For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యాక్నే ఫ్రీ స్కిన్ కోసం నిపుణులు అందించిన డైట్ టిప్స్

|

చాలా మంది యాక్నే అనేది లివర్ లేదా స్టమక్ కి సంబంధించినదై ఉంటుందని భావిస్తారు. అయితే, నిజమేమిటంటే ఇది సాధారణమైన స్కిన్ కండిషన్. ఈ సమస్య 20, 30 మరియు 40 ఏళ్ళ వయసు వరకు కూడా కొనసాగుతుంది. యాక్నేకి లివర్ ప్రాబ్లమ్స్ కి అలాగే స్టమక్ ప్రాబ్లెమ్స్ కి సంబంధమే లేదు. హార్మోన్స్, జెనెటిక్స్ తో పాటు స్కిన్ కేర్ రొటీన్ అనే కొన్ని ఫ్యాక్టర్స్ యాక్నే సమస్యకు దారితీస్తాయి. యాక్నే ఫ్రీ స్కిన్ ను పొందేందుకు ఏ డైట్ ను తీసుకోవాలో ఈ ఆర్టికల్ లో వివరించబడింది.

"రాంగ్ ఫుడ్స్ ని తీసుకోవడం ద్వారా ఏర్పడే హార్మోన్ల సమస్యల వలన యాక్నే సమస్య ఎదురవుతుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. జీఐ ఎక్కువగా లభించే ఆహారాలు యాక్నే సమస్యను మరింత తీవ్రంగా మార్చే ప్రమాదం కలదని డైలీ మెయిల్ లో మెలనీ మెక్ గ్రైస్ అనే డైటీషియన్ వివరించినట్టు స్పష్టమవుతుంది.

యాక్నే ఫ్రీ స్కిన్ కోసం నిపుణులు అందించిన డైట్ టిప్స్

యాక్నే ఫ్రీ స్కిన్ కై డైట్

యాక్నే విషయంలో కార్బోహైడ్రేట్స్ అనేవి శత్రువులుగా వ్యవహరిస్తాయి. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అనేవి ఇన్సులిన్ ఫ్యాక్టర్ 1 నే హార్మోన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. అలాగే, బ్లడ్ స్ట్రీమ్ లోని టెస్టోస్టెరోన్ స్థాయిలకు కూడా సమస్యను కలిగిస్తాయి. ఈ రెండిటి కాంబినేషన్ ఆయిల్ గ్లాండ్స్ ని స్టిములేట్ చేసి చర్మంలో బ్లాకేజ్ ను ఏర్పరుస్తాయి. అందువలన, యాక్నే సమస్య ఎదురవుతుందని డాక్టర్.గ్రోస్ వివరించినట్టు డైలీ మెయిల్ స్పష్టం చేస్తోంది.

డైటీషియన్ల ప్రకారం, బ్రేడ్, పాస్తా, సెరల్స్, బిస్కట్స్ మరియు కేక్ వంటి గ్రెయిన్స్ కు సంబంధించి ఆహారాలు అలాగే ఎనిమల్ బేస్డ్ మిల్క్ ప్రోడక్ట్స్ ను యాక్నే ప్రోన్ స్కిన్ కలిగిన వారు అవాయిడ్ చేయాలి.

యాక్నే ఫ్రీ స్కిన్ కోసం పాటించవలసిన డైట్ నియమాలు

లో గ్లైకామిక్ డైట్:

హై జీఐ కలిగిన ఫుడ్స్ ను తీసుకుంటే యాక్నే సమస్య మరింత తీవ్రంగా మారుతుందని డైటీషియన్ మెలనీ మెక్ గ్రైస్ చెప్తున్నారు. అలాగే, వివిధ అధ్యయనాల ప్రకారం 'లో గ్లైకామిక్ డైట్' లేదా షుగర్ కంటెంట్ తక్కువగా ఉండే ఆహారాలని తీసుకుంటే యాక్నే సమస్య తగ్గుముఖం పడుతుంది.

జింక్:

జింక్ పుష్కలంగా లభించే ఫుడ్స్ ను తీసుకుంటే యాక్నే సమస్యను తగ్గించుకోవచ్చు. అలాగే, యాక్నే మళ్ళీ మళ్ళీ రాకుండా అరికట్టవచ్చు. పంప్ కిన్ సీడ్స్, జీడిపప్పు, బీఫ్, క్వినోవా, లెంటిల్స్, టర్కీ వంటి ఫుడ్స్ లో ఆలాగే వోయిస్టర్ మరియు క్రాబ్ వంటి సీ ఫుడ్స్ లో జింక్ పుష్కలంగా లభిస్తుంది. జింక్ అనే డైటరీ మినరల్ అనేది చర్మ సంరక్షణకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే, మెటబాలిజంతో పాటు హార్మోన్ల స్థాయిలను రేగులేట్ చేయడానికి ఈ మినరల్ తోడ్పడుతుంది.

విటమిన్ ఏ మరియు విటమిన్ ఈ:

జర్నల్ ఆఫ్ క్యుటానియాస్ ఎండ్ ఆక్యులర్ టాక్సికాలజీలో పబ్లిష్ అయిన అధ్యయనం ప్రకారం విటమిన్ ఏ మరియు విటమిన్ ఈ తక్కువ స్థాయిలో శరీరానికి అందితే యాక్నే విపరీతంగా విజృంభిస్తుందని తెలుస్తోంది. కాబట్టి, విటమిన్ ఏ మరియు విటమిన్ ఈను ఆహారం ద్వారా తీసుకుంటే యాక్నే సమస్య తీవ్రత తగ్గే అవకాశం ఉంది.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్:

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనే హెల్తీ ఫ్యాట్ కొన్ని ప్లాంట్స్ లో అలాగే ఫిష్ మరియు ఎగ్స్ వంటి కొన్ని ఎనిమల్ ప్రోటీన్ సోర్స్ లలో లభ్యమవుతుంది. ఫ్యాటీ ఫిష్, ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్, చియా సీడ్స్, వైల్డ్ రైస్, ఎగ్స్ వంటి వాటిలో లభ్యమయ్యే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ను ఎక్కువగా తీసుకుంటే ఇంఫ్లేమేషన్ సమస్యతో పాటు యాక్నే బ్రేకవుట్స్ సమస్య అరికట్టబడుతుంది. ముఖంపై అలాగే శరీరంపై యాక్నే సమస్యతో ఇబ్బంది పడే వారు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ను ఆహారం ద్వారా తీసుకోవచ్చు. లేదా సప్లిమెంట్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. వైద్యుల సలహా మేరకు డొసేజ్ ఉండాలి.

ప్రోబయోటిక్స్:

గట్ లోని ఇంఫ్లేమ్షన్ ను తగ్గించేందుకు ప్రో బయోటిక్స్ ఉపయోగపడతాయి. తద్వారా, యాక్నే సమస్య తగ్గుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, ఇంటస్టినల్ మైక్రో ఫ్లోరా అనేది ఇంఫ్లేమేషన్ ను కలిగించి యాక్నే బ్రేకవుట్స్ కు దారితీస్తుంది. ప్రీ బయోటిక్స్ మరియు ప్రో బయోటిక్స్ అనే రెండు ఇంఫ్లేమేషన్ ను తగ్గించి అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తుంది. తద్వారా, యాక్నే బ్రేకవుట్స్ సమస్య తగ్గుముఖం పడుతుంది. ఈ విషయాన్ని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

జ్యూస్ లు చర్మానికి తగిన పోషణను అందిస్తాయి. వీటిలో ఫైటో న్యూట్రియెంట్స్ పుష్కలంగా లభించే యాంటీ ఇంఫ్లేమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, అస్ట్రింజెంట్ లు లభిస్తాయి. ఇవి స్కిన్ కొలాజెన్ ను అలాగే కనక్టివ్ టిష్యూలను బిల్డ్ చేసి రిపెయిర్ చేసేందుకు తోడ్పడతాయి. ఇవి, యాక్నే మరియు యాక్నే స్కార్స్ సమస్యను తగ్గిస్తాయి.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి యాక్నే సమస్యను తొలగిస్తాయి. అలాగే వీటిలో కెటెచిన్స్ అనే యాంటీ మైక్రోబయాల్ లు లభ్యమవుతాయి. ఇవి యాక్నేని దారితీసే బాక్టీరియాను నశింపచేస్తాయి. గ్రీన్ టీ లో యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీలు కలవు. ఇవి యాక్నే ద్వారా ఎదురయ్యే ఇంఫ్లేమేషన్ వలన కలిగే రెడ్ నెస్ ను తగ్గించడానికి తోడ్పడతాయి. హార్మోన్ల అసమతుల్యం సమస్యను గ్రీన్ టీ తగ్గిస్తుంది. తద్వారా, యాక్నే సమస్య పరిష్కారమవుతుంది.

English summary

Follow This Diet For Acne-free Skin, Experts Say

Most people consider acne to be a liver problem or a stomach-related issue. But the truth is that this common skin condition can continue in your 20's, 30's and even 40's. And acne has nothing to do with liver problems or stomach problems, acne can be triggered by many factors from hormones to genetics to your skin care regimen. This article will inform you about the diet for acne-free skin.
Desktop Bottom Promotion