For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు రోజూ చేసే కొద్దిపాటి తప్పులు మీ దంతాలను పసుపురంగులోకి మారుస్తున్నాయి !

|

మీరు మీ స్నేహితులతో కలిసి దిగిన సెల్ఫీ ఫోటోలను మీరు ఇటీవలే చూసినపుడు, ఇతరల చిరునవ్వుతో పోలిస్తే మీ స్మైల్ అనేది రంగ మారినట్లుగా గమనించవచ్చు (లేదా) తెల్లగా ఉన్న మీ పళ్ళు పసుపు రంగులోకి పాలిపోయినట్లుగా గమనిస్తారు. అందుకు గల కారణమేంటి ?

మొట్టమొదటిగా, మీ పళ్ళు ఈవిధంగా తయారవడానికి గల కారణాలకు సంబంధించిన సమాచారం :

ఎనామెల్ మీ దంతాల యొక్క బయటి పొరగా ఉంటుంది మరియు ఇది బాగా తెల్లగానూ, లేదంటే నీలం - బూడిద రంగులోనూ, కొంతవరకు తెల్లగా అపారదర్శకమును కలిగి ఉంటుంది.

6 Everyday Mistakes That Are Yellowing Your Teeth

DDS లో, కాలిఫోర్నియా బ్రీత్ క్లినిక్స్ స్థాపకుడైన డెంటిస్ట్ హరాల్డ్ కాట్జ్ ప్రకారం, ఎనామెల్ పొర బాగా సన్నగా మారినప్పుడు మాత్రమే "డెంటిన్" అనే పిలువబడే పొర కనిపిస్తుంది. ఆ డెంటిన్ యొక్క రంగు? మీరు ఊహించినదే : పసుపురంగులో ఉంటుంది.

అదృష్టవశాత్తూ, మీరు ఎనామెల్ను బలంగా ఉంచుకోవటానికి మరియు డెంటిన్ను బయటకు కనపడకుండా నిరోధించడానికి చెయ్యవలసిన కొన్ని మార్పులు ఉన్నాయి- అదే విధంగా దంతాలపై ఉన్న ఆహార జాడలు కూడా మీ పళ్ళను పేలవంగా కనిపించేలా చేస్తాయి. ఇక్కడ తెలియజేసిన కొన్ని సాధారణ అలవాట్లను మీరు ఇప్పటి నుంచే ప్రారంభించాలి, అవి :

1) మీరు అధికంగా మౌత్-వాష్ను ఉపయోగించటం :

1) మీరు అధికంగా మౌత్-వాష్ను ఉపయోగించటం :

పొడిగా ఉన్న పళ్ళను సంరక్షించడం చాలా కష్టమైన పరిస్థితి, అని కాట్జ్ చెప్పారు. మీ నోటిలో ఉండే లాలాజలము ఎంజైములను మరియు ఆక్సిజన్ సమ్మేళనాల కలయికను కలిగి ఉండటం వలన మీ నోటిలో పిహెచ్ బ్యాలెన్స్ ఉంచుతుంది, ఎందుకంటే ఇది ఎనామెల్ కలిగివున్న యాసిడ్ను తటస్థీకరిస్తుంది. సూక్ష్మ జీవులను బయటకు పంపించేలా పళ్లకు స్నానమును రెగ్యులర్గా చేస్తుంది మరియు ఎనామెల్ పై ప్రభావం చూపే మచ్చల నుండి కూడా నివారిస్తూ, మీ పళ్ళు పాలిపోకుండా రక్షిస్తుంది.

" అనేక రకాల వాణిజ్య పరమైన మౌత్-వాష్ ఎల్ చాలా ఆమ్లత్వమును కలిగి వుంటాయి. మీరు తరచుగా వీటిని ఉపయోగించినట్లయితే, మీ పంటిపై ఉన్న ఎనామెల్ పొర నాశనం కావచ్చు" అని కాట్జ్ చెప్పారు. కాబట్టి, మీరు తాజా శ్వాసను కలిగి ఉండటానికి మౌత్-వాష్ను తరచుగా ఉపయోగించడానికి బదులుగా, తరచుగా బ్రష్ చేయడం మరియు క్రమం తప్పకుండా దంతాలను శుభ్రపర్చుకోవడం వంటి ఇతర పద్ధతులను మీరు పరిగణనలోకి తీసుకోవచ్చు.

2) మీరు తినే పండ్లు మరియు కూరగాయలలో ఆమ్లత్వమును కలిగి ఉన్నట్లయితే :

2) మీరు తినే పండ్లు మరియు కూరగాయలలో ఆమ్లత్వమును కలిగి ఉన్నట్లయితే :

మౌత్-వాష్ల మాదిరిగానే, మీరు వినియోగించే పళ్లు మరియు కూరగాయలలో ఉన్న ఆమ్లత్వం కూడా పంటి యొక్క ఎనామెల్ను నాశనం చేస్తుంది - అని కాట్జ్ అన్నారు. అలాగే సిట్రస్ పండ్లు మరియు రసాలను, టమోటాలు, పైనాపిళ్లు, వెనిగర్, కార్బోనేటేడ్ పానీయాలు, కొన్ని స్పోర్ట్స్ డ్రింకులు మరియు వినెగార్ ఆధారిత కొన్ని సలాడ్ల వంటి వాటిలో కూడా ఆమ్లత్వమును కలిగి ఉంటాయి.

అలా అని వీటన్నిటినీ మీ నుండి దూరంగా ఉంచవలసిన అవసరం లేదు కానీ, వాటిని తినడం (లేదా) తాగడం తర్వాత నీటిని పుక్కిలించి ఊయడం చాలా మంచిదని, కాట్జ్ చెప్పారు. అలాగే, బ్లూబెర్రీస్, డార్క్ టీ, మరియు రెడ్-వైన్ వంటి వాటిని తీసుకున్న తర్వాత, మీ దంతాలకు నష్టం వాటిల్లకుండా వుండటానికి మీరు ఎక్కువ నీటిని తీసుకోవాలని అతను సూచించాడు.

3) రోజు మొత్తంలో ఎక్కువుగా కాఫీని త్రాగేవారైతే :

3) రోజు మొత్తంలో ఎక్కువుగా కాఫీని త్రాగేవారైతే :

కాఫీ వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని పరిశోధకులు సూచించినప్పటికీ, అది మీ దంతాల మీద కఠినమైన ప్రభావాన్ని కలిగి ఉంటుందని, ఫ్రైడ్మాన్ డెంటల్ గ్రూప్ యొక్క దంతవైద్యుడు కాటియా ఫ్రైడ్మాన్ (DDS) చెప్పారు.

"ప్రతిరోజూ రెండు (లేదా) మూడు కాఫీలను త్రాగటం వల్ల మీ దంతాల యొక్క ఎనామెల్ ఒక స్థిరమైన ఏజెంట్తో స్థిరంగా ఉండటానికి అనుమతిస్తుంది," ఆమె చెప్పారు. ఎనామెల్ పోరలో ఉన్న ఖాళీలలో కాఫీలను త్రాగినప్పుడు కొంత ఈ పొరల్లోనుకి పోయి తిష్ట వేసుకుని ఉంటున్నంధున, మీరు ఈ రంధ్రాలలో క్రమంగా బ్రష్తో శుభ్రం చేయకపోతే అవి పసుపు రంగులోకి మారవచ్చు.

మీరు ఎంత పరిమాణాన్ని త్రాగరో అన్నది ఆందోళన కాదు, మీరు ఎక్కువ సార్లు సిప్ చేస్తూ త్రాగటం వల్ల మీ దంతాలకు నష్టం వాటిల్లుతుందని ఆమె చెప్పారు. మీరు త్వరగా కాఫీ త్రాగటం గానీ, (లేదా) స్ట్రా సాయంతో కాఫీ త్రాగటం వల్ల మీ పళ్ళకు జరిగే నష్టాన్ని నివారించవచ్చని, ఆమె చెప్పారు.

4. మీరు పొగత్రాగేవారైతే :

4. మీరు పొగత్రాగేవారైతే :

సిగరెట్లు మరియు పైప్ టోబాక్కోలలో ఉన్న రసాయనాలు మీ దంతాలపై మచ్చల ప్రభావాన్ని కలిగి ఉంటాయి, ఎందుకంటే అవి ఎనామెల్కి అతుక్కుపోయి ఉంటాయని, ఫ్రైడ్మ్యాన్ చెప్పారు. మీరు మరింత ఎక్కువగా ధూమపానం చేయడం వల్ల ఇది ఇంకా స్పష్టంగా కనిపిస్తుందని తెలియజేశారు.

ధూమపానం వల్ల చిగుళ్ల వ్యాధి, దంతక్షయం మరియు పొడి-నోరు వంటి ఇతర నోటి ఆరోగ్య సమస్యలతో సంబంధం కలిగి ఉంటుంది, మీరు బలమైన, తెల్లని పళ్ళను కలిగి ఉండాలనుకునట్లైతే తక్షణమే ధూమపానాన్ని విడిచిపెట్టండి.

5. మీరు నోటి పరిశుభ్రత అలవాట్లను సంపూర్ణంగా పాటించకపోవటం :

5. మీరు నోటి పరిశుభ్రత అలవాట్లను సంపూర్ణంగా పాటించకపోవటం :

మీరు ఈ కొత్త సంవత్సరంలో కొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకోకపోతే ఇదే సరైన సమయం ఫ్లోస్ (floss) చెయ్యడానికి; మీరు సరిగ్గా బ్రషింగ్ మరియు ఫ్లాసింగులను చెయ్యవలసిన దానికన్నా తక్కువగా ఉండటం వలన మీ ఎనామెల్లో ఫలకములు ఏర్పడవచ్చని - ఫ్రైడ్మన్ తెలియజేశారు.

ఇది మీ పంటిని కలిగి ఉన్న పొరను మరింత సన్నగా తయారు చేస్తుంది, మీ పళ్ళపై ఉన్న బ్యాక్టీరియా పసుపు వర్ణంలో కనిపిస్తాయి. మీరు సరైన ఆహారాన్ని నియమాలను పాటిస్తూ ఉండాలి, అలాగే సంవత్సరంలో ఒక్కసారి మీ ఆఫీసును శుభ్రపరిచినట్లుగా, పసుపు రంగులో ఉన్న మీ పళ్ళను స్క్రబ్బింగ్ చేయటం చాలా మంచిదని ఆమె పేర్కొన్నారు.

6) మీరు కొంచెం ఉత్సాహంగా బ్రష్ చేయాలి :

6) మీరు కొంచెం ఉత్సాహంగా బ్రష్ చేయాలి :

మీరు అధిక పీడనాన్ని ఉపయోగించి చాలా వేగంగా బ్రష్ చేయడం అనేది మీ పళ్ళను ఆరోగ్యవంతంగా చెయలేదు. ఎందుకంటే, వాస్తవానికి అది వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది మజెన్-నతుర్, DMD, మాన్హాటన్ ఆధారిత ప్రోస్టాడొంటనిస్ట్లను సూచిస్తుంది. మీ టూత్పేస్ట్లో "అమెరికన్ డెంటల్ అసోసియేషన్" చేత ఆమోదం పొందని 'రాపిడి ఏజెంట్లను' కలిగి ఉంది, ఇది ప్రత్యేకించి బయటపడిన నిజం.

"మీరు చాలా హార్డ్గా (లేదా) చాలా ఎక్కువగా బ్రష్ చేస్తే, మీరు సన్నని ఎనామెల్ పొరను దూరం చేసుకొని, డెంటిన్ పొరను బహిర్గతం చేయవచ్చు" అని ఆయన చెప్పారు. మీ పళ్ళు ఇప్పటికే పసుపు రంగులో ఉంటే, మీ దంతవైద్యుడిని సంప్రదించి మీ పళ్ళు తెల్లబడటానికి అనుసరించవలసిన సూచనలను, సలహాలను అలాగే మీ అలవాట్లను మార్చుకోండి. తిరిగి మీ పళ్ళు ముత్యాల్లాగా తెల్లగా మారాలంటే మరికొన్ని ఛాయిస్లను మీరు అనుసరించవలసి ఉంటుంది.

English summary

6 Everyday Mistakes That Are Yellowing Your Teeth

Maybe you’ve looked through your selfies-with-friends photos lately and noticed that your smile appears off-color compared to the others. Or perhaps you’re just seeing a bit of yellow creeping into teeth that used to be whiter. What gives?
Story first published:Wednesday, March 7, 2018, 13:23 [IST]
Desktop Bottom Promotion