For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పుదీనా ఆకులు కలుగజేసే ఎనిమిది సౌందర్య ప్రయోజనాలు

పుదీనా ఆకులు కలుగజేసే ఎనిమిది సౌందర్య ప్రయోజనాలు

|

వంటలకు మంచి సువాసన జతచేయడంలో పుదీనా ముఖ్య పాత్ర వహిస్తుందని మనకు తెలిసినదేకదా! కానీ పుదీనాను మన అందాన్ని కాపాడుకునేందుకు కూడా వాడుకోవచ్చని మీకు తెలుసా? మనలో చాలామందికి చర్మ మరియు కేశ సంరక్షణ విషయంలో పుదీనా ప్రయోజనకారి అని తెలియదు.

భారతీయ గృహాల్లో పుదీనా సాధారణంగా కనపడే మొక్కే. అనాదిగా మహిళలు సౌందర్య పోషణకు పుదీనాను విరివిగా వాడుతున్నారు. పుదీనా ఆకులలో అనాల్జేసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ,యాంటీమైక్రోబియాల్ మరియు యాంటీఆక్సిడెంట్ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి చర్మ మరియు కేశ సంబంధిత సమస్యలను సత్వరమే పరిష్కరించబడానికి ఉపయోగపడతాయి. దీనిని మాయిశ్చరైసర్స్, క్లెన్సర్స్, లిప్ బామ్, షాంపు మరియు కండిషనర్ల తయారీలో వాడతారు. ఇది చర్మం పై శీతలీకరణ ప్రభావం చూపించడమే కాక పలు ప్రయోజనాలను కలుగజేస్తుంది.

Beauty Benefits Of Mint Leaves

ఇప్పుడు మనం, పుదీనా వలన చర్మం మరియు కేశాలకు కలిగే కొన్ని సౌందర్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం!

బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది:

బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది:

పుదీనా ఆకులు బ్లాక్ హెడ్స్ ను శుభ్రంగా తొలగిస్తుంది. కొన్ని పుదీనా ఆకులను తీసుకుని నీళ్లలో వేసి మరిగించండి. దీనికి చిటికెడు పసుపు కలిపి ముద్ద చేసి,ముఖానికి రాసుకుని మృదువుగా వేళ్ళతో మర్దన చేసుకోండి. తరువాత నీళ్లతో కడిగేయండి. ఇలా వారానికి రెండుసార్లు చేయండి.

మొటిమలు మరియు మచ్చలను తొలగిస్తుంది:

మొటిమలు మరియు మచ్చలను తొలగిస్తుంది:

పుదీనా ఆకులలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలను కలిగించే కణాలను తొలగిస్తాయి. చర్మం పై నల్లని మచ్చలను మరియు ఇతర మరకలను తగ్గిస్తాయి.

కొన్ని పుదీనా ఆకులను నలిపి ముఖం మీద మొటిమల ప్రభావిత ప్రాంతానికి రాయండి. కొంతసేపు తరువాత నీటితో కడిగేయండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కొద్ది రోజుల్లో మొటిమలు మరియు మచ్చలు పూర్తిగా మాయమవుతాయి.

మేనిఛాయను మెరుగుపరుస్తుంది:

మేనిఛాయను మెరుగుపరుస్తుంది:

పుదీనా ఆకులలో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మరియు ఇతర గుణాలు వలన మృతకణాలను తొలగిపోతాయి. ఇవి బాక్టీరియాను చంపి చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యవంతంగా చేయడం వలన మేనిఛాయ మెరుగుపడుతుంది. కొన్ని పుదీనా ఆకులలో చిటికెడు పసుపు, కొన్ని చుక్కలు రోజ్ వాటర్ వేసి ముద్ద చేయండి. దీనిని ముఖానికి, మెడకు రాసుకుని పదిహేను నిమిషాల పాటు ఆరనిచ్చి, నీటితో కడిగేయండి.

ముడుతలను పోగొడుతుంది:

ముడుతలను పోగొడుతుంది:

పుదీనా ఆకులకు చర్మంపై ముడుతలు మరియు సన్నని గీతలను పోగొట్టే లక్షణాలు ఉన్నాయి. ఇవి ముఖంపై నుండి ఫ్రీరాడికల్స్ ను తొలగించి, చర్మాన్ని వయసు మీరడం నుండి సంరక్షిస్తుంది. కొన్ని పుదీనా ఆకులను తీసుకుని నీళ్లలో వేసి మరిగించండి. దీనిని బాగా చల్లార్చండి. ఈ నీటిలో పుదీనా ఆకుల సారం నిండి ఉంటుంది. ఈ మరగబెట్టిన నీటిని ముఖానికి రాసుకోండి.

దురదలను నివారిస్తుంది:

దురదలను నివారిస్తుంది:

పుదీనా ఆకులలో దురదను తగ్గించే గుణం ఉంటుంది. చర్మం కాలిన గాయాలకు,

ఎలర్జీలు ఇవి మంచి నివారణ. ఇవి ఎలర్జీ కలిగించే బాక్టీరియాను చంపుతాయి. పుదీనా ఆకులను ముద్ద చేసి ప్రభావిత ప్రాంతానికి రాసుకోవడం ఈ సమస్యకుఅత్యుత్తమ పరిష్కారం.

జుట్టు రాలడాన్ని అరికడుతుంది:

జుట్టు రాలడాన్ని అరికడుతుంది:

యాంటీఆక్సిడెంట్ గుణాలు మెండుగా ఉండటం వలన, పుదీనా ఆకులు జుట్టు ఎదుగుదలకు తోడ్పడతాయి. ఇది జుట్టురాలడాన్ని అరికట్టే గొప్ప సహజ చికిత్స. కొన్ని పుదీనా ఆకులను తీసుకుని నీళ్లలో వేసి మరిగించండి. దీనిని చల్లారనివ్వండి. ఈ నీటితో జుట్టును, మాడును బాగా మర్దన చేసుకోండి. పది నిమిషాల తరువాత మామూలు నీటితో కడిగేయండి. పుదీనా ఆకులు కనీసం ఇరవై నిమిషాల పాటు మరిగితే, దానిలోని తత్వాలు నీటిలోకి విడుదలవుతాయి.

మాడుపై ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది:

మాడుపై ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది:

పుదీనా ఆకులు మాడుపై ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. పుదీనా ఆకులను మరగబెట్టిన నీటితో మాడును బాగా మర్దన చేసుకోండి. 25 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోండి. పుదీనా ఆకులు కండిషనర్ వలే పనిచేస్తాయి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ఫలితం త్వరగా వస్తుంది.

English summary

Beauty Benefits Of Mint Leaves

Have you ever wondered how mint leaves can help in enhancing beauty? Mint leaves have analgesic, anti-inflammatory, antimicrobial and antioxidant properties that help in curing the skin and hair-related beauty issues. It helps in reducing wrinkles, prevents blackheads and dark spots from appearing on the skin. It also helps in reducing hair loss.
Desktop Bottom Promotion