For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సులభమైన గృహ చిట్కాలతో మీ గోళ్ళను తెల్లగా మార్చుకోండి

By Telugu Samhitha
|

నిస్తేజమైన మరియు రంగు నెరసిన గోళ్ళు మీ మృదువైన చేతులను అందవిహీనంగా కనిపించేలా చేస్తాయి. గోళ్ళ గురించి మరో ముఖ్య విషయం ఏమంటే వాటికి గోళ్ళ రంగు అధికంగా ఉపయోగించడం వల్ల కాని లేదా రోజంతా గోళ్ళు మురికి చేత ప్రభావితం కావడం వల్ల కాని అవి చాలా సులభంగా వర్ణ రహితం అవుతాయి.

నలుగురి మధ్య ఉన్నప్పుడు పసుపుగా లేదా వర్ణ విహీనంగా ఉన్న గోళ్ళు మనకి ఒక ఇబ్బందికర అంశంగా మారతాయి. గోళ్ళ బ్రష్‌తో గోళ్ళను శుభ్రపరిచినంత మాత్రాన మీరు కోరుకున్న ఫలితాలను పొందలేరు. మీరు మీ గోళ్ళను సాధారణంగా అందుబాటులో ఉన్న సులభమైన గృహ చిట్కాలను ఉపయోగించడం ద్వారా తెల్లగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి.

Whiten Your Nails With These Home Remedies

గోళ్ళను తెల్లబడటానికి చేసే ప్రక్రియలో చాలా పద్దతులు అవసరమవుతాయి. మరియు ఫలితాలను స్థిరంగా ఉంచడానికి క్రమగా ఈ పద్దతులను నిర్వహిస్తూ ఉండటం అవసరం. ఇంటి దగ్గరే సులభంగా చేయగల సహజ చర్మ కాంతిని పెంచే చికిత్సలను ఉపయోగించడం ఎల్లప్పుడూ మంచిది.

కింది పేర్కొనబడిన చిట్కాలు మరియు సలహాలు మీ గోళ్ళకు ఉన్న మురికిని తొలిగించడానికి మరియు మెరిసేలా చేయడానికి మీకు సహాయపడతాయి. తద్వారా మీరు ఇతరుల ముందు ఉన్నప్పుడు అసౌకర్యమైన భావనను తరిమి కొట్టవచ్చు .

అయితే కొన్ని గృహ చిట్కాలు క్రమంగా ఉపయోగించడం వల్ల మీకు ఎలా సహాయపడతాయో చూద్దాం.

నిమ్మ రసం

నిమ్మ రసం

ఒక గిన్నెలో రెండు నిమ్మకాయలు పిండి సుమారుగా 10 నిమిషాల పాటూ మీ వ్రేళ్ళను గిన్నెలో పెట్టి మీ గోళ్ళ క్రింద ఉన్న భాగానికి నిమ్మ రసం బాగా పట్టేవరకు ఉంచండి. గోరు వెచ్చని నీటితో మీ చేతులను శుభ్రం చేసి చేతి/ నెయిల్ క్రీమ్‌ను మీ వేళ్ళకు తప్పనిసరిగా రాసుకోండి. నిమ్మ రసంలో ఉన్న విటమిన్ సి సహజంగా ప్రకాశవంతం చేసే లక్షణాలను కలిగి ఉన్నట్టు పేర్కొనబడింది.

వంట (బేకింగ్) సోడా

వంట (బేకింగ్) సోడా

సహజంగా మీ గోళ్ళను తెల్లగా మార్చే ప్రయత్నంలో భాగంగా గోరు వెచ్చని నీటికి రెండు టీస్పూన్ల వంట సోడాను కలిపి ఆ పేస్టును మీ చేతి గోళ్లకు అప్లై చేయండి. సుమారు 5 నిముషాల పాటు ఉంచి ఆపై దానిని కడగాలి. వంట సోడా గోళ్ళను శుభ్రపరిచేందుకు సహాయం చేసే మూలకాలను కలిగి ఉంటుంది.

టూత్‌పేస్ట్

టూత్‌పేస్ట్

ఇంకొక గొప్ప మార్గం ఏంటంటే మీ చేతి వేళ్లను మరియు మీ గోళ్ళ క్రింద భాగాన్ని ఒక మెత్తటి టూత్‌బ్రష్‌‌ మీద టూత్‌పేస్ట్ పెట్టి మృదువుగా రుద్దడం చేయాలి. 3 నిమిషాల పాటు టూత్‌పేస్ట్‌‌ని‌‍‌ చేతి వ్రేళ్ళ మీద వదిలివేసి ఆ తరువాత వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

వైట్ వెనిగర్

వైట్ వెనిగర్

మీరు వైట్ వెనిగర్ ఉపయోగించి కూడా మీ గోళ్ళను తెల్లగా మార్చవచ్చు. ఒక చిన్న కప్పులో నీళ్ళు తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వైట్ వెనిగర్‌ని కలిపి ఆ మిశ్రమంలో చేతి వ్రేళ్ళను 5 నిమిషాల పాటు నానబెట్టడం ద్వారా గోళ్ళు తెల్లగా మారుతాయి. చేతి వ్రేళ్ళను/గోళ్ళను తేమగా ఉంచడానికి చేతి మరియు గోళ్ళ క్రీమును వ్రాయడం మర్చిపోవద్దు.

సబ్బు మరియు నీరు

సబ్బు మరియు నీరు

సబ్బు మరియు నీటితో మీ గోళ్ళను శుభ్రపరుచుకోవడం అనేది మీ గోళ్ళను తెల్లగా చేసే చాలా సాధారణ మార్గాలలో ఒకటి. ఉత్తమ ఫలితాలను పొందడాడానికి, సబ్బు మరియు నీటిని ఉపయోగిస్తున్నప్పుడు గోళ్ళను శుభ్రపరుచుకునే బ్రష్తోర మీ గోళ్ల క్రింద భాగంలో మృదువుగా రుద్దండి.

టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్

ఒక కాటన్ బాల్ ఉపయోగించి మీ గోళ్ళ మీద స్వచ్ఛమైన టీ ట్రీ ఆయిల్‌‌ని అప్లై చేయాలి. కొన్ని నిమిషాలు వదిలివేసి ఆపై గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. మీరు మెరుగుదలని గమనించేంత వరకూ దీనిని కొన్ని నెలల పాటు రోజుకు రెండుసార్లు అప్లై చేయండి.

నిమ్మరసం మరియు వంట సోడా మిశ్రమం

నిమ్మరసం మరియు వంట సోడా మిశ్రమం

ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మ రసంలో 2 నుండి 3 టేబుల్ స్పూన్స్ వంట సోడాని తీసుకుని బాగా కలపండి. ఒక దూది పుల్లని ఉపయోగించి మీ గోళ్ళ మీద మరియు ప్రతి గోరు కింద భాగంలో కూడా ఆ పేస్ట్‌ని అప్లై చేయండి. సుమారు 15 నిమిషాల తరువాత దీనిని సబ్బు మరియు నీటితో కడగండి.

నిమ్మకాయ ఉప్పు స్క్రబ్

నిమ్మకాయ ఉప్పు స్క్రబ్

మరొక సమర్థవంతమైన ఇంటి చిట్కా నిమ్మ మరియు ఉప్పుని ఉపయోగించడం. నిమ్మ రసం మరియు ఉప్పు సమాన భాగాలుగా తీసుకుని కలిపి ఆపై మీ గోళ్ళ మీద మృదువుగా రుద్దాలి. ఇది సుమారు ఐదు నిమిషాల పాటు వదిలేసి అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీని తరువాత తేమని కలిగించే క్రీమ్ లేదా లోషన్‌‌‌‌ను మీ చేతులకు అప్లై చేసుకోండి.

English summary

Whiten Your Nails With These Home Remedies

Most methods of nail whitening require several uses to produce results and regular use to maintain these results. It's always better to use natural skin-whitening remedies that you can do easily at home. The following tips and tricks will help you to un-stain your nails and make them shiny once again, so that you can stop feeling uncomfortable in front of others. So, let us see how some ingredients can help you with this on regular use.
Desktop Bottom Promotion