For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ హోలీలో చర్మసంరక్షణకై కొన్ని నూతన మరియు సృజనాత్మక మార్గాలు

హొలీ పండుగ అనేది రంగుల ప్రపంచాన్ని మన ముందుంచుతుంది. రోజువారీ బిజీ షెడ్యూల్స్ లో రొటీన్ తో విసిగిపోతున్న మన లైఫ్ లో రంగులను జోడిస్తుంది. ఆశకి అలాగే పాజిటివిటీకి చిహ్నంగా ఈ పండుగను పేర్కొంటారు.

|

హొలీ పండుగ అనేది రంగుల ప్రపంచాన్ని మన ముందుంచుతుంది. రోజువారీ బిజీ షెడ్యూల్స్ లో రొటీన్ తో విసిగిపోతున్న మన లైఫ్ లో రంగులను జోడిస్తుంది. ఆశకి అలాగే పాజిటివిటీకి చిహ్నంగా ఈ పండుగను పేర్కొంటారు. మనమందరం ఎంతగానో ఎదురుచూస్తున్న హొలీ పండుగ రానే వస్తోంది. మరి ఈ పండుగ రోజున సంతోషంగా రంగులతో ఆడుకుంటూ అదే సమయంలో చర్మ సంరక్షణ విషయంలో నిర్లక్ష్యం పాటించకపోతే ఆనందం మన సొంతమే కదా.

ఈ పండుగ అనేది అంతులేని అందాన్నిస్తూ నవ్యరంభాన్ని సూచిస్తుంది. అదే సమయంలో కొన్ని కొత్త సమస్యలను కూడా తీసుకువస్తుంది. అదేనండి, చర్మ సమస్యల గురించి మేం మాట్లాడుతున్నాం.

pre and

హొలీ పండుగనాడు వాడే రంగులనేవి అలర్జీలను కలిగించేవి. వీటి వలన స్కిన్ ఇరిటేషన్స్ ఏర్పడతాయి. ఈ వాస్తవాన్ని గమనించి అందుకు తగిన కేర్ ను మనం తీసుకోవాలి. చాలా మంది ఆర్గానిక్ మరియు బెస్ట్ క్వాలిటీ కలర్స్ ను వాడతారు. అయితే, ప్రతి ఒక్కరూ అలాగే వాడతారని మనం భావించలేము. మీకు కలర్స్ అప్లై చేసే వారు అదే పద్దతిని పాటిస్తారని ఆశించలేము.

అందువలన, సున్నితమైన మన చర్మాన్ని అటువంటి కఠినమైన టాక్సిక్ కెమికల్స్ నుంచి సంరక్షించుకోవడం మన బాధ్యత. ఇది వినడానికి రాకెట్ సైన్స్ లా వినిపించినా పాటించడం చాలా సులువు. హోలీనాడు ఈ ఎనిమిది ప్రికాషనరీ మెజర్స్ ను పాటించడం ద్వారా పండుగ ఆనందాన్ని మిస్ కాకుండా సంపూర్ణంగా ఆస్వాదిస్తూ చర్మ సంరక్షణని కూడా పెంపొందించుకోవచ్చు.

1. చర్మాన్ని వస్త్రాలతో పూర్తిగా కవర్ చేసుకోండి:

1. చర్మాన్ని వస్త్రాలతో పూర్తిగా కవర్ చేసుకోండి:

ఫుల్ స్లీవ్డ్ సల్వార్ కమీజ్ లేదా చుడీదార్లను ధరించండి. (పురుషులైతే ఫుల్ స్లీవ్డ్ షర్ట్స్ ను ధరించండి. పాత డెనిమ్స్ తో మ్యాచ్ చేయండి.) దీని ద్వారా చర్మం హానికర కెమికల్ రంగులకు ఎక్స్పోస్ కాదు. ఇలా చేయడం ద్వారా చర్మానికి కలిగే నష్టాన్ని కొంతవరకూ తగ్గించుకోవచ్చు.

2. తగినంత నీటిని తాగండి:

2. తగినంత నీటిని తాగండి:

డీహైడ్రేషన్ వలన చర్మం పొడిబారుతుంది. ఇలా జరిగినప్పుడు హానికర కెమికల్స్ బారిన చర్మం పడితే, ఈ కలర్స్ అనేవి చర్మం లోతులోకి ప్రవేశించే అవకాశం కలదు. పొడిబారిన చర్మంలో పగుళ్లు ఏర్పడతాయి కాబట్టి, చర్మంలోకి కెమికల్స్ సులభంగా ప్రవేశిస్తాయి. దీని వలన చర్మానికి సాధారణంగా ఎక్స్పెక్ట్ చేసినదానికంటే ఎక్కువ హానీ కలగవచ్చు. వీటన్నిటినీ అవాయిడ్ చేయాలంటే, మీరు తగినంత నీటిని లేదా ఫ్రెష్ జ్యూస్ లను తీసుకోవాలి. రోజంతా హైడ్రేటెడ్ గా ఉండేందుకు జాగ్రత్త పడాలి.

3. చర్మాన్ని అలాగే పెదవులను మాయిశ్చరైజ్ చేసుకోండి:

3. చర్మాన్ని అలాగే పెదవులను మాయిశ్చరైజ్ చేసుకోండి:

చర్మంతో పాటు పెదాలనేవి శరీరంలోని మిగతా భాగాల కంటే అత్యంత సున్నితమైన ప్రాంతాలు. ఫ్లూయిడ్స్ ని తగిన మోతాదులో తీసుకుంటూ శరీరానికి తగినంత రెస్ట్ ఇస్తే శరీరంలోని మిగతా భాగాలకు మంచిదే. అయితే, చెవులకు అలాగే పెదాలకు మీరు మరింత శ్రద్ధ చూపించాలి. అందువలన, పెట్రోలియం జెల్లీని చెవులపై అప్లై చేయండి. గుర్తుంచుకోండి, పొడి చర్మం వలన పోర్స్ ఓపెన్ అవుతాయి, దీని వలన హానికర కెమికల్స్ చర్మానికి మరింత హానీని కలిగిస్తాయి. అందువలన, పెదాలపై లిప్ బామ్ ను అప్లై చేయడం మరవకండి.

4. సన్ గ్లాసెస్ ని వాడండి:

4. సన్ గ్లాసెస్ ని వాడండి:

సన్ గ్లాసెస్ అనేవి ట్రెండ్ ను ఫాలో అవడానికే కాదు కంటి రక్షణకు కూడా ఉపయోగకరంగా ఉంటాయి. కళ్ళను రంగులలో లభించే కెమికల్స్ నుంచి రక్షించేందుకు సన్ గ్లాసెస్ ఉపయోగపడతాయి. ఒకవేళ, కళ్ళతో కెమికల్స్ కాంటాక్ట్ లోకి రాకపోయినా మీరు వెంటనే మీ కళ్ళను చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోండి. ఇలా చేయకపోతే కళ్ళు ఎర్రబడతాయి. ఇరిటేషన్ కి కూడా గురవుతాయి. కొన్ని సందర్భాలలో, అలర్జీలు రావచ్చు.

5. తడికి దూరంగా ఉండండి:

5. తడికి దూరంగా ఉండండి:

తడిబట్టలలో ఎక్కువసేపు ఉండకండి. అలా ఉండటం వలన అలర్జీలతో పాటు ఎన్నో అసౌకర్యాలు తలెత్తుతాయి. హొలీ ని చర్మానికి హానికరం కానటువంటి పదార్థాలతో ఆడటానికి ప్రయత్నించండి. పెరుగుని వాడవచ్చు. పెరుగుని ముఖానికి రెండువైపులా అప్లై చేసుకోవచ్చు. కలర్ ఫేడ్ అయినా చర్మానికి మాయిశ్చర్ అందుతుంది.

6. సన్ స్క్రీన్ ని అప్లై చేయండి:

6. సన్ స్క్రీన్ ని అప్లై చేయండి:

హొలీని సన్ స్క్రీన్ ని ఉపయోగించకుండా ఆడవద్దు. హోలీని ఎక్కువసేపు ఆడితే సన్ స్క్రీన్ ని ప్రతి రెండుగంటలకీ ఒక సారి అప్లై చేయండి. అలాగే, మీరు వాడే సన్ స్క్రీన్ లోషన్లో SPF అనేది 25 కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోండి. దీని వలన మీ సహజ రంగుని మీరు కోల్పోకుండా జాగ్రత్త పడవచ్చు. లేదంటే మీ సహజరంగుకంటే మీరు 2 షేడ్స్ డార్కర్ గా మారే ఆస్కారం ఉంది.

7. రంగులను తొలగించండి:

7. రంగులను తొలగించండి:

రంగులతో ఆడటం ముగిసాక ఆ రంగులను తొలగించుకోవడం ముఖ్యమన్న విషయం గుర్తుంచుకోండి. ఇలా చేయడం వలన చర్మానికి కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఈ విషయంలో బద్ధకాన్ని ప్రదర్శించకండి. రంగులు తడిగా ఉన్నప్పుడే వాటిని తొలగించండి. లేదంటే, వాటిని తొలగించడం కష్టతరంగా మారుతుంది.

8. పోస్ట్ బాత్ కేర్:

8. పోస్ట్ బాత్ కేర్:

హొలీ పండుగని ఆస్వాదించిన తరువాత స్నానం చేయండి. ఆ తరువాత శరీరంపైనుంచి రంగులన్నీ తొలగినట్లు నిర్ధారించుకోండి. లేదంటే ఆయా బాడీ పార్ట్స్ పై మాయిశ్చరైజర్ ను అప్లై చేయండి. అప్పుడు, రంగులను తొలగించుకోవడం సులభతరం అవుతుంది.

English summary

New and innovative ways to take care of your skin this Holi

Holi colours may cause a lot of irritation to the skin. It is important to protect your skin against these chemicals. Having a dry skin too can cause skin damage due to the Holi colours. Keeping yourself hydrated, using a sunglass, applying a sunscreen, etc., are some of the ways you can take care of you skin this Holi.
Story first published:Saturday, February 24, 2018, 12:23 [IST]
Desktop Bottom Promotion