నీళ్ళతో తర్వాత నోరు కడుక్కోండి.

నిమ్మ తొక్క

నిమ్మ తొక్క

నిమ్మలో సహజ బ్లీచింగ్ ఏజెంట్లు ఉంటాయి, ఇంకా నిమ్మ తొక్క నిజానికి మీ పళ్ళను శుభ్రపర్చగలదు కూడా. నిమ్మతొక్కను నేరుగా మీ పళ్ళపై రుద్దుకుని తర్వాత నోటిని నీరుతో కడుక్కోండి.

స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీ

మీకు స్ట్రాబెర్రీలు తినటం ఇష్టం అయితే, మీకో మంచివార్త. స్ట్రాబెర్రీలను తినడం లేదా పళ్ళపై రుద్దుకోవడం మీ పళ్ళను సహజంగా తెల్లగా మారేలా చేస్తుంది. అందులో ఉండే యాంటీఆక్సిడెంట్ల మహత్యం!

వంటసోడా

వంటసోడా

ప్రతిఒక్కరికీ వంటసోడా శుభ్రపరిచే గుణాలు తెలుసు, అది మీ పళ్ళపై కూడా పనిచేయగలదు. కొంచెం వంటసోడాను నీళ్ళతో కలపండి. ఈ పేస్టును బ్రష్ పై వేసుకుని ఒక నిమిషం పళ్ళను తోముకోండి. తర్వాత నీళ్ళతో నోటిని కడుక్కోండి.

English summary

5 home remedies to naturally whiten your teeth

5 home remedies to naturally whiten your teeth,Teeth are said to be the window to your personality and there are numerous factors that may cause them to become dull and lose their shine. At times certain foods end up staining the enamel (the outer layer of teeth) of our teeth. Also, at times the accumulation of plaque
Story first published:Saturday, March 3, 2018, 15:21 [IST]
Desktop Bottom Promotion