For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎక్జిమా నుంచి తక్షణ ఉపశమనాన్ని పొందడమెలా? !

ఎక్జిమాతో బాధపడేవారి చర్మం పొడిగా ఎర్రబడుతుంది. తీవ్రంగా దురద కలుగుతుంది. దురదని గోకడం ద్వారా ర్యాషెస్ కనిపిస్తాయి. చాలా సందర్భాలలో, ర్యాషెస్ అనేవి బొబ్బలుగా మారతాయి కూడా.

|

ఫ్లేకీ, డ్రై స్కిన్ అనేది ఎంతో పెయిన్ ఫుల్ అలాగే ఇరిటేటింగ్ స్కిన్ కండిషన్. ఎక్జిమా అనేది పెద్దలకంటే చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. పెద్దలలో కూడా ఈ సమస్య కనిపిస్తుంది. డ్రై స్కిన్ కు అలాగే ఎక్జిమాకు తేడా ని గుర్తించడం కాస్తంత కష్టతరమే అయినా గమనిస్తే గుర్తించవచ్చు. ఎక్జిమాకి గురైతే డ్రై స్కిన్ అనేది కేవలం చేతులు, కాళ్ళు, మోచేతులు అలాగే కీళ్లపై కనిపిస్తుంది.

ఎక్జిమాతో బాధపడేవారి చర్మం పొడిగా ఎర్రబడుతుంది. తీవ్రంగా దురద కలుగుతుంది. దురదని గోకడం ద్వారా ర్యాషెస్ కనిపిస్తాయి. చాలా సందర్భాలలో, ర్యాషెస్ అనేవి బొబ్బలుగా మారతాయి కూడా.

How To Get Fast Relief From Eczema

మీ చర్మం అనేది మిమ్మల్ని ఇన్ని విధాలుగా ఇబ్బందిపెడుతున్నట్లైతే మీరు రిలీఫ్ కోసం వెతకడం సహజం. పరిస్థితి తీవ్రమైతే, డెర్మటాలజిస్ట్ ను సంప్రదించడం ముఖ్యం. ఒకవేళ ఈ చర్మసమస్య మొదటి స్టేజ్ లో ఉంటే, న్యాచురల్ రెమెడీస్ ద్వారా సరైన పరిష్కారాన్ని పొందవచ్చు.

పర్యావరణంలోని ఇరిటెన్ట్స్ కి ఇమ్యూన్ సిస్టమ్ అతిగా రియాక్ట్ అవడం వలన ఈ డిసార్డర్ తలెత్తుతుంది. సోప్స్, డిటెర్జెంట్స్ అలాగే ఏవైనా ఘాటైన వాసన కలిగినవి చర్మానికి అప్లై చేయడం ద్వారా ఈ చర్మ సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. కొన్ని సార్లు ఒత్తిడి వలన కూడా ఈ సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. ఈ సమస్య మైల్డ్ స్టేజ్ లో ఉన్నట్టయితే ఒక వారంలో సరైన చికిత్స ద్వారా పూర్తిగా నయమవుతుంది.

ఈ రెమెడీస్ ను ప్రయత్నించండి మరి.

1. సాల్ట్ సోక్:

1. సాల్ట్ సోక్:

చర్మానికి అవసరమైన మెగ్నీషియాన్ని ఎప్సమ్ సాల్ట్ నుంచి పొందవచ్చు. కాస్తంత ఉప్పుని వెచ్చటి నీటిలో కలపండి. నీరు మరీ వేడిగా ఉండకుండా జాగ్రత్తపడండి. వేడి అతిగా ఉన్నా కూడా చర్మం ఇరిటేషన్ కి గురవుతుంది. ఈ నీటిలో ప్రభావిత ప్రదేశం మునిగేలా చూడండి.

2. చమోమైల్ బాత్:

2. చమోమైల్ బాత్:

చమోమైల్ టీలో చర్మాన్ని ప్రశాంతపరిచే గుణాలు అనేకం కలవు. అందువలన, చమోమైల్ అనేది ఎక్జిమాతో ఇబ్బందిపడుతున్న మీకు కావలసినంత ప్రశాంతతను అందిస్తుంది. గోరువెచ్చటి బాత్ వాటర్ లో అయిదు చమోమైల్ టీ బ్యాగ్స్ ను ముంచండి. ఆ తరువాత గంటపాటు ఈ నీటిలో సేదతీరండి. ఈ ప్రక్రియ మీ చర్మాన్ని ప్రశాంతపరచి మీకు ఉపశమనాన్ని అందిస్తుంది.

3. విటమిన్ ఈ ఆయిల్:

3. విటమిన్ ఈ ఆయిల్:

హీలింగ్ ప్రాసెస్ ని వేగవంతం చేసే సామర్థ్యం విటమిన్ ఈ ఆయిల్ కు కలదు. ఈ ఆయిల్ తో చర్మాన్ని మసాజ్ చేస్తే త్వరగా మీ చర్మం కోలుకుంటుంది. దురదలు తగ్గి, మచ్చలు తగ్గుముఖం పడతాయి. ఇందుకోసం, విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్ నుంచి నూనెను సేకరించి చర్మంపై అప్లై చేయాలి.

4. ఆపిల్ సిడర్ వినేగార్:

4. ఆపిల్ సిడర్ వినేగార్:

ఇంఫ్లేమేషన్ ని అలాగే బర్నింగ్ స్కిన్ ని సూత్ చేయడానికి ఆపిల్ సిడర్ వినేగార్ అత్యద్భుతంగా తోడ్పడుతుంది. వినేగార్ ని ప్రభావిత ప్రాంతంపై కాటన్ బాల్ ని ఉపయోగించి నేరుగా అప్లై చేయవచ్చు. అయితే, ముందు జాగ్రత్తగా, వినేగార్ ని డైల్యూట్ చేసి వాడితే మంచిది. 1:2 రేషియోలో వినేగార్ ను నీళ్లను తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై అప్లై చేయాలి. అయితే, చర్మంపై క్రాక్స్ ఉన్నచోట అలాగే బ్లీడింగ్ స్కిన్ పైన వినేగార్ ని అప్లై చేయకూడదు. అలా చేస్తే స్కిన్ మరింత ఇరిటేషన్ కి గురయ్యే ప్రమాదం ఉంది.

5. ఆలివ్ ఆయిల్:

5. ఆలివ్ ఆయిల్:

ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభ్యమయ్యే నేచురల్ ఆయిల్ గా ఆలివ్ ఆయిల్ ప్రసిద్ధి చెందింది. ప్రభావిత ప్రదేశాలపై ఆలివ్ ఆయిల్ ను అప్లై చేయడం ద్వారా ఇంఫ్లేమేషన్ సమస్య తగ్గుముఖం పడుతుంది. తద్వారా, డ్రై మరియు ఫ్లేకీ స్కిన్ సమస్యలు తొలగిపోతాయి. తలపై ఫ్లేకీ స్కిన్ ఉన్నప్పుడు కూడా ఈ పరిష్కారం ఉపయోగపడుతుంది.

6. అలోవెరా:

6. అలోవెరా:

యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీలు అలో వెరా లో పుష్కలంగా లభిస్తాయి. అలాగే, చర్మానికి కూలింగ్ ఎఫెక్ట్ కూడా బాగా లభిస్తుంది. అలోవెరా అనేది చర్మాన్ని ప్రశాంతపరచి మీకు ఉపశమనాన్ని అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

7. బేకింగ్ సోడా:

7. బేకింగ్ సోడా:

మీకు క్విక్ రిలీఫ్ కావాలనుకుంటే మీరు బేకింగ్ సోడా రెమెడీని పాటించాలి. బేకింగ్ సోడాని నీటితో కలిపి ప్రభావిత ప్రాంతంపై తడివస్త్రంతో అప్లై చేయాలి. బ్లస్ట్రింగ్ ఏరియాని బేకింగ్ సోడా అనేది సూత్ చేస్తుంది.

8. కోల్డ్ కంప్రెస్:

8. కోల్డ్ కంప్రెస్:

ర్యాషెస్ అలాగే ఇచింగ్ నుంచి కోల్డ్ కంప్రెస్ ద్వారా తక్షణ ఉపశమనాన్ని పొందవచ్చు. అయితే, ఈ రెమెద్య్ అనేది బ్లిస్టర్స్ గా మారని ర్యాషెస్ పై మాత్రమే ఉపయోగపడుతుంది. డ్రై ర్యాషెస్ పైనే ఈ రెమెడీని ప్రయత్నించాలి. లేదంటే, పరిస్థితి మరింత సమస్యాత్మకంగా మారుతుంది.

English summary

How To Get Fast Relief From Eczema

If one is suffering from eczema, the skin on this area gets red and dry, and severely itchy. If you itch the area, a rash will form. In severe cases, the rashes can further form oozing blisters. But there are certain home remedies that will help you get rid of eczema quickly. Read to know which are the ways in
Story first published:Tuesday, February 13, 2018, 11:17 [IST]
Desktop Bottom Promotion