For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టమాటోస్ ద్వారా చర్మానికి అలాగే కేశాలకి అందే అద్భుతమైన ప్రయోజనాలలివే

టమాటోస్ ద్వారా చర్మానికి అలాగే కేశాలకి అందే అద్భుతమైన ప్రయోజనాలలివే

|

టమాటోస్ అనేవి ఆహారానికి మంచి టేస్ట్ ను జోడించడంతో పాటు మీ ఆరోగ్యానికి అనేకవిధాలుగా ప్రయోజనాలను అందిస్తాయి.

ఇందులో విటమిన్స్ తో పాటు మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. టమాటోలు చర్మాన్ని కాంతివంతంగా మార్చి శిరోజాలను ఆరోగ్యంగా ఉంచే పోషకాలు అనేకం కలవు. టమాటాలు ఏ విధంగా చర్మానికి అలాగే కేశాలకు సంరక్షణనిస్తాయో ఇప్పుడు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

టమాటో ద్వారా చర్మానికి అందే ప్రయోజనాలు

టమాటోని రోజువారీ డైట్ లో భాగంగా చేసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. టమాటోను వాడటం ద్వారా చర్మానికి అందే ప్రయోజనాల గురించి ఇక్కడ వివరించాము.

మెరిసే చర్మం:

మెరిసే చర్మం:

మెరిసే చర్మాన్ని పొందేందుకు టమాటోని ఈ విధంగా వాడవచ్చు. టమాటోని రెండు భాగాలుగా తరుగుకుని వాటితో చర్మంపై సున్నితంగా రబ్ చేయండి. ఈ పద్దతి స్కిన్ టోన్ ని ఈవెన్ చేస్తుంది. ఆరోగ్యకరమైన మెరుపును చర్మానికి అందిస్తుంది. మృదువైన అలాగే కాంతివంతమైన చర్మాన్ని పొందేందుకు టమాటో జ్యూస్ లో కాస్తంత తేనెను జోడించండి. ఈ పేస్ట్ ను చర్మంపై అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచితే మీ చర్మం సహజసిద్ధమైన కాంతిని సహజంగా సంతరించుకుంటుంది.

స్కిన్ పోర్స్ ను టైట్ చేస్తుంది:

స్కిన్ పోర్స్ ను టైట్ చేస్తుంది:

పెద్ద స్కిన్ పోర్స్ ను తగ్గించేందుకు టమాటా తోడ్పడుతుంది. ఈ ప్రయోజనం పొందేందుకు, నాలుగు చుక్కల టమాటో రసంలో ఒక టేబుల్ స్పూన్ నీళ్లను జోడించి ఈ లోషన్ ను ఒక కాటన్ బాల్ సహాయంతో ముఖంపై అప్లై చేసుకోవాలి. సున్నితంగా మసాజ్ చేయడం ద్వారా ఈ లోషన్ చర్మంలోకి ఇంకుతుంది. ఆ తరువాత పదిహేను నిమిషాల వరకు అలాగే ఉంచాలి. ఈ ప్రాసెస్ ని రెగ్యులర్ గా పాటించడం వలన పోర్స్ యొక్క సైజ్ గణనీయంగా తగ్గడాన్ని మీరు గమనించవచ్చు.

నేచురల్ సన్ స్క్రీన్:

నేచురల్ సన్ స్క్రీన్:

టమాటోస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా లైకోపీన్ లభిస్తుంది. ఇది నేచురల్ సన్ స్క్రీ���్ గా పనిచేస్తుంది. ఇది కఠినమైన యూవీ రేస్ నుంచి చర్మాన్ని సంరక్షిస్తుంది. కనీసం అయిదు టేబుల్ స్పూన్ల టమాటో పేస్ట్ ను ప్రతి రోజూ తీసుకోవాలి. ఇలా మూడు నెలలపాటు పాటిస్తే సన్ బర్న్స్ నుంచి సహజ రక్షణ అందుతుంది. అలాగే, టమాటోని ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయవచ్చు కూడా. రెండు టీస్పూన్ టమాటో పల్ప్ లో ఒక టీస్పూన్ యోగర్ట్ ను కలిపి ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయాలి.

చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది:

చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది:

టొమాటోస్ అనేవి చర్మానికి ఆక్సిజన్ సవ్యంగా అందేలా తోడ్పడతాయి. తద్వారా, ఏజింగ్ సైన్స్ ను నిరోధిస్తాయి. ప్రతిరోజూ టమాటోలను తీసుకోవడం ద్వారా చర్మం యవ్వనంగా ఉంటుంది. సెల్యులార్ డేమేజ్ అరికట్టబడుతుంది. చర్మం ఎర్రబడటం, ఫైన్ లైన్స్ అలాగే ముడతల సమస్యలు అరికట్టబడతాయి. ఇది అద్భుతమైన నేచురల్ స్కిన్ ట్రీట్మెంట్ గా పనిచేస్తుంది. తద్వారా, చర్మం ఆరోగ్యంగా అలాగే యవ్వనంగా మారుతుంది.

అద్భుతమైన స్కిన్ టోనర్:

అద్భుతమైన స్కిన్ టోనర్:

టమాటో అనేది అద్భుతమైన స్కిన్ టోనర్ గా పనిచేస్తుంది. ఇందులో ఉండే అస్ట్రింజెంట్ ప్రాపర్టీలు ఆయిలీ మరియు కాంబినేషన్ స్కిన్ కలిగిన వారికి ఏంతో మేలు చేస్తాయి. చర్మానికి సహజసిద్ధమైన కాంతిని అందిస్తాయి. టొమాటోస్ లోని ప్రయోజనాలని వేరే పదార్థాలతో కలిపి కూడా పొందవచ్చు. స్కిన్ టైప్ కి తగినట్టుగా కాంబినేషన్స్ ను చేసుకోవాలి. ఉదాహరణకి, ఆయిలీ స్కిన్ కలిగిన వారు శనగపిండి మరియు టమాటో జ్యూస్ ను సమాన మొత్తంలో తీసుకుని ఈ మిశ్రమాన్ని ముఖంపై అలాగే మెడపై అప్లై చేసుకోవాలి. ఇరవై నిమిషాల తరువాత వెచ్చటి నీటితో శుభ్రపరచుకోవాలి. డ్రై స్కిన్ గలవారు, టమాటో జ్యూస్ ను అలాగే పెరుగును సమాన మొత్తంలో తీసుకుని ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి. పది నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రపరచుకోవాలి. కాంబినేషన్ స్కిన్ కలిగిన వారు మ్యాష్ చేసిన అవొకాడోస్ మరియు టమాటోలను కలిపి ఒక ప్యాక్ లా తయారుచేసుకుని ముఖానికి అలాగే మెడకి అప్లై చేసుకోవాలి. పదిహేను నిమిషాల తరువాత రిన్స్ చేసుకోవాలి.

స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది:

స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది:

టమాటో అనేది సహజసిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది స్కిన్ టోన్ ను మెరుగుపరిచేందుకు అత్యద్భుతంగా తోడ్పడుతుంది. ఒక టీస్పూన్ ఓట్ మీల్ మరియు పెరుగులో రెండు టీస్పూన్ల టమాటో గుజ్జును జోడించి ఒక మాస్క్ ను తయారుచేసుకోవాలి. దీనిని ముఖంపై అలాగే మెడపై అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత నీళ్లతో రిన్స్ చేయాలి. ఇది స్కిన్ ని ఎక్స్ఫోలియెట్ చేయడంతో పాటు కాంప్లెక్షన్ ను మెరుగుపరుస్తుంది. బ్లేమిషెస్ ను తొలగిస్తుంది.

చర్మాన్ని ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది:

చర్మాన్ని ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది:

టొమాటోస్ అనేవి డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. టొమాటోస్ ని బ్లెండ్ చేసి అందులో ఒక టీస్పూన్ షుగర్ ను జోడించండి. దీనిని ముఖానికి అప్లై చేసి సర్క్యూలర్ మోషన్ లో సున్నితంగా మసాజ్ చేయండి మరొక పద్దతి ఏంటంటే, టమాటోని రెండు భాగాలుగా తరిగి దాని మీద కాస్తంత షుగర్ ను చల్లి ఆ టమాటో ముక్కతో చర్మాన్ని రబ్ చేయాలి.

టొమాటోస్ ద్వారా కేశాలకు అందే ప్రయోజనాలు

టొమాటోస్ ద్వారా కేశాలకు అందే ప్రయోజనాలు

టమాటోలో విటమిన్ ఏ, బీ, సీ మరియు ఈ వంటి విటమిన్స్ కలవు. ఇవి కేశాలను ఆరోగ్యంగా ఉంచేందుకు ముఖ్య పాత్ర పోషిస్తాయి. కేశాల ఆరోగ్యానికి టమాటో ఏ విధంగా తోడ్పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

హెయిర్ ను కండిషన్ చేస్తుంది

టొమాటోస్ అనేవి నేచురల్ హెయిర్ కండిషనర్స్ గా వ్యవహరిస్తాయి. కాస్తంత టమాటో పల్ప్ ని హెయిర్ కు అప్లై చేసి పదిహేను నిముషాల తరువాత చల్లటి నీటితో హెయిర్ ను వాష్ చేయండి. ఈ పద్దతి హెయిర్ కు నేచురల్ షైన్ ను అందించడంతో పాటు హెయిర్ ను మృదువుగా అలాగే మేనేజబుల్ గా మారుస్తుంది.

హెయిర్ లాస్ ను అరికడుతుంది:

హెయిర్ లాస్ ను అరికడుతుంది:

టమాటోస్ లో హెయిర్ లాస్ ను అరికట్టే గుణాలు అనేకం. కాస్తంత టమాటో పల్ప్ ను హెయిర్ పై అప్లై చేసి ఇరవై నిమిషాల తరువాత మీరు పాటించే సాధారణ పద్దతిలో హెయిర్ ను వాష్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అనేది హెయిర్ లాస్ ను అరికడుతుంది. ఈ విధానాన్ని వారానికి మూడు సార్లు పాటిస్తే గుర్తించదగిన మార్పును గమనించగలుగుతారు.

డ్రై హెయిర్ సమస్యను అరికడుతుంది:

డ్రై హెయిర్ సమస్యను అరికడుతుంది:

వాతావరణ మార్పుల వలన స్కాల్ప్ లోని తేమ అనేది తొలగిపోతుంది. అందువలన, హెయిర్ పొడిగా అలాగే చిట్లినజట్టుగా మారుతుంది. టమాటోస్ అనేవి డ్రై హెయిర్ కు జీవాన్ని అందించేందుకు తోడ్పడతాయి. తిరిగి తేమను అందిస్తాయి. తద్వారా, డ్రై నెస్ అరికట్టబడుతుంది.

హెయిర్ కు కాంతినిస్తుంది:

హెయిర్ కు కాంతినిస్తుంది:

యిర్ ని వాష్ చేస్తున్నప్పుడు టొమాటోస్ ని ఫైనల్ హెయిర్ రిన్స్ గా వాడితే మంచిది. దీని వలన స్కాల్ప్ పై పేరుకున్న బిల్డ్ అప్ ని సులభంగా తొలగించవచ్చు. శిరోజాలకు కాంతి అందుతుంది. దీనికోసం టొమాటోస్ లోని సీడ్స్ ను తొలగించి టమాటోని జ్యూస్ గా చేసుకోవాలి. ఈ టమాటో జ్యూస్ ను హెయిర్ ను వాష్ చేసిన తరువాత హెయిర్ స్ప్రే గా వాడుకోవాలి. గంట తరువాత హెయిర్ ను వాష్ చేసుకోవాలి.

టొమాటోస్ అనేవి పోషకాలు పుష్కలంగా లభించే వెజిటబుల్. ఇది ఆరోగ్యాన్ని అలాగే సౌందర్యాన్ని పరిరక్షించడానికి తోడ్పడుతుంది. కాబట్టి, టొమాటోస్ ని వాడటం ద్వారా దీని నుంచి అందే ప్రయోజనాలను పొందవచ్చు.

English summary

Amazing Benefits Of Tomatoes For Skin And Hair

Tomatoes have much more to offer than adding good taste to your dishes and boosting your overall health.The abundance of vitamins and minerals in this tangy veggie is the best way to keep your skin flawless and hair healthy. Take a look at how tomatoes can be the best pal for your skin and hair.
Desktop Bottom Promotion