For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాళ్లు మరియు చేతులపై పిగ్మెంటేషన్ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు?

కాళ్లు మరియు చేతులపై పిగ్మెంటేషన్ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు?

|

చర్మం నల్లబడటం లేదా పిగ్మెంటేషన్ అనే సమస్య, ఒక వ్యక్తి యొక్క ఆత్మగౌరవం మరియు ఆత్మవిశ్వాసాలను దెబ్బతీస్తాయి. ఎవరైనా సహజంగా, తాము నలుగురికి అందంగా కనపడాలని కోరుకుంటారు.

మనలో చాలామందికి చేతులు మరియు కాళ్లపై పిగ్మెంటేషన్ సమస్య ఉంటుంది కదా? మన ముఖంతో పోల్చి చూస్తే కాళ్ళు, చేతుల రంగు వేరేగా ఉంటాయి.

మన ముఖ చర్మం మీద ఎంత శ్రద్ధ తీసుకుంటామో, కాళ్ళు, చేతుల విషయంలో కూడా అంతే శ్రద్ధ తీసుకోవాలి. సూర్య కిరణాల ప్రభావానికి అతిగా లోనవడం లేదా ట్యానింగ్ కాళ్ళు, చేతులు చర్మం నల్లబడటానికి ముఖ్య కారణం.

కాళ్లు మరియు చేతులపై పిగ్మెంటేషన్ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు

ఈ సమస్య పరిష్కారానికి మార్కెట్లో ఎన్నో రకాల క్రీములు దొరుకుతున్నప్పటికిని, వాటికై మీరు సమయం మరియు డబ్బులు వెచ్చించవలసి వస్తుంది. కానీ వీటికన్నా గృహవైద్య చిట్కాలు ద్వారా ఇంకా ప్రభావవంతమైన ఫలితం పొందవచ్చు.

ఇక్కడ, ఇక్కడ, కొన్ని ప్రకృతి సహజ పదార్థాలను ఉపయోగించి, పది రోజుల లోగా మీ కాళ్ళు, చేతుల పై ఉన్న చర్మంపై పిగ్మెంటేషన్ ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోండి! చదివేయండి ఇక!

బంగాళదుంప

బంగాళదుంప

కావలసిన పదార్థాలు:

1 బంగాళదుంప

వాడే విధానం:

1. ఒక బంగాళదుంపను చిన్న చిన్న ముక్కలుగా కోసి తురమండి. ఇప్పుడు ఆ తురుమును పిండి రసం వెలికి తీయండి.

2. ఒక దూది ఉండతో ఈ ద్రావణాన్ని చేతులకు మరియు కాళ్లకు రాసుకోండి.

3. దీనిని పదిహేను- ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి చల్లని నీటితో కడిగేయాలి.

చర్మం పొడిబారే అవకాశం ఉంటుంది కనుక, కడుక్కున్న తరువాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయాలి.

యాపిల్ సిడర్ వెనిగర్

యాపిల్ సిడర్ వెనిగర్

కావలసిన పదార్థాలు:

1 టేబుల్ స్పూన్ యాపిల్ సిడర్ వెనిగర్

2 టేబుల్ స్పూన్ల నీరు

వాడే విధానం:

1.యాపిల్ సిడర్ వెనిగర్ ను నీటిని కలపండి.

2. ఈ ద్రావణాన్ని చేతులకు మరియు కాళ్లకు రాసుకోండి.

3. ఐదు నిమిషాల పాటు ఆరనిచ్చి గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.

నారింజ తొక్కల పొడి

నారింజ తొక్కల పొడి

మొదటి పద్ధతి:

కావలసిన పదార్థాలు

నారింజ తొక్కల పొడి

2 టేబుల్ స్పూన్ల పెరుగు

వాడే విధానం:

1. ఎండు నారింజ తొక్కల పొడిని 2 టేబుల్ స్పూన్ల చల్లని పెరుగులో కలపండి.

2. ఈ మిశ్రమాన్ని చేతులకు కాళ్లకు రాసుకోండి.

3. 20 నిమిషాలు తరువాత నలుగులా వలయాకారంలో రుద్దుకుంటు తొలగించండి.

క్రమం తప్పకుండా ఇలా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

రెండవ పద్ధతి:

రెండవ పద్ధతి:

కావలసిన పదార్థాలు

2 టేబుల్ స్పూన్ల నారింజ తొక్కల పొడి

2 టీ స్పూన్ల తేనె

1 టీ స్పూన్ బ్రౌన్ షుగర్

వాడే విధానం:

1. 2 టేబుల్ స్పూన్ల నారింజ తొక్కల పొడి, 2 టీ స్పూన్ల తేనె మరియు 1 టీ స్పూన్ బ్రౌన్ షుగర్ ను కలపాలి.

2. మీ వద్ద బ్రౌన్ షుగర్ లేనట్లయితే, తెల్లని పంచదార వాడవచ్చు.

3. వీటన్నిటిని బాగా కలిపిన తరువాత, ఆ మిశ్రమంతో చేతులకు, కాళ్లకు నలుగులా పెట్టుకోండి.

4. పదిహేను నిమిషాల తరువాత మామూలు నీటితో కడిగేయండి.

నిమ్మకాయ

నిమ్మకాయ

నిమ్మకాయ ప్యాక్

కావలసిన పదార్థాలు

3 టేబుల్ స్పూన్ల నిమ్మరసం

1 టేబుల్ స్పూన్ పెరుగు

2 టేబుల్ స్పూన్ల శనగపిండి

వాడే విధానం:

1. ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేయండి.

2. దీనిలో 1 టేబుల్ స్పూన్ పెరుగు మరియు 2 టేబుల్ స్పూన్ల శనగపిండి కలపండి.

3. ఈ మిశ్రమాన్ని చేతులకు, కాళ్లకు రాసుకోండి.

4. దట్టంగా రాసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి కడిగేయండి. తరువాత పొడిగా తుడుచుకోండి.

నిమ్మ స్క్రబ్

నిమ్మ స్క్రబ్

కావలసిన పదార్థాలు

2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం

1 టేబుల్ స్పూన్ పంచదార

2 టేబుల్ స్పూన్ల తేనె

వాడే విధానం:

1. ఒక గిన్నెలో, 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం మరియు 1 టేబుల్ స్పూన్ పంచదార కలపండి.

2. దీనికి 2 టేబుల్ స్పూన్ల తేనె కలపండి.

3. నిమ్మరసానికి బదులుగా నిమ్మతొక్కల పొడి కూడా మీ ఇష్టానుసారం వాడవచ్చు.

4. ఈ మిశ్రమంతో చేతులకు, కాళ్లకు నలుగులా పెట్టుకోండి. తరువాత మామూలు నీటితో కడిగేయండి.

కలబంద:

కలబంద:

మొదటి పద్ధతి:

కావలసిన పదార్ధం:

1 కలబంద ఆకు

వాడే విధానం:

1. ఒక కలబంద ఆకును తీసుకుని , దానిని పిండి అందులో గుజ్జునుబవేరు చేయాలి. .

2. ఈ గుజ్జును చేతులకు, కాళ్లకు బాగా రుద్దుకోవాలి.

3. దీనిని ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి చల్లని నీటితో కడిగేయాలి.

4. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే, ఫలితం త్వరగా వస్తుంది.

రెండవ పద్ధతి:

రెండవ పద్ధతి:

కావలసిన పదార్థాలు:

2 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు

బాదం నూనె

వాడే విధానం:

1. రెండు టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జులో కొన్ని చుక్కల బాదం నూనె వేసి కలిపి, కాళ్లకు చేతులకు రాసుకుంటే, కాంతివంతంగా మారతాయి.

2. ఈ మిశ్రమాన్ని చర్మం పై రాసుకోవాలి.

3. పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి కడిగేయాలి. తరువాత పొడిగా తుడుచుకోండి.

గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, దీనిని రాసుకున్నాక ఎండలోకి వెళ్లరాదు.

English summary

How To Treat Pigmentation On Hands And Legs?

How To Treat Pigmentation On Hands And Legs,Skin pigmentation or discoloration can play a major role in affecting a person's self-esteem and confidence. After all, we all prefer to look presentable. Discoloration or pigmentation on our hands and legs is a problem faced by most of us, isn't it? When compared to our face
Desktop Bottom Promotion