For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెల్లుల్లి,నిమ్మ గోళ్ళను బలపర్చటంలో సాయపడగలవా?

వెల్లుల్లి,నిమ్మ గోళ్ళను బలపర్చటంలో సాయపడగలవా?

|

మన వంటిళ్ళలో దొరికే సామాన్య పదార్థాలైన వెల్లుల్లి, నిమ్మల ఆరోగ్యలాభాలు మనందరికీ తెలిసినవే. కానీ మీకు ఈ రెండు అద్భుత పదార్థాలు కలిస్తే మీ గోళ్ళపై ప్రభావం ఏంటో తెలుసా? అవును, మీరు చదివింది నిజమే!

వెల్లుల్లి, నిమ్మలలో మినరల్స్, కాల్షియం ఉంటాయి,ఇవి బలహీనపడ్డ గోళ్ళను విరిగిపోకుండా బలపరుస్తాయి. ఇంకా పసుపుబారిన గోళ్ళను శుభ్రపర్చి తెల్లబరుస్తాయి.

శరీరంలో మిగతాభాగాలన్నిటికన్నా, మన చేతులు ఎక్కువగా అన్నిటినీ తాకుతూ ఉండటం వలన, మన గోళ్ళు పాడయి బలహీనపడవచ్చు. ఇక్కడ మేము సింపుల్, ఇంట్లో తయారుచేసుకునే వెల్లుల్లి,నిమ్మ మిశ్రమ చిట్కాను ఎలా తయారుచేసుకోవాలో చెప్పబోతున్నాం, దీనివల్ల మీ గోళ్ళు విరగకుండా బలంగా ఉంటాయి.

Can Garlic And Lemon Help In Strengthening The Nails?

కావాల్సిన వస్తువులు

2-3రెబ్బల వెల్లుల్లి

2చెంచాల నిమ్మరసం

1 చెంచా విటమిన్ ఇ క్యాప్స్యూల్

1 సీసా క్లియర్ నెయిల్ పాలిష్

ఎలా తయారుచేయాలి?

1.మొదటగా 2-3 వెల్లుల్లి రెబ్బలను తీసుకుని పేస్టులా చేయండి.

2.ఇప్పుడు నిమ్మకాయని కోసి, కొన్ని చుక్కల నిమ్మరసాన్ని ఈ వెల్లుల్లి పేస్టులో వేయండి.

3.విటమిన్ ఇ క్యాప్స్యూల్ ను కట్ చేసి నూనెను బయటకి తీయండి. దీన్ని వెల్లుల్లి నిమ్మ పేస్టులో వేయండి.

4.అన్ని పదార్థాలు బాగా కలపండి.

5.ఈ మిశ్రమాన్ని కదపకుండా 15-20 నిమిషాలు వదిలేయండి.

6.20 నిమిషాల తర్వాత క్లియర్ నెయిల్ పాలిష్ ను అందులో వేసి బాగా కలపండి.

7.దీన్ని మీరు మీ వాడుకని బట్టి సీసాలో భద్రపర్చుకోవచ్చు.

ఎలా వాడుకోవాలి?

1.మొదటగా, మీరేదైనా నెయిల్ పాలిష్ వేసుకుని ఉన్నట్లైతే, తప్పక దాన్ని తీసేయండి.

2. న్యూట్రల్ సబ్బు సాయంతో గోళ్ళను శుభ్రపర్చండి.

3.ఈ వెల్లుల్లి నిమ్మ మిశ్రమాన్ని మీ గోళ్ళపై బ్రష్ సాయంతో పొరలా పట్టించండి.

4.ఈ మిశ్రమంతో గోరంతా సమంగా కప్పబడి వుండేట్లా చూడండి.

5.ఈ మిశ్రమాన్ని గోళ్ళపై 3 రోజులు అలానే ఉంచండి, కడగవద్దు.

6.3 రోజుల తర్వాత ఈ గట్టి మిశ్రమాన్ని తొలగించి మీ గోళ్ళని ఒకటి లేదా రెండు రోజులు విశ్రాంతిగా ఉండనివ్వండి.

7.మళ్ళీ ఈ మిశ్రమాన్ని గోళ్ళకి పట్టించండి, ఇలా రెగ్యులర్ గా మీ బలహీన గోళ్ళు బలపడేదాకా చేస్తూ ఉండండి.

వెల్లుల్లి లాభాలు

సెలీనియం అనే ఖనిజ లవణం కారణంగా గోళ్ళు బలంగా,పొడుగ్గా పెరుగుతాయి. వెల్లుల్లిలో ఈ మినరల్ ఎక్కువగా ఉండి, మీ గోళ్ళను బలంగా ఉంచటంలో సాయపడుతుంది.

నిమ్మ లాభాలు

మనందరికీ నిమ్మకాయ సిట్రస్ జాతికి చెందిన పండని, విటమిన్ సి పుష్కలంగా కలిగివుంటుందనీ తెలుసు. విటమిన్ సి బలహీనపడ్డ గోళ్ళను బలపరుస్తుంది. ఇంకా, సహజ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేసి పసుపుబారిన గోళ్ళను నయం చేసి, సహజంగా తెల్లబడేలా చేస్తుంది.

గోళ్ళలో తగినంత కొల్లాజెన్ పదార్థం ఉంటేనే అవి బలంగా ఉంటాయి. నిమ్మ తగినంత కొల్లాజెన్ ఉండేలా చేయటంలో సాయపడ్తుంది.

విటమిన్ ఇ లాభాలు

విటమిన్ ఇ సహజ తేమకారి,ఇది మీ గోళ్ళను హైడ్రేటడ్ గా ఉంచుతుంది. ఇది పొడిబారిన, బలహీనమైన గోళ్లను బాగుచేస్తుంది. ఇవేకాక, విటమిన్ ఇ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు గోళ్ళకు రక్షణ కూడా ఇస్తుంది.

కొన్ని చిట్కాలు

1.మనలో చాలామందికి గోళ్ళు తినే అలవాటు ఉంటుంది. కానీ మీకు దాని పర్యవసానాలు తెలిసుండవు. మీరు కూడా గోళ్ళు అలా అలా తినేసేవారైతే వెంటనే ఈ చెడ్డ అలవాటును మానేయండి.

2.కొన్నిసార్లు నెయిల్ పాలిష్ ను ఎక్కువగా వాడటం వలన, రంగులు అదేపనిగా మారుస్తుండటం వలన గోళ్ళు పసుపుబారి,బలహీనపడతాయి. అప్పుడప్పుడూ వాటికి కూడా రంగులేవీ లేకుండా విరామం ఇవ్వండి.

3.కొన్నిసార్లు గోళ్ళను మురికిగా వదిలేయటం వలన కూడా పసుపుబారి, బలహీనపడతాయి. గోళ్లను ఎప్పుడూ శుభ్రంగా, చక్కగా ఉంచుకోండి.

English summary

Can Garlic And Lemon Help In Strengthening The Nails?

Can Garlic And Lemon Help In Strengthening The Nails,Do your nails constantly break off? Here is a simple home-made garlic-lemon hardener that can help in strengthening the nails
Desktop Bottom Promotion