For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొడి చర్మానికి కొబ్బరినూనె,దోసకాయ ఫేస్ ప్యాక్

పొడి చర్మానికి కొబ్బరినూనె,దోసకాయ ఫేస్ ప్యాక్

|

పొడిచర్మం ఉండటం వల్ల మీకు అసౌకర్యంగా, దురదగా ఉంటుంది. చర్మం పొడిబారటానికి కారణాలు ఏవైనా,వాతావరణం వలన కానీ,వయస్సు మీరటం లేదా చర్మంకి సంబంధించి ఏవైనా సమస్యల వలన కానీ వచ్చే పొడిచర్మాన్ని అదనపు సంరక్షణతో,శ్రద్ధతో బాగుచేసుకోవాలి.

వైద్యపరంగా పొడిచర్మాన్ని 'జెరోసిస్ క్యూటిస్’ అంటారు, ఈ స్థితిలో చర్మం పైపొరలో తేమ ఉండదు. శ్రద్ధ తీసుకోకపోతే పొడిచర్మం ఇంకా పగుళ్ళుబారి ఇన్ఫెక్షన్ చేరవచ్చు. అందుకని చర్మాన్ని తేమగా,హైడ్రేటడ్ గా ఉంచుకుంటూ సరైన పోషణ ఇవ్వాలి.

మార్కెట్లో కొనే క్రీములు,మాయిశ్చరైజర్లు ఖరీదు ఉండవచ్చు, కొన్ని ప్రభావవంతంగా కూడా ఉండకపోవచ్చు. పొడి చర్మాన్ని బాగుచేసుకోటానికి చాలా సహజ చిట్కాలున్నాయి. ఆ లిస్టులో మొదటిది కొబ్బరినూనె, ఇది పొడిచర్మాన్ని చాలా ప్రభావవంతంగా నయం చేస్తుంది.

Coconut Oil And Cucumber Face Pack For Dry Skin

కొబ్బరినూనె చర్మాన్ని హైడ్రేటడ్ గా ఉంచి, చర్మంపై లిపిడ్స్ ను ఎక్కువ చేస్తుంది. నూనెలో ఉండే సాచ్యురేటడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఎమోలియంట్ లక్షణాలు పొడి చర్మానికి గొప్ప మాయిశ్చరైజర్ గా పనిచేస్తాయి.

కొబ్బరినూనెలాంటి సురక్షితమైన మరో చిట్కా దోసకాయ. వివిధ కాస్మెటిక్ ఫార్ములేషన్లలో కూడా దోసకాయను వాడతారు. ఇది లోతుగా హైడ్రేట్ చేసి, పొడి చర్మానికి మేటి చికిత్సగా పనిచేస్తుంది.

అయితే మరి కొబ్బరినూనె,దోసకాయ కాంబినేషన్లో ఫేస్ ప్యాక్ కన్నా పొడిచర్మానికి మంచి చిట్కా ఇంకేముంటుంది? ఇదిగో దీన్ని ఇలా చేయవచ్చు.

కావాల్సిన వస్తువులు;

కావాల్సిన వస్తువులు;

½ దోసకాయ

1చెంచా పచ్చి వర్జిన్ కొబ్బరి నూనె

ఎలా వాడాలి;

ఎలా వాడాలి;

దోసకాయను తురమండి. కొబ్బరినూనెను దీనికి కలపండి.

దీన్ని మీ ముఖం,మెడకి పట్టించండి.

15నిమిషాలు అలా వదిలేసి,నీళ్లతో కడుక్కోండి.

ఎన్నిసార్లు ;

ఎన్నిసార్లు ;

ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి రెండుసార్లు వాడండి.

ఈ ఫేస్ ప్యాక్ లాభాలు

ఈ ఫేస్ ప్యాక్ లాభాలు

కొబ్బరినూనె గొప్ప మాయిశ్చరైజర్ గా తిరుగులేనిది అయినా, దోసకాయ మెరుగైన, ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది. దోసకాయ గొప్ప యాంటీఆక్సిడెంట్గా, వాపు వ్యతిరేక లక్షణాలతో, హైడ్రేట్ చేస్తూ, చర్మాన్ని శుభ్రపరుస్తుంది, ఉబ్బిన చర్మాన్ని మామూలు చేసి, రంగును తేటపరుస్తుంది.

ఈ రెండు కలిసిన కాంబినేషన్ పొడి,డల్ చర్మానికి అద్భుతమైన చికిత్సగా పనిచేస్తుంది. పొడి చర్మాన్ని హైడ్రేట్ చేయటమే కాక, మొటిమల మచ్చలు, ఎండవల్ల కమిలిపోయిన చర్మాన్ని తొలగిస్తాయి కూడా.

ఇది సింపుల్ ఫేస్ ప్యాక్ కదూ? తయారుచేసుకోవటానికి సింపుల్ గా ఉన్నా, ఇందులో వాడే పదార్థాల లాభాలు చాలానే ఉంటాయి. ఇదిగో ఇలా ఇవి మీ చర్మానికి పోషణనందిస్తాయి.

కొబ్బరినూనె పొడిచర్మానికి ఎలా లాభం చేస్తుంది

కొబ్బరినూనె పొడిచర్మానికి ఎలా లాభం చేస్తుంది

-కొబ్బరినూనె సహజమైన యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, ఇంకా గొప్ప మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఇది మిగతా నూనెలకన్నా చర్మంలో లోతుగా ఇంకి, మీ చర్మాన్ని పొట్టుగా ఊడిపోవటంకి దూరం చేసి ,పాపాయిలంత మృదువైన చర్మంగా మారుస్తుంది.

-వర్జిన్ ఆర్గానిక్ కొబ్బరి నూనెను మీ చర్మానికి వాడినప్పుడు హైడ్రేషన్ వేగాన్ని పెంచి, పొడిచర్మంపై నీటి నష్టాన్ని తగ్గిస్తుంది.

-కొబ్బరినూనె, పొడిచర్మం సోరియాసిస్ వలన వచ్చే దురద, ముక్కలుగా ఊడిపోయే చర్మానికి ఉపశమనం అందిస్తుంది.ఎక్కువకాలం చర్మాన్ని తేమగా కూడా ఉంచుతుంది.

-కొబ్బరినూనెలోని ఫ్యాటీయాసిడ్లు వాపుకి వ్యతిరేకంగా ,యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. అందుకని మొటిమలను తగ్గించి, వాటివలన వచ్చే వాపులకు ఉపశమనం అందిస్తాయి.

దోసకాయ పొడిచర్మానికి ఎలా లాభం చేస్తుంది?

దోసకాయ పొడిచర్మానికి ఎలా లాభం చేస్తుంది?

-మనందరికీ తెలిసినట్టు దోసకాయలో 90% నీళ్ళు ఉంటాయి, అందుకని దోసకాయను నేరుగా తినటమో లేదా చర్మంపైన రాసుకోవటం వలనో ముఖ్యంగా పొడిచర్మం హైడ్రేట్ అవుతుంది. ఇది మంచి క్లెన్సర్ గా, మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.

-దోసకాయలోని విటమిన్ సి, కెఫీస్ యాసిడ్ చర్మంపై మంటను,వాపును తగ్గిస్తుంది, ఈ యాసిడ్లు నీటి రిటెన్షన్ ను తగ్గిస్తాయి. అందుకే దోసకాయలు వాచిన కళ్ళను, కమిలిన చర్మాన్ని బాగుచేస్తాయి.

-దోసకాయ రసం ఎలాంటి మచ్చలు, చారలు, కంటి చుట్టూ నల్లవలయాలు, చర్మంపై నల్లమచ్చలు తొలగించి, చర్మం రంగును తేటపరుస్తుంది.

-దోసకాయ దాని చల్లదనానికి ప్రసిద్ధి. అది ఎండ వల్ల ట్యాన్ ను, చర్మంపై వయస్సు మీరే లక్షణాలు, ముడతలను నివారిస్తుంది. చర్మరంథ్రాలను గట్టిపరిచి, దాన్ని మృదువుగా,మెత్తగా ఉంచుతుంది.

కొబ్బరినూనె-దోసకాయ ఫేస్ ప్యాక్ ను

కొబ్బరినూనె-దోసకాయ ఫేస్ ప్యాక్ ను

కొబ్బరినూనె-దోసకాయ ఫేస్ ప్యాక్ ను వారానికి రెండుసార్లు ప్రయత్నించడంతో పాటు, మీరు ప్రతిరాత్రి ప్యూర్ ఆర్గానిక్ కొబ్బరినూనెతో మొహాన్ని శుభ్రపర్చుకోవటం వలన పొడి చర్మం మామూలవుతుంది. మొహం కడుక్కున్నాక కొంచెం నూనెను తడిగా ఉన్నప్పుడే ముఖానికి పట్టించండి. రాత్రంతా అలా వదిలేయండి. ఎక్కువకాలం ఇలా చేయటం వలన తప్పక తేడా కన్పిస్తుంది.

పొడి చర్మచికిత్సకి మరో ఆప్షన్ గా మీరు దోసకాయ తురుమును, అంతే పరిమాణంలో సోర్ క్రీం ఇంకా గుడ్డు తెల్లసొనతో కలిపి ఫేస్ ప్యాక్ లా వాడవచ్చు. 20 నిమిషాలు అలా వదిలేసి నీళ్లతో కడిగేయండి. ఈ మాస్క్ చర్మం పొడిదనాన్ని చాలావరకు తగ్గిస్తుంది.

కొబ్బరినూనె,దోసకాయ ఫేస్ ప్యాక్ మీ పొడిచర్మం తొలగించి, చర్మానికి కొత్త జీవం పోసి,అందంగా మెరిసేలా చేస్తుంది.

English summary

Coconut Oil And Cucumber Face Pack For Dry Skin

Dry skin in medical terms is called 'xerosis cutis' and this skin lacks moisture in its outer layer. If left uncared, dry skin can even crack up and get infected. Therefore, it is important to keep the skin moisturized, hydrated and nourished.
Story first published:Tuesday, June 19, 2018, 9:06 [IST]
Desktop Bottom Promotion