For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షాకాలంలో పాదాల సంరక్షణ చేసుకునే పద్ధతి ఎలానో తెలుసుకోండి!

వర్షాకాలంలో పాదాల సంరక్షణ చేసుకునే పద్ధతి ఎలానో తెలుసుకోండి!

|

వర్షాకాలంలో, మన శరీరంలోని అతి ముఖ్యమైన భాగమైన పాదాలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. ఋతుపవనాలు అడుగుపెట్టినప్పటి నుండి, తేమ పెరగడం వలన పాదాల సంబంధిత రోగాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందువల్ల పాదాలకు అదనపు సంరక్షణ అందివ్వాలి. వర్షాలు మూలంగా బాక్టీరియల్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకి తామర, దురద, మంట మరియు ఎరుపుదనం రావచ్చు. అయినా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు! ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా మీ పాదాలు మృదువుగా మరియు ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

1. వర్షాకాలంలో మూసివేసినట్లు ఉండే బూట్లను తొడగకండి.

1. వర్షాకాలంలో మూసివేసినట్లు ఉండే బూట్లను తొడగకండి.

సర్ గంగా రామ్ ఆసుపత్రిలో డాక్టర్ అయిన రోహిత్ బాత్రా ఇలా అంటున్నారు, "వర్షాకాలంలో మూసివేసినట్లు ఉండే బూట్లు మీ పాదాలపై తేమను పెంచుతాయి. మీ పాదాలు, శిలీంధ్ర పెరుగుదలకు అనువుగా మారతాయి. కనుక, మీ వేళ్ళు బయటకు ఉండేవిధంగా ఉన్న పాదరక్షలు ధరించడం వలన గాలి సరిగ్గా ప్రసరించి ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి."

2. మీ బూట్లను పొడిగా ఉంచుకోండి.

2. మీ బూట్లను పొడిగా ఉంచుకోండి.

తరచుగా, వర్షాకాలంలో వర్షం పడిన తరువాత నేలంతా బురదగా, తడిగా ఉంటుంది. ఈ ప్రదేశాలలో నడవడం వలన మీ బోర్లు తడుస్తాయి. తడి బూట్లను ఎప్పుడూ ధరించరాదు! మీరు రాత్రిపూట మీ బూట్లు ఎండబెట్టండి. అవి పూర్తిగా ఆరాయని నిర్ధారించుకున్నాకే, మీరు వాటిని తిరిగి ఉపయోగించండి. నిజానికి, మీరు వాటిని ఎండలో ఉంచినట్లయితే, ఎండలో ఉండే UV కిరణాలు బ్యాక్టీరియాను నాశనం చేసి ప్రయోజనాన్ని అందిస్తాయి.

3. మీ పాదాలను శుభ్రంగా ఉంచుకోండి

3. మీ పాదాలను శుభ్రంగా ఉంచుకోండి

ఆరోగ్యకరమైన, ఫంగస్ సోకని మరియు పరిశుభ్రమైన పాదాలను కలిగి ఉండటం ముఖ్యం. మీరు ప్రతిరోజు బయటకు వెళ్లి వచ్చిన ప్రతిసారి పాదాలను కడుక్కోవటాన్ని అలవాటుగా మార్చుకోవడం ద్వారా పాదాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. గోరువెచ్చని నీటిలో క్రిమినాశక ద్రవాన్ని కలిపి, అందులో మీ పాదాలను కనీసం 10 నిముషాల పాటు నాననిచ్చి, యాంటీ-బ్యాక్టీరియల్ సబ్బుతో బాగా కడుక్కోవాలి. తరువాత పొడిగా తుడుచుకోండి.

4. టాల్కమ్ పౌడర్

4. టాల్కమ్ పౌడర్

మీరు బయటకు వెళ్లే ముందు, మీ పాదాలను ఒక పొడి టవల్ తో తుడుచుకుని, కొంచెం టాల్కమ్ పౌడర్ ను రాసుకోండి. తరువాత కొద్దిసేపు గాలిలో మీ పాదాలని ఆరనివ్వండి. అప్పుడు సాక్స్ ధరించండి మరియు బయటకు వెళ్లండి. మీకు పాదాల దుర్వాసన సమస్య ఉంటే, టాల్కమ్ పౌడర్ టి పాటు కర్పూరం కలిపి ఉపయోగించాలి, తరువాత సాక్స్ లేదా బూట్లు ధరించాలి.

5. పాదాలపై మృతచర్మకణాలను తొలగించాలి

5. పాదాలపై మృతచర్మకణాలను తొలగించాలి

"ఎల్లప్పుడూ స్నానం చేస్తున్నప్పుడు, మీ పాదాలపై మృతచర్మకణాలను తొలగించండి. వర్షాకాలంలో మీ పాదాల సంరక్షణ చిట్కాలలో ఇది ముఖ్యమైనది. మృతచర్మకణాలను సులభంగా తొలగించడానికి, సాధారణ నీరు లేదా గోరు వెచ్చని నీటిలో పాదాలను నానబెట్టడం మంచిది. మంచి ఫలితాల కొరకు ఈ నీటిలో షాంపూను కలపి, 5-10 నిమిషాల పాటు, మీ పాదాలని అందులో నానబెట్టండి. చివరికి ప్యూమిక్ రాయిని ఉపయోగించండి "అని న్యూఢిల్లీలోని డెర్మవర్ల్డ్ స్కిన్ & హెయిర్ క్లినిక్, డాక్టర్ నేహా మిట్టల్ చెప్పారు.

6. మీ పాదరక్షలను శుభ్రపరచుకోండి.

6. మీ పాదరక్షలను శుభ్రపరచుకోండి.

ఇంటికి వచ్చిన తర్వాత, ముఖ్యంగా వర్షం పడుతున్నప్పుడు, ఎప్పుడూ మీ చెప్పులు, మరియు బూట్లను యాంటీ బాక్టీరియల్ నీటిలో కడగండి. తరువాత వాటిని గాలి సోకే ప్రదేశంలో ఆరనివ్వండి.

7. పాదాలకు తేమను అందివ్వండి.

7. పాదాలకు తేమను అందివ్వండి.

ప్రతిరోజు మీ పాదాలకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అవి పగుకపోయినా లేదా పొడిగా లేనప్పటికీ, వర్షాకాలంలో మీ పాదాలకు మాయిశ్చరైజర్ రాస్తూనే ఉండాలి. మృదువైన పాదాలను పొందాలనుకునేవారు, బాదం నూనె లేదా ఆలివ్ నూనెతో పాదాలను మసాజ్ చేసుకోవచ్చు.

English summary

Keep your feet clean to prevent bacteria

During the rainy season, we often tend to neglect the most important part of our body, which is our feet. In monsoon, humidity increases the chances of foot-related ailments, which is why one needs to take extra care of them.
Desktop Bottom Promotion