For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అండర్ ఆర్మ్ వద్ద హెయిర్ గ్రోత్ ను అరికట్టేందుకు పసుపు తోడ్పడుతుందా?

అండర్ ఆర్మ్ వద్ద హెయిర్ గ్రోత్ ను అరికట్టేందుకు పసుపు తోడ్పడుతుందా?

|

మీకు ట్రెండీ స్లీవ్ లెస్ డ్రెసెస్ ని ధరించాలని ఉన్నప్పుడు అండర్ ఆర్మ్ హెయిర్ అనేది ఒక అడ్డంకిగా మారుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో స్లీవ్ లెస్ లు ధరించాలనుకునే వారికి అండర్ ఆర్మ్స్ లో హెయిర్ వారి కోరికను నెరవేరనీయదు. అండర్ అర్మ్స్ లో అన్ వాంటెడ్ హెయిర్ గ్రోత్ లేనప్పుడు మీరు ట్రెండీ డ్రెస్ లను నిశ్చింతగా వేసుకోవచ్చు. అండర్ అర్మ్స్ లో అన్ వాంటెడ్ హెయిర్ తో మీరు ఇబ్బందిపడుతున్నట్టయితే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా, అన్ వాంటెడ్ హెయిర్ నుంచి ఉపశమనం పొందాలి. అండర్ ఆర్మ్స్ నీట్ గా ఉండడం చేత శరీర దుర్వాసన కూడా తగ్గుముఖం పడుతుంది.

అయితే, అండర్ ఆర్మ్స్ వద్ద హెయిర్ ను తొలగించేందుకు మీరు ఖరీదైన ప్రోడక్ట్స్ ను వాడనవసరం లేదు. అలాగే స్పాను సందర్శించనవసరం లేదు. ఈ రెండూ మీ జేబుకు చిల్లు పెట్టే ఆస్కారం ఉంది. ఒకవేళ మీరు మార్కెట్ లో లభ్యమయ్యే హెయిర్ రిమూవల్ క్రీమ్ ను కొనాలనుకున్నా లేదా పార్లర్ లో హెయిర్ ను వ్యాక్సింగ్ చేయించుకుందామని అనుకున్నా వాటికి మీరు ఎంతో డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయినా, అండర్ అర్మ్స్ లో హెయిర్ మళ్ళీ పెరుగుతుంది. కాబట్టి, ఈ రొటీన్ టాస్క్ ల కోసం అంత డబ్బును ఖర్చు చేసే బదులు, సులభంగా ఇంటివద్దే అండర్ ఆర్మ్స్ లోని హెయిర్ ను తొలగించుకునే పద్దతిని తెలుసుకుని పాటిస్తే మేలు.

Is Turmeric Effective In Preventing Underarm Hair Growth?

ఇప్పుడు, అన్ వాంటెడ్ హెయిర్ ను తొలగించే కొన్ని సహజ పదార్థాలు గురించి తెలుసుకుందాం. వీటిని వాడటం ద్వారా ఇంటి వద్దే అన్ వాంటెడ్ హెయిర్ ను సులభంగా తొలగించుకోవచ్చు. ఇవి సురక్షితమైనవి. అదే సమయంలో ఇవి చౌకగా లభిస్తాయి. వీటిని, మీ వీలు బట్టి ఇంట్లోనే వాడుకుని చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు.

ఇక్కడ మీరు గుర్తించవలసిన మరొక విషయం ఏంటంటే, స్పా ట్రీట్మెంట్స్ తో పాటు మార్కెట్ లో లభ్యమయ్యే ట్రీట్మెంట్స్ కేవలం హెయిర్ రిమూవల్ కి మాత్రమే తోడ్పడతాయి. అంతేకాని, హెయిర్ గ్రోత్ ను అరికట్టవు. అదే నేచురల్ ఇంగ్రేడియంట్స్ ను ఉపయోగించడం ద్వారా అన్ వాంటెడ్ హెయిర్ గ్రోత్ ను అరికట్టవచ్చు. అపసుపు, అటువంటి ఒక గొప్ప చర్మ సంరక్షణ పదార్థం. ఇది అన్ వాంటెడ్ హెయిర్ గ్రోత్ ను అరికడుతుంది. చర్మానికి కాంతిని అందిస్తుంది.

ఈ ఆర్టికల్ లో, పసుపును ఉపయోగించడం ద్వారా అండర్ ఆర్మ్స్ లోని హెయిర్ గ్రోత్ ను ఏ విధంగా అరికట్టవచ్చో తెలుసుకుందాం. అలాగే హెయిర్ రిమూవల్ కి పాటించవలసిన జాగ్రత్తల గురించి కూడా తెలుసుకుందాం.

అండర్ అర్మ్స్ వద్ద హెయిర్ గ్రోత్ ను అరికట్టేందుకు పసుపు ఏ విధంగా తోడ్పడుతుంది?

అండర్ అర్మ్స్ వద్ద హెయిర్ గ్రోత్ ను అరికట్టేందుకు పసుపు ఏ విధంగా తోడ్పడుతుంది?

పసుపును హెయిర్ రిమూవల్ కి వాడే పద్దతి భారతీయ మహిళల్లో అత్యంత ప్రాచుర్యం చెందింది. ఎందుకంటే, ఇది యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇంఫ్లేమేటరీ లక్షణాలు కలిగి ఉండటంతో పాటు అన్ వాంటెడ్ హెయిర్ ను తొలగించి ఆయా ప్రదేశాలలో హెయిర్ గ్రోత్ ను అరికడుతుంది.

పసుపును చక్కటి పేస్ట్ లా మార్చుకుని హెయిర్ రిమూవల్ కి వాడాలి. స్కిన్ కి పసుపు పేస్ట్ ని అప్లై చేయగానే ఇది తేలికపాటి గ్లూ లా పనిచేస్తుంది. దీన్ని తొలగించగానే హెయిర్ కూడా మూలాల నుంచి తొలగిపోతుంది. ఇది వ్యాక్సింగ్ పద్దతిని పోలి ఉంటుంది. అంతేకాక, పసుపు హెయిర్ గ్రోత్ ను అరికట్టగలదు. ఈ పద్దతిని తరచూ రిపీట్ చేస్తూ ఉంటే హెయిర్ అనేది సాఫ్ట్ గా మారి క్రమంగా రాలిపోతుంది.

అండర్ ఆర్మ్ వద్ద హెయిర్ ను తొలగించేందుకు పసుపును వాడే విధానమేంటి?

అండర్ ఆర్మ్ వద్ద హెయిర్ ను తొలగించేందుకు పసుపును వాడే విధానమేంటి?

ఇక్కడ రెండు సింపుల్ రెసెపీస్ గురించి వివరించాము. ఇవి అండర్ ఆర్మ్ వద్ద హెయిర్ ను సులభంగా అలాగే సురక్షితంగా తొలగిస్తాయి.

ఇంటివద్దే అండర్ ఆర్మ్ హెయిర్ ను తొలగించడమెలా?

ఇంటివద్దే అండర్ ఆర్మ్ హెయిర్ ను తొలగించడమెలా?

పలచటి హెయిర్ ను తొలగించేందుకు పసుపు మరియు పాల ప్యాక్ :

కావలసిన పదార్థాలు:

• 3 టీస్పూన్ల పసుపు

• ఒక టీస్పూన్ పాలు

ఎలా వాడాలి:

ఎలా వాడాలి:

1. మూడు టీస్పూన్ల ఆర్గానిక్ పసుపు పొడిని ఒక టీస్పూన్ పాలతో కలిపి చిక్కటి పేస్ట్ ను తయారుచేయాలి.

2. ఈ పేస్ట్ ను హెయిర్ గ్రోత్ ఉండే ప్రదేశంలో ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలి. హెయిర్ గ్రోత్ డైరెక్షన్ లోనే ఈ పేస్ట్ ను అప్లై చేయాలి.

3. ఇరవై నిమిషాల పాటు లేదా ఈ పేస్ట్ ఆరేవరకు దీన్ని తొలగించకూడదు.

4. ఆ తరువాత, శుభ్రమైన పొడిబట్టను తీసుకుని హెయిర్ ను స్క్రబ్ చేసుకుంటూ హెయిర్ గ్రోత్ కు అపోజిట్ డైరెక్షన్ లోంచి హెయిర్ ను తొలగించండి. సున్నితంగా హెయిర్ ను తొలగించండి.

5. ఈ టర్మరిక్ పేస్ట్ ను తరచూ వాడటం వలన హెయిర్ గ్రోత్ అనేది అరికట్టబడుతుంది. మళ్ళీ హెయిర్ పెరగడానికి చాలా సమయం పడుతుంది. అందువలన, ఈ పేస్ట్ ను క్రమం తప్పకుండా వాడటం ద్వారా హెయిర్ గ్రోత్ ఆగిపోతుంది.

దట్టమైన హెయిర్ ను తొలగించేందుకు పసుపు, పాలు మరియు శనగపిండి ప్యాక్:

దట్టమైన హెయిర్ ను తొలగించేందుకు పసుపు, పాలు మరియు శనగపిండి ప్యాక్:

కావలసిన పదార్థాలు:

• అర కప్పు చల్లటి పాలు

• అర కప్పు శనగపిండి

• రెండు టేబుల్ స్పూన్ల పసుపు

• ఒక టేబుల్ స్పూన్ ఉప్పు

ఎలా వాడాలి:

ఎలా వాడాలి:

1. ఈ పదార్థాలన్నిటినీ చిన్న పాత్రలోకి తీసుకుని చిక్కటి పేస్ట్ ను తయారుచేసుకోండి.

2. ఈ పేస్ట్ ను ప్రభావిత ప్రాంతంపై అప్లై చేసుకోండి.

3. ఇరవై నిమిషాల పాటు ఈ పేస్ట్ ను అలాగే ఉంచండి.

4. గోరువెచ్చటి నీటితో రిన్స్ చేయండి. ఆ తరువాత శుభ్రమైన టవల్ తో తడిని ఆరబెట్టండి.

ఫలితాలను గమనించడానికి ఎంత సమయం పడుతుంది?

ఫలితాలను గమనించడానికి ఎంత సమయం పడుతుంది?

ఈ రెసిపీ సింపుల్ మరియు సురక్షితమైనదని మనం ముందుగానే చెప్పుకున్నాం. ఇది హెయిర్ ను శాశ్వతంగా తొలగించేందుకు తోడ్పడుతుంది. దీన్ని హెయిర్ గ్రోత్ ను ఆపేందుకు కనీసం పది సార్లు క్రమం తప్పకుండా వాడాలి. అప్పుడే ఇది ఫలితాన్ని చూపించడం ప్రారంభిస్తుంది. ఆ తరువాత ఈ ప్యాక్ ను ఉపయోగించే ఫ్రీక్వెన్సీ ను తగ్గించుకోవచ్చు.

పసుపు అనేది ఫైన్ హెయిర్ ను సులభంగా తొలగించగలదు. అదే సమయంలో దట్టమైన హెయిర్ ను తొలగించేందుకు ఇది అంత సమర్థవంతంగా ఉండకపోవచ్చు. అందువలన, దట్టమైన హెయిర్ ను తొలగించేందుకు శనగపిండిలో పసుపును కలిపి ప్యాక్ ను తయారుచేసుకోవాలి. ఓట్స్, రైస్, పాలు వంటి వాటిని కూడా కలపవచ్చు.

అలాగే, పసుపు అనేది మరకలను మిగులుస్తుంది. ఈ మరకలు శాశ్వతమైనవి కావు. ఇవి సులభంగా తొలగిపోతాయి. పసుపు వలన ఏర్పడిన ఎల్లో స్టెయిన్స్ ను తొలగించేందుకు పాలలో దూదిని ముంచి ప్రభావిత ప్రాంతంపై రుద్దాలి.

అండర్ ఆర్మ్ వద్ద హెయిర్ ను తొలగించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు

అండర్ ఆర్మ్ వద్ద హెయిర్ ను తొలగించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు

మీ అర్మ్ప్ పిట్స్ అనేవి శరీరంలోని సున్నితమైన భాగం. అందువలన, హెయిర్ రిమూవల్ మెథడ్ ను మీరు సరిగ్గా ఎంచుకోవాలి. అలాగే, మీరు హెయిర్ రిమూవల్ సమయంలో పాటించవలసిన జాగ్రత్తలను గమనించాలి.

అవేంటంటే:

1. ఈ ప్యాక్ ను వాడే ముందు స్కిన్ పై 24 గంటల ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. మీ చర్మానికి ఈ ప్యాక్ సరిపడుతుందో లేదో తెలుసుకోండి.

2. ప్రభావిత ప్రాంతాన్ని నీటితో శుభ్రపరచుకొని ఆరబెట్టి ప్రాసెస్ ను ప్రారంభించండి.

3. హెయిర్ రిమూవల్ తరువాత చర్మం ఎర్రబడటం, బొబ్బలు వంటివాటిని మీరు గమనిస్తే ఐస్ క్యూబ్స్ ను వాడండి.

4. స్కిన్ ఇరిటేషన్ ను తగ్గించుకునేందుకు హెయిర్ రిమూవల్ తరువాత వదులైన కాటన్ వస్త్రాలను ధరించండి.

5. ఎండలో ఎక్కువసేపు ఉన్నట్టయితే కనీసం 24 గంటల బ్రేక్ తీసుకున్న తరువాత హెయిర్ రిమూవల్ ప్రాసెస్ ను పాటించండి. లేదంటే, స్కిన్ ఇరిటేషన్ కు గురవవచ్చు.

6. స్కిన్ ఇరిటేషన్ కు గురయిన చోట హెయిర్ ను రిమూవ్ చేయడానికి ప్రయత్నించవద్దు.

English summary

Is Turmeric Effective In Preventing Underarm Hair Growth?

Removal of underarm hair is an important part of self-hygiene. The hair removal method using turmeric is quite popular among women in India. This is because, apart from being antibacterial and anti-inflammatory, there are compounds in this super-spice that helps remove unwanted hair and inhibits the growth of hair.
Story first published:Monday, August 13, 2018, 14:52 [IST]
Desktop Bottom Promotion