For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్మోకింగ్ వల్ల చర్మానికి మరియు జుట్టుకు కలిగే హాని

|

ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఇది శరీరాన్ని, మనసును మాత్రమే కాకుండా, మీ అందానికి కూడా ఊహకు అందని నష్టాన్ని కలుగజేస్తుంది. క్రమంగా ఈ ధూమపానం, మీ రూపురేఖలు మరియు మీ లుక్ ని పూర్తిగా మార్చివేయగలదు.

ధూమపానానికి అలవాటు పడిన వ్యక్తి. దాని నుండి బయటకు రావడం కూడా కష్టంగానే ఉంటుంది. మనిషిని సమూలంగా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వ్యసనం ధూమపానం. కానీ విచారకర౦గా, మన దైనందిక జీవనశైలిలో భాగంగా ప్రత్యక్ష మరియు పరోక్ష ధూమపానం అనేది సర్వసాధారణమైపోయిన అంశంగా తయారవుతూ ఉంది. ముఖ్యంగా ధూమపానం మన ఆరోగ్యం మీదమాత్రమే కాకుండా, మన అందం మీద కూడా హానికర ప్రభావాలను చూపుతూ, క్రమంగా ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. సకాలంలో గుర్తించని ఎడల, ఇది మానసిక స్థాయిలను ప్రభావితం చేస్తూ, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలకు కారణంగా మారుతుంది.

 స్మోకింగ్ వల్ల చర్మానికి మరియు జుట్టుకు కలిగే హాని

పొగతాగడం అనేది మీ వయస్సు కన్నా, పెద్దవారిలా కనిపించేలా చేయగల ఒక అసాధారణమైన అలవాటు. ఇది అకాల వృద్ధాప్య ఛాయలు, మొటిమలు, జుట్టు రాలడం, దంతక్షయం వంటి తీవ్ర పరిస్థితులకు దారితీస్తుంది. ఇలా చెప్తూ పొతే, ధూమపానం మూలంగా చెప్పుకోదగిన ఉపయోగమంటూ లేకపోగా, శరీరాన్ని సమూలంగా నాశనం చేయగల నష్టాలు మాత్రం కోకొల్లలు. పొగతాగడం మీ అందం పట్ల తీవ్రమైన మరియు దీర్ఘకాలిక ప్రభావాలను కలిగి ఉంటుంది.

ఈ వ్యాసంలో, మేము మీ చర్మ సౌందర్యం, ఆరోగ్యం మరియు లుక్స్ మీద ధూమపానం చేసే హానికరమైన ప్రభావాల మీద దృష్టి సారించాం. క్రమంగా ఒక అడుగు వెనక్కి వేసి, పొగతాగడాన్ని విడిచిపెట్టి, ఆరోగ్యవంతమైన జీవనశైలి దిశగా ముందుకు సాగేందుకు ఈ వ్యాసం కొంతమేరైనా స్పూర్తిని అందివ్వగలదని ఆశిస్తున్నాం.

1. అకాల వృద్దాప్య ఛాయలు :

1. అకాల వృద్దాప్య ఛాయలు :

ధూమపానం మూలంగా అకాల వృద్దాప్య ఛాయలు ఎదుర్కోవడంలో మీ చర్మం మొదటి స్థానంలో ఉంటుంది. క్రమంగా మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నప్పుడు, ఈ ఏజింగ్ గమనించగలరు. మరియు పొగతాగడం ఈ ప్రక్రియ మీద అసాధారణ ప్రభావాలను చూపుతుంది. క్రమం తప్పకుండా ధూమపానాన్ని అనుసరించడమనేది, మీ చర్మం మీద పెను ప్రభావాన్ని చూపుతుంది. ధూమపానానికి బానిసైన వారు తమ వయసు కన్నా, పెద్దవారిగా కనిపిస్తారని సాధారణ పరిశీలనలో అందరికీ తెలిసిన విషయమే.

సిగరెట్లో ఉండే నికోటిన్ మీ చర్మానికి రక్తం ప్రవాహాన్ని దారుణంగా తగ్గిస్తుంది. క్రమంగా మీ చర్మానికి తగినంత ఆక్సిజన్ మరియు పోషకాలు అందక, స్కిన్ ఏజింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ఎక్కువసేపు లేదా క్రమంతప్పకుండా స్మోకింగ్ చేసే అలవాటు ఉన్నవారు అనతికాలంలోనే తమ నోటి చుట్టూ, మరియు కళ్ల చుట్టూ ముడతలను చూడవచ్చు. ధూమపానం చేస్తున్నప్పుడు మీ పెదాలతో స్థిరంగా పొగ పీల్చడం మూలంగా నోటి చుట్టూ ముడతలు వచ్చేందుకు, కారణంగా మారుతుందని చెప్పబడుతుంది. మరియు నిశితంగా పరిశీలిస్తే, మీ బాహువుల లోపలి భాగాలలో కూడా ముడుతలు కనపడడం జరుగుతుంది.

అయినప్పటికీ, ఈ బాహువుల దగ్గర సమస్య, నెలలు లేదా సంవత్సరాల ధూమపానం తర్వాత కనపడడం జరుగుతుంటుంది. ఏదిఏమైనా మీ చర్మంపై ధూమపానం ప్రభావం, మీ చర్మాన్ని పునర్నిర్మించలేని స్థాయికి తీసుకుని వెళ్తుంది అన్నమాట వాస్తవం.

2. మొటిమలు, బ్రేకౌట్ :

2. మొటిమలు, బ్రేకౌట్ :

ధూమపాన వ్యసనానికి గురైనవారు అధికంగా మొటిమలతో బాధపడే అవకాశం ఉంది. ధూమపానం, చర్మం యొక్క సెబం విసర్జనను పెంచుతుంది. మరియు విటమిన్ ఇ లెవల్స్ తగ్గిస్తుంది. చర్మంలో ఉత్పత్తి అయ్యే అదనపు సెబం, మీ చర్మ రంద్రాలు మూసుకుపోయేలా చేస్తుంది. మరియు మొటిమలు, అందులోనూ ప్రధానంగా వాపుతో కూడిన మొటిమలు మరియు చర్మం పగుళ్ళకు దారితీస్తుంది. విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి చర్మాన్ని రక్షిస్తుంది. తద్వారా విటమిన్ ఇ లెవల్స్ తగ్గడం మూలంగా మన చర్మ రక్షణపై ప్రభావం పడి, క్రమంగా మొటిమలకు దారితీస్తుంది.

 3. ముదురు రంగులోకి పెదాలు మారడం :

3. ముదురు రంగులోకి పెదాలు మారడం :

ధూమపానం మూలంగా ఎదురయ్యే దుష్ప్రభావాలలో మరో ప్రధానమైన సమస్య, పెదాల రంగు ముదురు నలుపులోకి మారడం. నిరంతరం నికోటిన్ ప్రభావానికి గురికావడం మూలంగా, పెదాల రంగు మారడమనేది ఖచ్చితం. మీరు రెగ్యులర్ గా స్మోక్ చేస్తూ ఉంటే, మీ పెదాల రంగు క్రమంగా ఫేడ్ అవుతుంది, ఇది ముదిరిన మరియు పగిలిన పెదాలకు దారితీస్తుంది. మీ చర్మానికి స్థిరమైన వేడిని అందివ్వడంతోపాటుగా, బలహీన రక్తప్రవాహానికి కూడా ధూమపానం కారణమవుతుంది.

 4. డార్క్ సర్కిల్స్ (కంటి కింద నల్లటి వలయాలు) :

4. డార్క్ సర్కిల్స్ (కంటి కింద నల్లటి వలయాలు) :

డార్క్ సర్కిల్స్ సమస్యకు సాధారణంగా నిద్ర లోపించడంతో మాత్రమే సంబంధం ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తూ అన్ని వేళలా అదే కారణం కాబోదు. కొన్ని కోరితెచ్చుకున్న సమస్యలు కూడా కొన్ని పరిస్థితులకు కారణంగా మారుతాయి. ఉదాహరణకు మన రోజువారీ అలవాట్లు, రేడియేషన్ ప్రభావాలు, సూర్యతాపం మొదలైనవి డార్క్ సర్కిల్స్ సమస్యకు దారితీస్తుంది. అదే క్రమంలో భాగంగా ధూమపానం కూడా ప్రభావితం చేస్తుంది.

పొగతాగడం మూలంగా చర్మానికి రక్తప్రసరణ సజావుగా సాగదు. క్రమంగా చర్మానికి అవసరమైన పోషకాలు అందవు. ఫలితంగా చర్మం పలుచగా మారుతుంది. అంతేకాకుండా కంటి కింద ఏర్పడే సంచులు, మరియు డార్క్ సర్కిల్స్ పెద్దవిగా కనపడడం ప్రారంభిస్తాయి. ధూమపానం మీ చర్మాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. క్రమంగా నీటిస్థాయిలు అసాధారణంగా తగ్గడం కూడా ఈ డార్క్ సర్కిల్స్ సమస్యకు కారణంగా ఉంటుంది.

 5. చర్మం వదులుగా మారడం :

5. చర్మం వదులుగా మారడం :

స్థిరమైన ధూమపానం చేసేవారు అనతికాలంలోనే చర్మం సాగడం గమనించవచ్చు. ధూమపానమనేది, చర్మం యొక్క కొల్లాజెన్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కొల్లాజన్ అనేది చర్మం స్థితిస్థాపకతకు బాధ్యత వహించే ప్రోటీన్ గా చెప్పబడుతుంది. అందువలన, కొల్లాజెన్ తగ్గడం మూలంగా చర్మం స్థితిస్థాపకత మీద ప్రభావం చూపి, మీ చర్మం వదులుగా మారడానికి కారణమవుతుంది.

మీరు ఆరోగ్యంగా యవ్వనంగా ఉండే చర్మాన్ని నిర్వహించాలని భావిస్తున్న ఎడల, ధూమపానానికి స్వస్థి చెప్పడం ఉత్తమం.

 6. వేళ్ళు పసుపు రంగులోకి :

6. వేళ్ళు పసుపు రంగులోకి :

పొగతాగడం మీ చేతి వేళ్ల మీద కూడా తీవ్ర ప్రభావాన్ని చూపగలవు. క్రమంగా చేతుల మీద మరకలు పడినట్లుగా కనిపిస్తుంటాయి. నిజానికి పొగతాగేవారిలో వేళ్లు రంగుమారడమనేది, సర్వసాధారణమైన అంశంగా ఉంటుంది. సిగరెట్లో ఉండే పొగాకు మూలంగా, చర్మం ఇలా మరకల బారిన పడుతుంది. తద్వారా మీ వేళ్లు పసుపు రంగులోకి మారుతాయి. మీ వేళ్ల మద్య సిగెరట్ ఉన్నప్పుడు, వాటిని పరిశీలించండి. అవి ఖచ్చితంగా రంగు మారడాన్ని గమనించగలరు. ఇవి మీ వేళ్లను మాత్రమే కాకుండా, మీ గోళ్ళలో కూడా మరకలకు కారణంగా మారుతాయి. కాబట్టి, మీరు మీ అలవాటు గురించి పునరాలోచించవలసి ఉంటుందని గుర్తుంచుకోండి.

7. జుట్టు రాలడం :

7. జుట్టు రాలడం :

మీ చర్మం మాత్రమే కాదు, ధూమపానం మీ జుట్టు మీద కూడా హానికరమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మీరు తరచుగా ధూమపానానికి గురవుతూ ఉంటే, మీకు ఎదురయ్యే జుట్టు సమస్యల్లో హెయిర్ ఫాల్ కూడా ఒకటి.

పొగాకులో ఉండే విషతుల్య రసాయనాలు మీ జుట్టు కుదుళ్ళకు హాని కలిగిస్తాయి, తద్వారా జుట్టు రాలడానికి దారితీస్తుంది. అలాగే పొగత్రాగడం మూలంగా రక్తనాళాలు దెబ్బతినడంతో పాటుగా రక్త ప్రసరణ బలహీన పడుతుంది. జుట్టు రాలడానికి దారితీసే కారణాల్లో ఇది కూడా ఒకటి.

 8. జుట్టు నష్టం :

8. జుట్టు నష్టం :

ధూమపానం జుట్టు నష్టానికి దారితీస్తుంది. తరచుగా ధూమపానానికి గురవడం మూలంగా, మీ జుట్టు పొడిగా, పెళుసుగా మరియు నిస్తేజంగా మారడానికి కారణమవుతుంది. రక్తనాళాలు తగ్గిపోతున్న కారణంగా మీ తల చర్మంలో రక్తప్రసరణ మీద ప్రభావం చూపుతుంది. మీ తలపై చర్మం, మరియు జుట్టుకు, అవసరమైన పోషణ లభించదు. మరియు ఇదిజుట్టు నష్టానికి దారితీస్తుంది. కావున, ధూమపానానికి దూరంగా ఉండడమే మేలని సూచించబడుతుంది.

 9. ముందస్తు వృద్దాప్య చాయలు (తెల్ల వెంట్రుకలకు కారణంగా ) :

9. ముందస్తు వృద్దాప్య చాయలు (తెల్ల వెంట్రుకలకు కారణంగా ) :

మీరు ధూమపానానికి బానిసగా ఉన్నట్లయితే, మీరు ఎదుర్కొనే మరొక జుట్టు సమస్యగా తెల్ల జుట్టు ఉంటుంది. నిత్యం పొగ తాగే వ్యక్తులు 30 ఏళ్ల కంటే ముందే, తెల్ల జుట్టును ఎదుర్కొనే అవకాశం ఉందని పరిశోధనలో కూడా తేలింది.

ధూమపానం ఫ్రీరాడికల్స్ ను ఉత్పత్తి చేస్తుందని మరియు మెలనిన్ ఉత్పత్తి చేసే కణాలను దెబ్బతీస్తుందనే వాస్తవాన్ని దీనికి ఆపాదించవచ్చు. మెలనిన్ అనేది మీ జుట్టు రంగుకు బాధ్యత వహించే పిగ్మెంట్, క్రమంగా మెలనిన్ ఉత్పత్తి తగ్గుదల బూడిద రంగు జుట్టుకు దారితీస్తుంది.

 10. పంటి మరకలు :

10. పంటి మరకలు :

ఇప్పుడు మళ్ళీ మరకల గురించిన అంశం. ధూమపానం, మీ వేళ్ళు, గోళ్ళనే కాకుండా మీ దంతాలకు కూడా మరకలు ఏర్పడడానికి బాధ్యత వహిస్తుంది. పొగాకు మన వేళ్లను మాత్రమే కాకుండా, మీ దంతాలను కూడా ప్రభావితం చేయగలదని చెప్పబడింది. ధూమపానం, మీ దంతాలను పసుపు రంగులోకి మార్చడానికే కాకుండా, మీ చిగుళ్ళ మీద కూడా పెను ప్రభావాన్ని చూపుతుంది. దంతక్షయం, దంతాలు ఊడిపోవడం మరియు చెడు శ్వాసకు కూడా కారణం కావచ్చు.

పైవన్నీ మీకు ధూమపానం అనే వ్యసనం మీ శరీరానికి, మీ చర్మ సౌందర్యానికి ఎంత హానికరంగా ఉంటుందో, మీకొక అవగాహన తెచ్చిందనే మేము భావిస్తున్నాం. క్రమంగా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుని, ఒక దృఢ సంకల్పంతో ధూమపానానికి గుడ్బై చెప్పండి. చర్మం మరియు జుట్టు సౌందర్యానికి సంబంధించిన సమస్యలే ఇన్ని రకాలుగా ఉంటే, ఇక శారీరిక మానసిక సమస్యలపరంగా జాబితా వేస్తే ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Effects Of Smoking On Skin And Hair

Smoking is a habit as bad it can get. How bad smoking is for your health is no secret. But, it is also damages your beauty. Smoking can ruin your looks like no other.
Desktop Bottom Promotion