For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాదాలపై దురదని తగ్గించే సహజసిద్ధమైన హోమ్ రెమెడీస్

పాదాలపై దురదని తగ్గించే సహజసిద్ధమైన హోమ్ రెమెడీస్

|

పాదాలపై దురద కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వలన తలెత్తుతుంది. సాధారణంగా ఈ సమస్య అథ్లెట్స్ ఫుట్ వలన తలెత్తుతుంది. టినియా పెడీస్ అనే ఒక రకమైన ఫంగస్ వలన ఈ కండిషన్ ఎదురవుతుంది.

ఈ రకమైన ఇన్ఫెక్షన్ ముఖ్యంగా చర్మాన్ని అలాగే గోర్లని టార్గెట్ చేస్తుంది. దురదతో పాటు చర్మం ఎర్రబడటం, అలాగే చర్మం పగలటం, మంటతో పాటు ఫ్లేకీ స్కిన్ సమస్య వేధిస్తుంది. సాధారణంగా, ఈ సమస్య కాలి బొటనవేలిపై కనిపిస్తుంది. ఆ తరువాత అరికాళ్లకు వ్యాప్తిస్తుంది. టినియా పెడీస్ అనేది సాధారణంగా తేమ కలిగిన చోట వ్యాప్తిస్తుంది. సాక్స్ లో చెమట పట్టడం అలాగే పాదాలపై తడిని తుడుచుకోకపోవటం వలన ఈ చర్మ సమస్య తలెత్తుతుంది.

Natural Home Remedies For Itchy Feet

ఈ సమస్య తీవ్రరూపం దాల్చినప్పుడు తీవ్రంగా ఇన్ఫెక్ట్ అయిన బ్లిస్టర్స్ కు దారితీస్తుంది. అయితే, దిగులు చెందకండి. కొన్ని హోమ్ రెమెడీస్ ఉన్నాయి. వాటిని పాటిస్తే ఈ సమస్య వలన ఎదురైనా దురదతో పాటు ఇన్ఫెక్షన్స్ వంటివి తగ్గుముఖం పడతాయి.

ఈ ఆర్టికల్ లో కొన్ని చిట్కాలను అలాగే రెమెడీస్ ను వివరించాము వాటిని పాటించడం ద్వారా మీరు పాదాలపై దురదను అలాగే ఇతర ఇబ్బందులను సులభంగా ఇంటివద్దే తగ్గించుకోవచ్చు.

ఉప్పు:

ఉప్పు:

ఇది ప్రతి ఇంట్లో సాధారణంగా లభ్యమయ్యే ఒక ముఖ్య పదార్థం. పాదాలపై దురదను తగ్గించేందుకు ఇది అత్యద్భుతంగా తోడ్పడుతుంది. దురదకి కారణమయ్యే ఫంగైని నశింపచేస్తుంది.

ఎలా వాడాలి:

మొదటగా, కాస్తంత నీటిని వేడి చేసుకోండి. ఈ నీటిని మీ పాదాలు పట్టేంత చిన్న టబ్ లోకి తీసుకోండి. ఇందులో కొంత ఉప్పును జోడించండి. ఉప్పు బాగా కరిగిపోయే వరకు బాగా కలపండి. ఇప్పుడు, ఈ సొల్యూషన్ లో మీ పాదాలను ముంచండి. పది నుంచి పదిహేను నిమిషాల వరకు అలాగే ఉంచండి. పదిహేను నిమిషాల తరువాత శుభ్రమైన టవల్ తో పాదాలపై తడిని తుడవండి.

ఈ రెమెడీను వారానికి మూడు నుంచి నాలుగు సార్లు పాటిస్తే వేగవంతమైన ఫలితాలను పొందగలుగుతారు. అయితే, ఒకవేళ పాదాలపై గాయం ఉన్నట్టయితే ఈ రెమెడీ పనికిరాదు.

పెరుగు:

పెరుగు:

పెరుగులో వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ తో అలాగే బాక్టీరియాతో పోరాడే సామర్థ్యం కలదు. పాదాలపై బాక్టీరియాతో పోరాడి దురద సమస్యను తగ్గిస్తుంది.

ఎలా వాడాలి:

కాస్తంత ప్లెయిన్ అలాగే అన్ ఫ్లేవర్డ్ పెరుగుని ప్రభావిత ప్రాంతంపై అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఇరవై నిమిషాల తరువాత, నార్మల్ వాటర్ తో శుభ్రపరచుకోవాలి. ఆ తరువాత, శుభ్రమైన టవల్ తో పాదాలపై తడిని తుడవాలి. పాదాలపై తేమ ఏ మాత్రం లేకుండా టవల్ తో క్లీన్ చేసుకోవాలి. లేదంటే, ఇన్ఫెక్షన్ మరింత ముదిరే ప్రమాదం ఉంది. ఈ రెమెడీను వారానికి రెండు సార్లు పాటించండి.

వినేగార్:

వినేగార్:

వినేగార్ లో యాంటీ సెప్టిక్ ప్రాపర్టీస్ కలవు. ఇవి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ను వేగవంతంగా నిర్మూలించడానికి తోడ్పడతాయి. వినేగార్ అనేది చర్మంపై తేమను గ్రహిస్తుంది. అందువలన, ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే ఫంగై అనేది నశింపబడుతుంది.

ఎలా వాడాలి:

పాదాలు పట్టేంత టబ్ ను తీసుకుని అందులో ఒక పార్ట్ వినేగార్ ను మూడు పార్ట్శ్ వెచ్చటి నీటిని జోడించాలి. ఈ మిశ్రమంలో పాదాలను పదిహేను నిమిషాల వరకు ముంచి ఉంచాలి, పదిహేను నిమిషాల తరువాత టవల్ తో పాదాలపై తడిని తుడుచుకోవాలి. ఈ రెమెడీను వారానికి రెండు సార్లు పాటించాలి. వారం పాటు ఈ పద్దతిని గుర్తించదగిన మార్పును మీరు గమనించగలుగుతారు.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లి అనేది ఇంఫ్లేమేషన్, ఇన్ఫెక్షన్స్ వంటి అనేక చర్మ సమస్యలను తగ్గించేందుకు తోడ్పడుతుంది. వెల్లుల్లి ప్రతి ఇంట్లో సాధారణంగా లభ్యమవుతుంది. ఇది అద్భుతమైన హోమ్ రెమెడీగా పనిచేస్తుంది. అనేక చర్మ సమస్యల నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.

ఎలా వాడాలి:

వెల్లుల్లి రెబ్బ తొక్కను తొలగించాలి. ఇప్పుడు వెల్లుల్లిని క్రష్ చేసి మెత్తటి పేస్ట్ ను తయారుచేసుకోవాలి. మూడు లేదా నాలుగు స్పూన్ల ఆలివ్ ఆయిల్ ను వెల్లుల్లి పేస్ట్ లో జోడించాలి. ఈ రెండిటినీ బాగా కలపాలి. ఈ పేస్ట్ ను ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయాలి. ముప్పై నిమిషాల పాటు అలాగే ఉండనివ్వాలి. ముప్పై నిమిషాల తరువాత యాంటీ ఫంగల్ సోప్ తో రిన్స్ చేయాలి. టవల్ తో తేమను తొలగించాలి. ఈ రెమెడీను ప్రతి రోజూ పాటించాలి. పాదాలపై దురద తగ్గేవరకూ ఈ రెమెడీను పాటించాలి.

పెట్రోలియం జెల్లీ:

పెట్రోలియం జెల్లీ:

పెట్రోలియం జెల్లీ అనేది అనేక చర్మ సమస్యలకు చక్కటి రెమెడీగా ఉపయోగపడుతుంది. ఇది పాదాలపై దురద అనేది కొన్ని సార్లు పొడి చర్మం సమస్య వలన కూడా తలెత్తగలదు. తేమను అందించి పొడిబారిన చర్మానికి ఉపశమనాన్ని అందించేందుకు పెట్రోలియం జెల్లీ తోడ్పడుతుంది. తద్వారా, పాదాలపై దురద తగ్గుముఖం పడుతుంది.

ఎలా వాడాలి:

కాస్తంత పెట్రోలియం జెల్లీను అరచేతులలోకి తీసుకుని ప్రభావిత ప్రాంతంపై సున్నితంగా అప్లై చేయాలి. సర్క్యూలర్ మోషన్ లో అప్లై చేయాలి. ఆ తరువాత సాక్స్ తో కవర్ చేయాలి. నిద్రపోయే ముందు ఈ పద్దతిని పాటించాలి. మరుసటి రోజు షవర్ చేసుకునే సమయంలో దీన్ని రిన్స్ చేయాలి. ఈ ప్రాసెస్ ను ప్రతిరోజూ నిద్రపోయే పాటిస్తే ఆశించిన ఫలితాన్ని పొందగలుగుతారు.

English summary

Natural Home Remedies For Itchy Feet

Itchy feet is usually the result of some sort of fungal infection on the skin. Athlete's foot, as it is generally called, can be one of the main reasons of one having an itchy foot. It is a condition where there is a spread of tinea pedis, a type of fungus.
Desktop Bottom Promotion