హొలీ 2018: చర్మంపై ఆలాగే శిరోజాలపై హొలీ రంగులను తొలగించడమెలా?

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

హొలీ అంటేనే రంగుల పండుగ. ఈ పండుగ అంటే చాలా మందికి ఇష్టం. అయితే, ఈ పండుగలో వాడే రంగులు చర్మంపై అలాగే శిరోజాలపై నిలిచి ఉండటం వలన రకరకాల సమస్యలు ఎదురవుతాయి. అందువలన, కాస్త కేర్ తీసుకుంటే హొలీ పండుగను ఆరోగ్యకరంగా ఆస్వాదించవచ్చు.

రంగులను నీటితో కలిపి హొలీ పండుగను జరుపుకుంటారు.అయితే, ఈ రంగులు చర్మంపై అలాగే శిరోజాలపై పడటం వలన వివిధ సమస్యలు తలెత్తుతాయి. అందరూ ఆర్గానిక్ కలర్స్ ని వాడరు కాబట్టి కెమికల్ కలర్స్ వలన నష్టం ఎక్కువ జరుగుతుంది. ఈ రంగుల వలన మన చర్మానికి అలాగే శిరోజాలకు నష్టం వాటిళ్లకుండా ఉండేందుకు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ టిప్స్ ను పాటిస్తే మీ సౌందర్యాన్ని మీరు సంరక్షించుకున్నవారవుతారు.

చర్మ సంరక్షణ:

చర్మ సంరక్షణ:

హోలీని సంతోషంగా మీ ప్రియమైన వారితో మీరు జరుపుకున్న తరువాత రంగులను తొలగించుకునే ప్రక్రియను ప్రారంభించాలి. ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా ఈ ప్రాసెస్ ను పాటించండి. రంగులు తడిగా ఉన్నప్పుడు వాష్ చేస్తే వాటిని తొలగించడం సులభంగా ఉంటుంది. లేదంటే, మీరు మరింత శ్రమ పెట్టాలి. అయితే, ఆందోళన చెందకండి. మీరు షవర్ చేసుకుంటున్న ప్రతి సారి రంగులు కొంత కొంతగా తొలగిపోతూ ఉంటాయి.

ఫేస్ డీటాక్స్:

ఫేస్ డీటాక్స్:

ఒక కప్పుడు పెరుగులో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని కలిపి, ఒంటిపై రంగులున్న చోట ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. ఆ తరువాత నార్మల్ లేదా గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. మరొకవిధంగా, కాస్తంత శెనగపిండిని, ఆల్మండ్ ఆయిల్, మిల్క్ క్రీమ్ మరియు రోజ్ వాటర్ లో కలిపి ఒక మిశ్రమాన్ని తయారుచేయాలి. రంగులున్న ప్రాంతాలలో ఈ పేస్ట్ ను అప్లై చేయాలి. పేస్ట్ డ్రై అయ్యే వరకు ఈ విధంగా చేయాలి. మీ చేతులతో రబ్ చేసుకుంటూ రంగులను తొలగించాలి. నీళ్లతో కలర్ ని వాష్ చేసి కాస్తంత రోజ్ వాటర్ తో కళ్లను శుభ్రపరచుకోవాలి. మీ కళ్ళు కూడా ప్రశాంతపడతాయి.

ఈ పద్దతిని పాటించండి

ఈ పద్దతిని పాటించండి

గోరువెచ్చటి నీటితో ముఖంపై నున్న రంగులను తొలగించండి. ఆ తరువాత సీ సాల్ట్ , గ్లిజరిన్ లలో కొన్ని చుక్కల ఆరోమా ఆయిల్ ను కలిపి ఒక మిశ్రమాన్ని తయారుచేసుకోండి. ఈ మిశ్రమం యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ గా పనిచేసి చర్మాన్ని కెమికల్స్ యొక్క దుష్ప్రభావం నుంచి రక్షిస్తుంది.

చర్మాన్ని రుద్దవద్దు

చర్మాన్ని రుద్దవద్దు

ముఖంపై రంగులను తొలగించడానికి చర్మంపై సోప్ ని ఉపయోగించి బలంగా రుద్దవద్దు. దీని వలన రంగులు పూర్తిగా పోవు. అదనంగా, చర్మం దెబ్బతింటుంది. కాబట్టి సోప్ బదులు ఫెషీయల్ క్లీన్సర్ లను వాడండి. బేబీ ఆయిల్ ను వాడినా మంచిదే. ఆ తరువాత మాయిశ్చరైజర్ ను వాడండి. అలాగే, బ్లీచింగ్, వ్యాక్సింగ్ మరియు ఫేసియల్ ల ను హోలీకి వారం ముందు అలాగే వారం తరువాత వరకు స్ట్రిక్ట్ గా అవాయిడ్ చేయండి. లేదంటే స్కిన్ పోర్స్ ఓపెనై ఉండటం వలన హానికర కెమికల్స్ చర్మం లోతుల్లోకి ప్రవేశించే ప్రమాదం కలదు.

నేచురల్ ప్రాడక్ట్స్ కి ప్రాధాన్యతనివ్వండి:

నేచురల్ ప్రాడక్ట్స్ కి ప్రాధాన్యతనివ్వండి:

కొన్ని నిమ్మ చెక్కలను చర్మంపై రుద్దవచ్చు. ఇది నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. నిమ్మలో ఉండే నేచురల్ బ్లీచింగ్ ప్రాపర్టీస్ చర్మంపై నున్న మొండి రంగులను తొలగించడంలో సహాయపడతాయి. కాసేపు రబ్ చేసి ఆ తరువాత వాష్ చేయాలి. ఆ తరువాత కొద్దిగా మాయిశ్చరైజర్ ను అప్లై చేస్తే చర్మం డ్రై అవదు.

హెయిర్ కేర్:

హెయిర్ కేర్:

హొలీ ఆడిన తరువాత, హెయిర్ ను స్వచ్ఛమైన నీటితో శుభ్రంగా కడగాలి. హెయిర్ పైనున్న రంగులన్నీ వదిలాయని నిర్దారించుకునే వరకు హెయిర్ ను వాష్ చేయాలి. తేలికపాటి షాంపూ మరియు కండిషనర్ తో హెయిర్ ను వాష్ చేయాలి. రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ లో నాలుగు టేబుల్ స్పూన్ల తేనెను అలాగే కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలపాలి. వీటిని బాగా కలిపి ఒక నరిషింగ్ ప్యాక్ ను సిద్ధం చేసుకోవాలి. ఈ ప్యాక్ ను స్కాల్ప్ కు అలాగే హెయిర్ కు పట్టించాలి. ఆ తరువాత 30 నిమిషాల తరువాత తేలికపాటి షాంపూతో అలాగే వార్మ్ వాటర్ తో హెయిర్ ను రిన్స్ చేయాలి.

English summary

Holi 2018: How to remove colours from your skin and hair

Most of us love the festival of colours - Holi, but at the same time there's no one denying the fact that it can wreak havoc on the skin and hair. And, all it takes to keep yourself safe and beautiful is a little care once you are done playing Holi.