Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
పొడిబారిన, రఫ్ గా ఉన్న, పాదాల పగుళ్ళ నివారించడానికి కాఫీ పౌడర్
పొడిబారిన, రఫ్ గా ఉన్న, పాదాల పగుళ్ళ నివారించడానికి కాఫీ పౌడర్
పాదాల పగుళ్ళు ప్రతి ఒక్కరికీ తీవ్రమైన సమస్య. సౌందర్య సంరక్షణలో పాదాల రక్షణ కూడా ఒకటి అనడం ఎటువంటి సందేహం లేదు. అయితే దీనిని ఎదుర్కోవడానికి లేపనాలు మరియు క్రీములు ఉపయోగించేవారు చాలా మంది ఉన్నారు. పాదాల పగుళ్ళను నివారించకోవాలంటే కొంచెం శ్రద్ద పెట్టడం చాలా అవసరం. అందుకు కొన్ని శాస్వత పరిష్కారమార్గాలున్నాయి.
పాదాల పగుళ్ళ సమస్యతో బాధపడుతున్న వారు దీన్ని త్వరగా పరిష్కరించుకోవాలి. పాదాలు అందం సంరక్షణలో భాగం మాత్రమే కాదు, మన వ్యక్తిగత పరిశుభ్రతకు మరియు అలంకరణలో కూడా ఒక భాగం. కాబట్టి ఈ సమస్యను పూర్తిగా తొలగించడానికి కాఫీ పౌడర్ సహాయపడుతుంది. కాఫీ పౌడర్ మంచి సువాసనను కలిగి ఉండటం మాత్రమే కాదు. కొన్ని ఆరోగ్య, సౌందర్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కాఫీ పౌడర్ ద్వారా అందాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. సౌందర్య సంరక్షణలో కాఫీ పౌడర్ ఏవిధంగా ఉపయోగించబడుతుందో చూద్దాం..

కావల్సిన పదార్థాలు
పాదాల పగుళ్ళను పూర్తిగా నివారించడానికి కొబ్బరి నూనె, నీరు, కాఫీ పౌడర్ మరియు బేబీ షాంపూ ఉపయోగించవచ్చు. ఒక గిన్నె తీసుకుని అందులో కాఫీ పౌడర్ వేసి , వేడి నీళ్ళ కొద్దిగా వేసి పేస్ట్ లా తయారుచేయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొబ్బరి నూనె, బేబీ షాంపు కూడా చేర్చి అన్ని కలిసిపోయేలా బాగా కలపాలి.

ఎలా ఉపయోగించాలి:
పాదాల అందాన్ని ఆరోగ్యాన్ని పరిష్కరించడటం కోసం ఈ మిశ్రమాన్ని వాడుకోవచ్చు. పాదాలను నీటితో బాగా శుభ్రంగా కడగాలి. తర్వాత పైన తయారుచేసుకున్న పేస్ట్ ను పాదాలను లేపనంగా అప్లై చేయాలి. అప్లై చేసిన అరగంట తర్వాత పాదాలను స్ర్కబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల పాదంలోని అన్ని రకాల దుమ్మ, ధూళి తొలగిపోతుంది. ఇది పాదంలోని మృుతకణాలు తొలగి పోయి పాదాలు మృదువుగా మారడానికి సహాయపడుతుంది. ఇలా వరుసగా ఒక వారం రోజులు ప్రయత్నించండి. ఈ కాఫీపౌడర్ మిశ్రమం చర్మంలోతుల్లోకి చొచ్చుకుని పోయి, పగిలిన పాదాలను నివారించడానికి సహాయపడుతుంది. దీంతో పాటు ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం.

గ్లిజరిన్ మరియు రోజ్ వాటర్ :
గ్లిజరిన్ మరియు రోజ్ వాటర్, నిమ్మరసంను నీటిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా ఫూట్ మసాజ్ చేయడం వల్ల పాదాల పగుళ్ళ నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది. ప్రతి రోజూ ఇలా చేస్తే త్వరగా మంచి ఫలితాలను పొందవచ్చు. కాబట్టి, ఎటువంటి సందేహం లేకుండా పాదాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దీన్ని మీరు ప్రయత్నించవచ్చు.

అరటి పండు
బాగా పండిన అరటిపండును తీసుకుని దాన్ని పేస్ట్ లా తయారుచేయాలి. ఈ పేస్ట్ ను పాదాలకు అప్లై చేయాలి. అరగంట తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేస్తే పాదాలు అందంగా మారుతాయి. పాదాల పగుళ్ళను నివారించడంలో సహాయపడుతుంది. ఈ అరటి పండును ఉపయోగించడం ద్వారా పాదాల్లో మృుతకణాలు తొలగిస్తుంది మరియు కొత్త చర్మం ఏర్పడానికి సహాయపడుతుంది. పాదాల పగుళ్ళు పూర్తిగా అదృశ్యమవుతుంది. మీరు దీన్ని ప్రయత్నించేటప్పుడు క్రమం తప్పకుండా కొద్ది రోజుల పాటు అనుసరించండి, తప్పక మంచి ఫలితాలుంటాయి.

వేప ఆకు:
వేపఆకు కాళ్ళ పగుళ్ళను పూర్తిగా నివారించడానికి సహాయపడుతుంది. వేపఆకు పేస్ట్ కు కొద్దిగా ఉప్పు చేర్చి పాదాలకు రాసి బాగా మర్దన చేయాలి. ఇది పాదాల పగుళ్ళను తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే ఈ మిశ్రమానికి కొద్దిగా తేనె కలపడం ద్వారా కూడా త్వరగా పరిష్కరించుకోవచ్చు. కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా పాదాల పగుళ్ళకు ఈ చిట్కాలను పాటించవచ్చు



Click it and Unblock the Notifications