For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉప్పు నీరు (సాల్ట్-వాటర్) వల్ల కలిగే ఆశ్చర్యకరమైన సౌందర్య ప్రయోజనాలు !

|

ఉప్పు అనేది ప్రతి ఒక్కరి కిచెన్లో కనిపించే అత్యంత సాధారణమైన పదార్థం. ఇది అనేకమైన వంటకాలలో రుచిని పెంచే కీలకమైన పదార్థంగా కూడా ఉంటుంది. ఈ సహజసిద్ధమైన ఖనిజ పదార్థము అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి అవి:- మీ శరీర బరువును తగ్గించడం, రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడం మొదలైన వంటివి. కానీ మీ అందాన్ని మెరుగుపరచడంలో ఉప్పు సహాయపడుతుందని మీకు తెలుసా ? అవును ! ఈ ఉప్పు నీరు (సాల్ట్ వాటర్) వల్ల మీ చర్మం & జుట్టు అనేక సౌందర్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి.

ఇలాంటి సౌందర్య ప్రయోజనాలు పొందడానికి మీరు సముద్రపు ఉప్పు నీటిని వాడవచ్చు (లేదా) మీరే మీ ఇంట్లో ఉప్పును & నీటిని జతచేసి ఒక మిశ్రమంగా తయారు చేయవచ్చు. ఈ నీటిని జుట్టు (లేదా) చర్మంపై బాహ్యంగా ఉపయోగించినట్లయితే మంచి ఫలితాలను పొందగలరు. దీనికి గల ప్రధాన కారణం, ఉప్పునీటిలో క్యాల్షియం, పొటాషియం, సిలికాన్, సోడియం వంటి ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

 Surprising Beauty Benefits Of Salt Water

మన సౌందర్యాన్ని మెరుగుదిద్దడంలో ఈ ఉప్పు నీటిని ఎలా భాగం చేయాలో ఇప్పుడు మనము చూద్దాం !

మొటిమల చికిత్సకు :-

మొటిమల చికిత్సకు :-

ఈ ఉప్పు నీటిలో ఉండే హీలింగ్ ప్రాపర్టీస్ మొటిమలను & పింపుల్స్ను త్వరగా నివారించడంలో మీకు బాగా సహాయపడగలదు. మీరు సముద్రతీర ప్రాంతంలో నివసించే వారైతే, మీరు నిజంగా చాలా లక్కీ ! ఒకవేళ మీరు అలా కాకపోతే గనుక, మేము మీకు ప్రత్యామ్నాయ పరిష్కారమార్గాన్ని సూచిస్తున్నాము.

ఇందుకోసం మీకు ఒక కప్పు నీరు & ఒక టేబుల్ స్పూను సముద్రపు ఉప్పు కావాలి. నీటిలో సముద్రపు ఉప్పును బాగా కరిగే వరకు కలపాలి. ఈ మిశ్రమంలో దూది పింజను మంచి ప్రభావిత ప్రాంతంలో నెమ్మదిగా అప్లై చేయండి. అలా ఆ ప్రాంతం పొడిగా మారిన తరువాత సాధారణ నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వేగవంతమైన ఫలితాలకోసం రోజులో ఒకసారి మీరు ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు.

తెగిన గాయాలకు - దెబ్బలకు :-

తెగిన గాయాలకు - దెబ్బలకు :-

ఈ సముద్రపు ఉప్పులో ఉండే యాంటీ-ఇన్ఫ్లమేషన్ ప్రాపర్టీస్ వల్ల వైద్య ప్రక్రియను మరింత వేగంగా, సులభంగా ఉండేలా చేస్తాయి. ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల మీ చర్మానికి చికాకు కలిగించే బాక్టీరియాను చంపడంతోపాటు, చర్మానికి ఉపశమనాన్ని కలుగజేయడంలో కూడా సహాయపడుతుంది.

మీ బాత్ టబ్లో ఉన్న వేడినీటిలో ఒక కప్పు సముద్రపు ఉప్పు కలపాలి. లావెండర్ (లేదా) ఇతర ముఖ్యమైన ఆయిల్స్ యొక్క కొన్ని చుక్కలను ఈ నీటిలో కలపడంవల్ల మంచి సువాసనను పొందగలరు.

ఎక్స్పోలియేటర్ :-

ఎక్స్పోలియేటర్ :-

కఠినమైన గుణాన్ని కలిగి ఉండే ఉప్పు, చర్మాన్ని మరింత మెరుగుపరచి గల ఉత్తమమైన ప్రక్రియలో ఒకటేనా ఎక్స్పోలియేషన్ ప్రక్రియకు దోహదపడేదిగా ఉంది. ఇది చనిపోయిన చర్మకణాలను తొలగించడం ద్వారా చర్మ రంధ్రాలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఇది చర్మం యొక్క రక్త ప్రసరణను మరింతగా మెరుగుపరచి, చర్మాన్ని మరింత ప్రకాశవంతంగా తయారుచేస్తుంది.

సముద్రపు ఉప్పును & నీటిని బాగా తెలిపి తయారు చేసిన మిశ్రమాన్ని మీ ముఖంపై వృత్తాకార కదలికలో స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత సాధారణ నేటి తో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇదే పద్ధతిని శరీరంపై ఉండే చర్మానికి కూడా ఉపయోగించవచ్చు. చివరిగా, మీ చర్మం ఎండిపోకుండా ఉండటం కోసం కొన్ని మాయిశ్చరైజర్లను ఉపయోగించాలి.

సముద్రపు అలలు :-

సముద్రపు అలలు :-

కర్ల్ హెయిర్ కోసం మీరు ఎలాంటి క్రీమ్స్ను & ఇతర పద్ధతులను ఉపయోగించకుండానే, బీచ్ (లేదా) సముద్ర స్నానం చేయటం వల్ల పొందగలరు. ఎందుకంటే ఈ సముద్రపు నీరులో మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది. దీనిని మీరు ఎప్సోమ్ సాల్ట్ గా కూడా పిలుస్తారు, సాధారణంగా దీనిని ప్రతి ఇంట్లో ఉపయోగిస్తారు. మీ జుట్టును కడగడం కోసం కూడా దీనిని ఉపయోగించవచ్చు.

English summary

Surprising Beauty Benefits Of Salt Water

Surprising Beauty Benefits Of Salt Water,Did you know that salt water can benefits in enhancing your beauty? Here are some of the surprising beauty benefits of salt water and how to use them in your beauty regime.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more