For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు తెలియని పాదాల సంరక్షణ చిట్కాలు

పాదాల సహజ అందాన్ని మరింత పెంచే, నొప్పి తగ్గించే, బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించే సులభమైన చిట్కాలు చాలానే ఉన్నాయి. అలాగే ఇవి సరైన తేమను కూడా అందిస్తాయి.

|

అందమైన, మృదువైన పాదాలు కావాలని ఎవరికుండదు? కానీ మనలో చాలామందికి పొడిబారిన, పొరలు ఊడిపోయే పాదాలు ఉంటాయి, కదా?

మీ పాదాలను ఎప్పుడూ టిప్ టాప్ గా ఉంచుకోవటం కొంచెం కష్టమే, ఎందుకంటే అవి ఎప్పుడూ నేలకి, దేనికోదానికి తగులుతూ గీరుకుపోతూ ఒత్తిడి పడుతూఉంటాయి.

మనలో చాలామంది మన చేతులు, మొహం ఇవి మాత్రం శుభ్రంగా, కాంతివంతంగా ఉంటే చాలనుకుని వాటినే జాగ్రత్తగా చూస్తూ పాదాలను నిర్లక్ష్యం చేస్తారు. అవి కూడా ముఖ్యమే.

Foot Care Tips That You Didnt Know

మార్కెట్లో చాలా రెడీమేడ్ క్రీములు ఈ సమస్యని తీర్చినా, సమయం, ఖర్చు రెండూ పడతాయి. ఇంకా పార్లర్లకి క్రమం తప్పకుండా పెడిక్యూర్ కోసం వెళ్లటం మంచిదే కానీ, అదొక్కటే, ఆరోగ్యకరమైన, అందమైన పాదాలకి మార్గం కాదు. మీరు సరిగ్గా ఒక పాదాల కేర్ రొటీన్ పాటించాలి.

పాదాల సహజ అందాన్ని మరింత పెంచే, నొప్పి తగ్గించే, బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించే సులభమైన చిట్కాలు చాలానే ఉన్నాయి. అలాగే ఇవి సరైన తేమను కూడా అందిస్తాయి.

అవును! మీ పాదాలు అందంగా, మృదువుగా ఉండాలంటే ఏమేం చేయాలో, చెయ్యకూడదో ఇక్కడ అన్నీ వివరించాం. చదవండి.

తేమగా ఉంచండి

తేమగా ఉంచండి

మీ పాదాలు తేమగా ఉంచుకోవటం చాలా ముఖ్యం. రోజంతా పాదాలను వాడుతూనే ఉంటారు కాబట్టి, ఆ ఒత్తిడి అంతా వాటిపై పడుతుంది, ముఖ్యంగా మీ పనులకి ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటే మరీనూ! అందుకని మీ పాదాలను రోజంతా తేమగా ఉంచుకోవటం అవసరం.

సరిపోయే షూలే వేసుకోండి

సరిపోయే షూలే వేసుకోండి

మనం సౌకర్యంగా ఉండే, సరిగ్గా పట్టే షూలనే దాదాపుగా వేసుకుంటూ ఉండాలి. చిన్నవైన షూలు పాదాలకు పదేపదే రుద్దుకుంటూ బొబ్బలు వచ్చేలా చేస్తాయి. అందుకని కొత్త షూలు కొనేటప్పుడు జాగ్రత్త. మీకు సరిపోయే షూలే కొనుక్కోండి.

పాదాలను సూర్యుడి నుంచి కాపాడండి

పాదాలను సూర్యుడి నుంచి కాపాడండి

చర్మ సంరక్షణలో సన్ స్క్రీన్ తప్పనిసరి. బయటకి వెళ్ళేటప్పుడు ఎస్ పిఎఫ్ 30 అన్నా కనీసం ఉండే సన్ స్క్రీన్ ను వాడండి. ఇది మీ పాదాలను హానికర యూవి కిరణాల నుండి కాపాడుతుంది. సాయంత్రం అయ్యాక మీ పాదాలను గోరువెచ్చని నీరున్న టబ్ లో ముంచి ఉంచి, తర్వాత టవల్ తో తుడుచుకోండి.

మీ గోళ్లరంగు తీసేయండి

మీ గోళ్లరంగు తీసేయండి

కొత్త నెయిల్ పాలిష్ వేసుకునే ముందు, పాత గోళ్ల రంగును తీసేయండి. కొన్ని గంటల పాటు వీలైతే గోళ్ళను ఏ రంగూ లేకుండా వదిలేసి తర్వాత వేయండి. అలా మీ గోళ్ళు బలపడతాయి. పాత నెయిల్ పాలిష్ ను ఎప్పుడూ రిమూవర్ తోనే తీయండి.

స్క్రబ్

స్క్రబ్

చచ్చిపోయిన కణాలను తీసేయటం ఎక్స్ ఫోలియేషన్ చేయటం వలన మీ పాదాలు మృదువుగా, మెత్తగా ఉంటాయి. స్క్రబ్ చేసేటప్పుడు పాదాలను మరీ గట్టిగా రుద్దకండి.

కాలి గోళ్ళను ట్రిమ్ చేయండి

కాలి గోళ్ళను ట్రిమ్ చేయండి

మీ గోళ్లను మరీ చిన్నగా కత్తిరించక్కర్లేదు, నడుస్తుంటే గుచ్చుకోకుండా ఉంటే చాలు. ఇలా గుచ్చుకునే సమస్యల నుంచి దూరంగా ఉండటానికి క్రమం తప్పకుండా గోళ్ళు కత్తిరించటం నేర్చుకోండి. ఎప్పుడూ కాలిగోళ్ళను కోణంగా కత్తిరించి, చివర్లన స్మూత్ చేయండి.

ప్రతిరోజూ మసాజ్ చేయండి

ప్రతిరోజూ మసాజ్ చేయండి

మీ పాదాలను ఆరోగ్యంగా ఉంచి అన్ని సమస్యల నుంచి దూరంగా ఉంచటానికి క్రమం తప్పకుండా మసాజ్ చేయటం సులభమైన పద్ధతి. మీ బిజీ షెడ్యూల్లో 5 నిమిషాలు పాదాలను మసాజ్ చేయటానికి కేటాయించండి. గోరువెచ్చని ఆలివ్ లేదా కొబ్బరినూనెను వాడండి.

English summary

Foot Care Tips That You Didn't Know

Who wouldn't love to have beautiful and soft feet? Most of us face the problem of dry and flaky feet, isn't it? There are many easy foot care tips and tricks that can enhance the natural beauty of your feet. Some tips like moisturizing your feet, protecting it from over exposure to the sun, etc., can be implemented.
Story first published:Wednesday, March 28, 2018, 17:58 [IST]
Desktop Bottom Promotion