For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖం మీది వెంట్రుకలు చర్మం లోపలికి పెరుగుతున్నాయా ? ఈ చిట్కాలు పాటించండి

మీరు క్లీన్ షేవింగ్ చేసినప్పుడు, ఒక్కోసారి చిన్ని చిన్ని మొటిమల వలె చర్మం మీద కనిపిస్తూ ఉంటాయి. నిజానికి ఇవి మొటిమలు కావు, సరిగ్గా పెరగని లేదా చర్మం లోపలికి పెరిగిన వెంట్రుకల ఆనవాళ్ళుగా ఉంటాయి.

|

సాధారణంగా ఒకప్పుడు ప్రజలు క్లీన్ షేవింగ్ ఇష్టపడే వారు. కానీ రాను రాను గడ్డం పెంచుకోడానికే సుముఖత వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే మరో అడుగు ముందుకు వేసి, మీసాలు, గడ్డాలకు కూడా స్టైల్స్ ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనికి కారణం, గడ్డం పూర్తిగా తొలగించినప్పుడు, చర్మం నేరుగా సూర్యునికి ప్రభావితమై చర్మ సంబంధ సమస్యలు వస్తాయని, లేదా స్టైల్, లేదా మొటిమలు కనపడకుండా దాచే ప్రయత్నంగా కూడా కావొచ్చు.

మీరు క్లీన్ షేవింగ్ చేసినప్పుడు, ఒక్కోసారి చిన్ని చిన్ని మొటిమల వలె చర్మం మీద కనిపిస్తూ ఉంటాయి. నిజానికి ఇవి మొటిమలు కావు, సరిగ్గా పెరగని లేదా చర్మం లోపలికి పెరిగిన వెంట్రుకల ఆనవాళ్ళుగా ఉంటాయి. ఇలా లోపలికి పెరిగిన వెంట్రుకలు వంకరగా ఉండడంతో పాటు చర్మం లోపలికి పెరగడం ద్వారా మొటిమల వలె కనిపిస్తుంటాయి.

ingrown hair

ఇలా చర్మం లోపలికి పెరిగిన వెంట్రుకలు (ఇన్గ్రోన్ హెయిర్) ఒక ఎరుపు రంగు బంప్ వలె ఏర్పడుతాయి. ఇవి మొటిమలను పోలి ఉంటాయి, కొన్ని సమయాల్లో బాధాకరంగా కూడా ఉండవచ్చు. మరియు ఆప్రాంతంలో చికాకు, నొప్పి, దురద మాత్రమే కాకుండా, క్రమంగా వాపుకు కూడా కారణమవుతుంటుంది. షేవింగ్ చేసినప్పుడు, ఇటువంటి రెడ్ బంప్స్ వారి గడ్డం మీద, బుగ్గలు లేదా మెడ ప్రాంతంలో కనపడడం సాధారణంగా ఉంటుంది.

నిజానికి ఇది అంత భయపడాల్సిన తీవ్రమైన విషయం కాదు కానీ దురద మరియు నొప్పి కలిగే అవకాశాలు ఉన్నాయి. అదృష్టవశాత్తూ ఇటువంటి సమస్య నుండి బయటపడే క్రమంలో భాగంగా, కొన్ని గృహ చిట్కాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అవేమిటో చూడండి. లోపలికి పెరిగే జుట్టు సమస్యను చికిత్స చేసేందుకు సహాయపడే గృహ చిట్కాలు :

1. టీ ట్రీ – ఆయిల్ :

1. టీ ట్రీ – ఆయిల్ :

టీ ట్రీ - ఆయిల్లో క్రిమినాశక తత్వాలు, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది షేవ్ చేసిన తర్వాత కనపడే మొటిమలను చికిత్స చేయడానికి మరియు ఇన్ఫెక్షన్ నివారించడానికి సహాయపడుతుంది. నొప్పిని మరియు మంటను తగ్గిస్తుంది.

ఎలా తయారు చెయ్యాలి :

• 5 చుక్కల టీ ట్రీ - ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల శుద్దిచేసిన నీటికి (మినరల్ వాటర్) జోడించండి.

• ఈ రెండింటినీ బాగా కలపండి మరియు షేవింగ్ చేసి శుభ్రపరచిన తర్వాత, చర్మం మీద అప్లై చేసి, 10 నిముషాల పాటు వదిలివేయండి. తర్వాత, మోస్తరు నీటితో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయండి.

• మంచి ఫలితాల కోసం వారంలో కనీసం ఒకటి లేదా రెండుసార్లు చేయండి.

2. ఉప్పు :

2. ఉప్పు :

పుప్పొడి లేదా బ్యాక్టీరియా సంబంధిత ఇన్ఫెక్షన్స్ అడ్డుకోవటానికి ఉప్పు సహాయపడుతుంది. వాపును తగ్గించడం ద్వారా నివారణను ప్రోత్సహిస్తుంది.

తయారు చేసే విధానం :

• కప్పులో గోరువెచ్చని నీటిని తీసుకుని 1½ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపండి.

• ఈ మిశ్రమంలో ఒక కాటన్ బాల్ ముంచి, ప్రభావిత ప్రాంతం నందు సున్నితంగా రుద్దండి.

• కొన్ని నిమిషాల పాటు వదిలివేసిన తర్వాత, సాధారణ నీటితో శుభ్రపరచండి.

• సమస్య పూర్తిగా పోయేవరకు రోజులో కనీసం రెండు మార్లు చేయండి.

3. తేనె :

3. తేనె :

తేనె యాంటీ బాక్టీరియా లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది బాక్టీరియాను పెరగకుండా ఆపే శక్తిని కలిగి ఉంటుంది. దీనివల్ల ప్రభావిత ప్రదేశాన్ని ఇన్ఫెక్షన్స్ బారినుండి నివారించగలుగుతుంది. తేనెలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, వాపును తగ్గించడంలో ఎంతగానో సహాయం చేస్తాయి.

చికిత్సా విధానం :

• ప్రభావిత ప్రాంతం నందు ఒక పొరలా సేంద్రీయ తేనెను వర్తించండి.

• 10 నిముషాల పాటు వదిలివేసిన తర్వాత, చల్లటి నీటితో శుభ్రం చేయండి.

• సమర్థవంతమైన ఫలితాలకోసం రోజులో కనీసం మూడు సార్లు చేయడం ఉత్తమంగా చెప్పబడుతుంది.

4. వెచ్చని నీరు లేదా ఐస్ క్యూబ్ :

4. వెచ్చని నీరు లేదా ఐస్ క్యూబ్ :

ప్రభావిత ప్రాంతంలో సాధారణ లేదా తీవ్రమైన నొప్పిని ఎదుర్కొంటే, వెచ్చని నీటితో అద్దినట్లుగా చేయడం, మరియు కొంచం వెచ్చని నీటిని తాగడం ద్వారా, రక్త ప్రసరణ వేగం మెరుగుపడి, ప్రభావిత ప్రాంతాన్ని శుభ్రపరచడంలో, మరియు నొప్పినుండి ఉపశమనం ఇవ్వడంలో సహాయం చేస్తుంది.

తరచుగా చేయడం మూలంగా రెడ్ బంప్స్ నివారించడంలో సహాయపడుతుంది. ఐస్ క్యూబ్స్ వాడకం కూడా నొప్పి, ఎర్రబారడం మరియు వాపు వంటి సమస్యలను తగ్గిస్తుంది. కనుక ఐస్ క్యూబ్ కూడా ప్రయత్నించవచ్చు. మీరు ఫలితాలు పొందే వరకు అప్పుడప్పుడు ఈచర్యను కొనసాగించండి.

5. షుగర్ స్క్రబ్

5. షుగర్ స్క్రబ్

లోపలికి పెరిగిన వెంట్రుకల సమస్యను నివారించడానికి సూచించబడిన చిట్కాలలో ఉత్తమమైనదిగా షుగర్ స్క్రబ్ ఉంది. మృతకణాలను లేదా మృత చర్మాన్ని తొలగించడం, మరియు చర్మం లోపలికి పెరిగిన జుట్టు వెలుపలికి వచ్చేందుకు సహాయం చేయడంలో అద్భుతమైన ప్రయోజనాలను కలిగిఉంటుంది.

ఎలా తయారు చెయ్యాలి :

• ఒక కప్పు తెల్లచక్కెరను, ½ కప్పు ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనెతో జోడించండి.

• టీ ట్రీ-ఆయిల్ యొక్క కొన్ని చుక్కలను అందులో వేసి బాగా కలపాలి.

• ప్రభావిత ప్రాంతంలో దీనిని వర్తించి, శాంతముగా మర్దన చేయండి.

• గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచండి.

• ఉత్తమ ఫలితాలకు వారంలో కనీసం ఒకటి లేదా రెండుసార్లు చేయండి.

6. బేకింగ్ సోడా:

6. బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా అంతర్గత ఆరోగ్య, మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. క్రమంగా ఇది ఎర్రబారడాన్ని తగ్గించి, వెంట్రుకలు లోనికి చొచ్చుకుని పోకుండా నిరోధిస్తుంది.

తయారు చేయు విధానం:

• 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను, 1 కప్ నీటితో కలపాలి.

• ఈ ద్రావణంలో ఒక కాటన్ బాల్ ఉంచి, ప్రభావిత ప్రాంతానికి వర్తించండి.

• 5 నిముషాల పాటు వదిలివేసిన తర్వాత, చల్లటి నీటితో శుభ్రం చేయవలసి ఉంటుంది.

• ఉత్తమ ఫలితాల కోసం రోజులో రెండు నుండి మూడుసార్లు చేయండి.

7. జుట్టు చర్మంలోనికి పెరుగకుండా నివారించడానికి చిట్కాలు

7. జుట్టు చర్మంలోనికి పెరుగకుండా నివారించడానికి చిట్కాలు

• జుట్టు చర్మంలోనికి పెరుగకుండా, సమస్య తీవ్రతను తగ్గించడానికి ఒక శుభ్రమైన సింగిల్ బ్లేడ్ రేజర్ ఉపయోగించండి.

• షేవింగ్ అయిన తర్వాత, ముఖాన్ని శుభ్రపరచిన తర్వాత, పొడి బట్టతో సున్నితంగా రుద్దినట్లు తుడవడం, లేదా షుగర్ స్క్రబ్ వినియోగించడం కొంత ఫలితాన్ని ఇస్తుంది.

• వెంట్రుక పెరిగే దిశలోనే షేవ్ చేయడం మంచిది.

• చర్మానికి పూర్తిగా తాకేలా షేవింగ్ చేయరాదు.

• ఎలక్ట్రిక్ రేజర్ వినియోగించిన ఎడల, మీ చర్మం యొక్క ఉపరితలంపై కనీసం ఒక పాయింట్ అయినా వదిలేలా రేజర్ (ట్రిమ్మర్) వినియోగిస్తున్నారని నిర్ధారించుకోండి.

English summary

Home Remedies To Treat Ingrown Facial Hair In Men

After shaving your beard, do you most often see pimples popping up on your face? Actually, they aren't pimples but ingrown hairs. Ingrown hairs occur when the hair has curled around and grown back into your skin instead of growing out of the skin.
Story first published:Saturday, September 29, 2018, 12:53 [IST]
Desktop Bottom Promotion