For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెల్లుల్లి మరియు నిమ్మని వాడటం ద్వారా గోర్లను దృఢంగా మార్చుకోవచ్చా?

వెల్లుల్లి మరియు నిమ్మని వాడటం ద్వారా గోర్లను దృఢంగా మార్చుకోవచ్చా?

|

మనందరికీ సాధారణంగా వంటింట్లో లభ్యమయ్యే వెల్లుల్లి మరియు నిమ్మ ద్వారా కలిగే ఆరోగ్యప్రయోజనాలపై అవగాహన ఉంది. అయితే, ఈ రెండిటినీ కలపడం ద్వారా గోర్లు దృఢంగా మారతాయన్న విషయం మీకు తెలుసా? అవును, మీరు చదివింది నిజమే!

వెల్లుల్లి మరియు నిమ్మలో గోర్ల సంరక్షణకు తోడ్పడే మినరల్స్ సమృద్ధిగా లభ్యమవుతాయి. ఇవి బలహీనమైన గోర్లు చిట్లకుండా రక్షిస్తాయి. గోర్లను దృఢంగా మార్చుతాయి. అలాగే, ఈ పదార్థాల వలన ఎల్లో నెయిల్స్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. గోర్లు మరింత శుభ్రంగా అలాగే మరింత దృఢంగా మారతాయి.

Can Garlic And Lemon Help In Strengthening The Nails?

శరీరంలోని ఇతర భాగాలలాగానే గోర్లు కూడా కొన్ని పదార్థాలతో కాంటాక్ట్ కి గురవడం వలన దెబ్బతింటాయి అలాగే బలహీనపడతాయి. ఇక్కడ, ఇంటి వద్దే తయారుచేసుకునే గార్లిక్ లెమన్ రెమెడీని తెలుసుకుందాం. ఈ రెమెడీ గోర్ల బ్రేకేజ్ ను అరికట్టి వాటిని దృఢంగా మార్చుతుంది.
కావలసిన పదార్థాలు:

కావలసిన పదార్థాలు:

2-3 వెల్లుల్లి రెబ్బలు

2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం

1 విటమిన్ ఈ క్యాప్సూల్

1 బాటిల్ క్లియర్ నెయిల్ పాలిష్

తయారుచేసే విధానం:

తయారుచేసే విధానం:

1. మొదటగా, రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వాటిని మెత్తటి పేస్ట్ లా తయారుచేసుకోండి.

2. ఇప్పుడు, నిమ్మను తీసుకుని అందులోంచి కొన్ని చుక్కల నిమ్మరసాన్ని క్రష్ చేసిన వెల్లుల్లికి జోడించండి.

3. ఇప్పుడు, విటమిన్ ఈ క్యాప్సూల్ ను తీసుకుని అందులోంచి నూనెను వెలికితీయండి. ఈ నూనెను వెల్లుల్లి నిమ్మరసం మిశ్రమానికి జోడించండి.

4. ఈ పదార్థాలని బాగా కలపండి.

5. ఈ మిశ్రమాన్ని 15-20 నిమిషాల వరకు అలాగే వదిలేయండి.

6. ఇరవై నిమిషాల తరువాత, ఈ క్లియర్ నెయిల్ పాలిష్ ను వెల్లుల్లి నిమ్మ మిశ్రమానికి జోడించి బాగా కలపండి.

7. ఈ మిశ్రమాన్ని కంటైనర్ లో భద్రపరచి అవసరం బట్టి వాడండి.

ఎలా అప్లై చేయాలి?

ఎలా అప్లై చేయాలి?

1. ఏదైనా నెయిల్ పాలిష్ ను అప్లై చేసి ఉంటే, మొదటగా ఆ నెయిల్ పాలిష్ ను తొలగించండి.

2. న్యూట్రల్ సోప్ తో నెయిల్స్ ను బాగా శుభ్రపరుచుకోండి.

3. ఇప్పుడు వెల్లుల్లి నిమ్మ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో ఒక లేయర్ లా అప్లై చేసుకోండి.

4. ఈ మిశ్రమాన్ని నెయిల్స్ పూర్తిగా కవర్ అయ్యేలా జాగ్రత్తపడండి.

5. ఈ మిశ్రమాన్ని నెయిల్స్ పై మూడు రోజుల పాటు ఉండనివ్వండి. ఈ లోపు ఈ మిశ్రమాన్ని తొలగించకండి.

6. మూడు రోజుల తరువాత ఈ హార్డెనర్ ను తొలగించి నెయిల్స్ కు ఒక రోజు పాటు విశ్రాంతినివ్వండి.

7. ఈ మిశ్రమాన్ని నెయిల్స్ పై తిరిగి అప్లై చేసుకోండి. నెయిల్స్ దృఢంగా అయ్యే వరకు ఈ ప్రాసెస్ ని పాటించండి.

వెల్లుల్లి వలన కలిగే ప్రయోజనాలు

వెల్లుల్లి వలన కలిగే ప్రయోజనాలు

గోర్లు దృఢంగా అలాగే పొడుగ్గా మారాలంటే సెలీనియం అనే మినరల్ అవసరపడుతుంది. వెల్లుల్లిలో ఈ మినరల్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది గోర్లను దృఢపరిచేందుకు తోడ్పడుతుంది.

అలాగే వెల్లుల్లిలో సల్ఫర్ పదార్థాలు లభ్యమవుతాయి. ఇవి గోర్లను దృఢంగా అలాగే మెరిసే విధంగా మార్చుతాయి. సల్ఫర్ అనేది గోర్లను సంరక్షించేందుకు తోడ్పడుతుంది. తద్వారా, ఇన్ఫెక్షన్స్ తో పాటు ఫంగై దరిచేరదు.

నిమ్మద్వారా అందే ప్రయోజనాలు

నిమ్మద్వారా అందే ప్రయోజనాలు

నిమ్మ అనే సిట్రిక్ ఫ్రూట్ లో విటమిన్ సీ సమృద్ధిగా లభిస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. విటమిన్ సి అనేది బలహీనమైన గోర్లను దృఢపరిచేందుకు తోడ్పడుతుంది. అలాగే, నిమ్మ అనేది సహజమైన బ్లీచింగ్ ఏజెంట్ గా వ్యవహరిస్తోంది. తద్వారా, ఎల్లో నెయిల్స్ సమస్య నుంచి రక్షణనిస్తుంది. నెయిల్స్ సునాయాసంగా తిరిగి సాధారణ రంగులోకి మారిపోతాయి.

గోర్లు దృఢంగా మారేందుకు కొలాజెన్ కంటెంట్ అనేది తగినంత అవసరం. నిమ్మ అనేది కొలాజెన్ స్థాయి తగినంత ఉండేందుకు తోడ్పడుతుంది.

విటమిన్ ఈ ద్వారా అందే ప్రయోజనాలు

విటమిన్ ఈ ద్వారా అందే ప్రయోజనాలు

విటమిన్ ఈ అనేది సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. నెయిల్స్ ను హైడ్రేట్ చేస్తుంది. ఇది డ్రై మరియు వీక్ నెయిల్స్ సమస్య నుంచి రక్షణని అందిస్తుంది. అంతేకాక, విటమిన్ ఈ లో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ గోర్లను ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడతాయి.

రెడీ మేడ్ విటమిన్ ఈ ఆఈల్ ను లేదా ఆయిల్ క్యాప్సల్ నుంచి సేకరించబడిన ఆయిల్ ను వాడి గోర్లను దృఢంగా మార్చుకోవచ్చు.

కొన్ని చిట్కాలు

కొన్ని చిట్కాలు

చాలా మందికి గోర్లను కొరికే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు ద్వారా ఎదురయ్యే పరిణామాల గురించి వారికి అవగాహన ఉండకపోవచ్చు. వారిలో మీరు ఒకరైతే, అప్పుడు ఈ అలవాటును వెంటనే మానుకోండి.

English summary

Can Garlic And Lemon Help In Strengthening The Nails?

Garlic and lemon contain minerals and calcium that help in strengthening weak nails from breaking and making it stronger. Also, both these ingredients help in getting rid of yellow nails, thus making it clean and white. More than any part of our body, our hands are exposed constantly to certain elements that can damage our nails and make it weaker.
Desktop Bottom Promotion