For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చక్కెరతో చంకలపై అనవసర వెంట్రుకలు తొలగించే పద్ధతి

|

శరీరంపై చక్కెర వాడే పద్ధతి ఒక ప్రాచీన పద్ధతి. ఇది సహజమైన హెయిర్ రిమూవల్ పద్ధతి. ఇందులో నిమ్మ, నీరు,చక్కెర కలుపుతారు, కొన్నిసార్లు మిశ్రమం మందంగా రావటానికి తేనె కూడా కలుపుతారు. ఈ పేస్టును చర్మంపై వెంట్రుకలు పెరిగే వ్యతిరేక దిశలో రాసి, మెల్లగా వెంట్రుకలతో తీసేస్తారు!

అలా చక్కెర పేస్టును వాడి, అవాంఛిత వెంట్రుకలను సులభంగా తీసేస్తారు. ఈ ప్రాచీన పద్ధతి వెంట్రుకలు పెరిగే దిశవైపునుండి పెరగకుండా తీసేసి అసౌకర్యం లేకుండా చేస్తుంది. మీ శరీరంపై ఈ సహజ వ్యాక్సింగ్ పూర్తయ్యాక,మీ గ్లోవ్స్, పేస్టును కడిగేసి మీరు మార్చుకున్న శుభ్రమైన చంకలను చూసుకోండి!

Underarm hair removal with sugar

ఈ పద్ధతి చవకగా ఉండి, అనవసర వెంట్రుకలను సులభంగా తొలగిస్తుంది. దీన్ని ఇంట్లోనే ఖరీదైన క్రీములు లేదా కఠినమైన రేజర్లు వాడకుండా సులభంగా చేసుకోవచ్చు. ఈ విషపూరితం కాని చిట్కా సున్నితమైన చర్మానికి మంచిది. ఫలితాలు ఎక్కువకాలం ఉంటాయి.

ఈ చక్కెర పద్ధతిని, వ్యాక్సింగ్ ఒకటే అని అనుకోవద్దు, ఎందుకంటే ఈ చక్కెర వ్యాక్స్ ఎక్కువ కాలం నిలుస్తుంది. మీరు శుభ్రమైన గుడ్డపట్టీలు ఈ పద్ధతిలో వాడవచ్చు. మీకు ఈ పద్ధతి చేయటం చక్కగా వచ్చేసాక, ఇతర పాత హెయిర్ రిమూవల్ పద్ధతుల జోలికి మళ్ళీ వెళ్ళరు!

కావలసిన వస్తువులు

కావలసిన వస్తువులు

చంకల్లో చర్మం రంగును ఎలా తెల్లబర్చాలి

2 కప్పుల చక్కెర

1/4వకప్పు నిమ్మరసం

1/8వ కప్పు నీళ్ళు

చిన్న పెనం

తయారీ స్టెప్స్

తయారీ స్టెప్స్

1.అన్ని కావలసిన వస్తువులు సిద్ధం చేసుకోండి ; మొదటగా అన్ని కావలసిన వస్తువులు తయారుచేసి పెట్టుకుంటే చాలు,మీరిక మొదలుపెట్టవచ్చు! మీరు ఏ రకమైన చక్కెర అయినా వాడవచ్చు. ముందుగానే తీసిపెట్టిన లేదా ప్యాకేజీ చేయబడ్డ నిమ్మరసాన్ని వాడవచ్చు. ఇంట్లో నిల్వ చేసినది వాడవచ్చు కానీ పచ్చిది, తాజా రసం అయితే చాలా మంచిది!

2.పేస్టు తయారుచేసుకోండి ;

2.పేస్టు తయారుచేసుకోండి ;

అన్ని వస్తువులు ఎంత కావాలో కొలిచి, పెనంలో వేయండి. నీళ్ళు, చక్కెర కూడా వేయండి. ఆఖరుగా నిమ్మరసం కూడా వేసి, అన్నీ కరిగేదాకా ఆగండి. పెనం నాన్ స్టిక్ ది అయితే మంచిది మరియు రబ్బర్ గరిటెను వాడండి.

3.దాని మీద దృష్టిపెట్టండి ;

3.దాని మీద దృష్టిపెట్టండి ;

మీ దగ్గర వంట/క్యాండీ థర్మామీటర్ ఉంటే చాలా సాయపడుతుంది. దాన్ని మీ పెనానికి అంటివుండేలా చేసి దానిపై ఒక కన్నేసి ఉంచండి. థర్మామీటర్ పై 240 డిగ్రీల ఫారన్ హీట్ చూపగానే, స్టవ్ కట్టేయండి. కొన్నిసార్లు టెంపరేచర్ వాతావరణాన్ని బట్టి మారుతుంటుంది. ఈ టెంపరేచర్ పొడి మరియు కాస్త తేమ ఉన్న వాతావరణానికి సరిపోతుంది.

4.చక్కెర రంగును పరిశీలించటం ;

4.చక్కెర రంగును పరిశీలించటం ;

చక్కెర పేస్టు సమయంతో పాటు రంగులు మారుతుంటుంది. మెరూన్ లేదా గాఢ ఎరుపు రంగులో ఉండవచ్చు. గది ఉష్ణోగ్రతలో ఈ మిశ్రమం మెత్తగానే ఉండాలి. మీ దగ్గర గౌర్ గమ్ ఉంటే,ఈ పేస్టుకి దాన్ని జతచేసి కలపండి. దీనివలన పేస్టు ఎక్కువ కాలం నిలిచివుండి, మిశ్రమం కూడా మెరుగుపడుతుంది.

5.పేస్టును నిల్వకి తీయడం ;

5.పేస్టును నిల్వకి తీయడం ;

ఈ తయారయిన పేస్టును ఒక డబ్బాలో పోసుకోండి, మరీ వేడిగా ఉన్నప్పుడు మాత్రం అప్పుడే వద్దు. లేకపోతే డబ్బా విరిగిపోయి, పేస్టు బయటకి కారిపోతుంది. మిశ్రమాన్ని కొన్ని గంటలపాటు చల్లబర్చండి. మీరు భరించగలిగే వేడిలో ఉన్నప్పుడే చర్మంపై రాసుకోండి.

6.కావాల్సిన చోట వాడండి ;

6.కావాల్సిన చోట వాడండి ;

తక్కువ గాఢత కలిగిన, విషపదార్థం కాని మిశ్రమాన్ని హెయిర్ రిమూవల్ కోసం తయారుచేయటం వలన మీరు శరీరంపై ఎలాంటి చోటయినా వాడగలిగే అవకాశం కలుగుతుంది. ఇది కేవలం చంకలకే కాదు, చేతులు,కాళ్ళు, పొత్తికడుపు వద్ద వాడుకోవచ్చు. కొంతమంది ముఖంపై కూడా వాడి, మొహంపై ఉన్న అవాంఛిత వెంట్రుకలను ఇంట్లోనే తొలగించుకుంటారు! మీరు నొప్పిని తట్టుకోగలిగితే, సమయంతో పాటు వెంట్రుకల పెరుగుదల తగ్గుతుంది.

 7.చర్మాన్ని తయారుచేయండి ;

7.చర్మాన్ని తయారుచేయండి ;

ఈ స్టెప్ కి వచ్చాక మీరు చర్మం ఈ పద్ధతికి తయారుగా ఉందో లేదో పరిశీలిస్తారు. కొన్నిసార్లు మనమే తయారుచేసుకోగలిగే చిట్కాలంటే మనం ఆతృత పడతాం, తర్వాత సమయంతోపాటు కష్టమవుతాయని తెలుసుకుంటాం. ఈ చక్కెర పద్ధతి స్నానం తర్వాత చేస్తే చాలామంచిది. అందుకని ముందుగా స్నానం చేసి మొదలుపెట్టండి. చర్మం అప్పుడు తేమగా ఉండి, మీ శరీరంపై చక్కెర అతుక్కోదు.

8.శుభ్రపరిచి, మీ చర్మాన్ని పొడిగా ఉండేలా చూసుకోండి ;

8.శుభ్రపరిచి, మీ చర్మాన్ని పొడిగా ఉండేలా చూసుకోండి ;

వ్యాక్సింగ్ మొదలుపెట్టేముందు టాల్కం/బేబీ పౌడర్ చర్మంపై రాయండి. దీనివలన చక్కెర వెంట్రుకలకి అతుక్కుంటుంది. పేస్టును తీసి చర్మం అంతా రాయండి.

9. స్టెచ్ చేయండి ;

9. స్టెచ్ చేయండి ;

వెంట్రుకలు పెరిగే దిశకి వ్యతిరేకంగా పేస్టును రాసి వెంట్రుకలను తీయండి. వెంట్రుకలు చిన్నగా ఉన్నప్పుడు చక్కెర బాగా పనిచేస్తుంది. అందుకని కత్తెరతో వెంట్రుకలను ట్రిమ్ చేయండి. అప్పుడు ఫలితం బాగుంటుంది. వ్యాక్సింగ్ పేస్టు రాసాక, కొద్దిసేపు ఆగితే అది చర్మరంథ్రాలలోకి ఇంకుతుంది.

10.ఇంకొంచెం చక్కెర పద్ధతి పాటించండి ;

10.ఇంకొంచెం చక్కెర పద్ధతి పాటించండి ;

వ్యాక్సింగ్ లాగా కాక, మీరు శరీరంపై చక్కెర పద్ధతిని మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉండండి. దీనివలన చేత్తో రుద్దినా నొప్పి మెల్లగా తగ్గిపోతుంది. ఇలా రుద్దటం వలన నొప్పి తగ్గిపోయి శరీరం మృదువుగా మారుతుంది.

English summary

Underarm hair removal with sugar

Body sugaring is a form of ancient art, which includes hair removal in the most natural process, you could have thought of. It includes the amalgamation of lemon, water and sugar, and sometimes honey to make it thicker. The paste has to be molded to skin on the opposite direction from hair growth and then swiftly flicked off!
Story first published:Thursday, May 3, 2018, 11:04 [IST]
Desktop Bottom Promotion