For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పసుపు దంతాలు తెల్లగా మార్చుకోవడానికి బేకింగ్ సోడ నిమ్మరసం వాడటం సురక్షితమేనా

|

దంతాలపై ఉన్న మరక అందరినీ ఇబ్బంది పెట్టేది. కానీ ఈ సమస్యకు పరిష్కార మార్గాలలో ఒకటి బేకింగ్ సోడ. అయితే చాలా మంది బేకింగ్ సోడా కాంబినేషన్ గా నిమ్మరసం జోడించి వల్ల ఉపయోగం ఉంటుందని కొందరు, లేదు ఈ రెండింటి కాంబినేషన్ వల్ల దంత సమస్యలు పెరుగాయని మరికొందరు చెబుతుంటారు. అయితే చాలా వరకు దంత సమస్యలను నివారించుకోవడానికి బేకింగ్ సోడ, నిమ్మరసం రెండింటి ఉపయోగిస్తారు. అయితే ఈ రెండు దంత సంరక్షణలో ఎంత వరుకు ఫలితాలని ఇస్తాయో తెలుసుకోవాలి.

తరచుగా ఉపయోగించే బేకింగ్ సోడా మరియు నిమ్మరసంలలో బేకింగ్ పౌడర్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. పైగా దంతాలను తెల్లగా మార్చే శక్తి బేకింగ్ సోడాలో ఉండటం వల్ల చాలా మంది దంతసంరక్షణలో బేకింగ్ సోడా ఉపయోగిస్తారు. బేకింగ్ సోడా దంతాలను తెల్లగా మార్చుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ దంతాల ఎనామిల్ నాశనం చేస్తుందని , పళ్లను మరింత సమస్యాత్మకంగా మార్చుతుందని తెలుసుకోవాలి. అదెలాగో తెలుసుకోండి...

బేకింగ్ సోడ, నిమ్మరసంలో పిహె లెవల్స్

బేకింగ్ సోడ, నిమ్మరసంలో పిహె లెవల్స్

బేకింగ్ సోడ మరియు నిమ్మరసం రెండింటి యొక్క పిహెచ్ స్కేల్ గురించి అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది 1-14 వరకు ఉంటుంది. 1 నుండి 14 మద్య ఎసిడిక్ లెవల్స్ ఏమేర ఉంటాయో తెలుపుతుంది. ఎసిడిక్ లెవల్స్ ఎక్కువగా ఉంటే యాసిడ్స్ అధికంగా, లెవల్స్ తక్కువగా ఉంటే వాటిలో యాసిడ్స్ తక్కువగా ఉంటాయని తెలుపుతుంది. అసిడిక్ లెవల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది దంతలపై ఉన్న ఎనామెల్ ను పూర్తిగా తగ్గిస్తుంది. అందుకు వీటిని చాలా జాగ్రత్తగా వాడాలి.

దంతాలపై ఎనామెల్ కరిగిపోతుంది

దంతాలపై ఎనామెల్ కరిగిపోతుంది

దంతాలు తెల్లగా లేదా పసుపుగా లేదా పసుపు పచ్చగా ఉన్నాయంటే అందుకు కారణం దంతాలపై ఉన్న ఎనామిల్ . బేకింగ్ సోడ, నిమ్మరసం రెండూ దంతాలపై వాడటం వల్ల ఈ రెండూ రసాయనికి ప్రతిచర్యను సృష్టిస్తాయి. దీనివల్ల పంటి ఎనామెల్ పూర్తిగా తొలగించబడుతుంది. వాస్తవం ఏమిటంటే, దంతాల మీద రుద్దడం ద్వారా, ఇది దంత క్షయం కలిగిస్తుంది. అంతే కాదు, ఇది పంటి ఎనామిల్ ని పూర్తిగా తొలగించడానికి కారణమవుతుంది.

ఇది చిగుళ్ళను కూడా ప్రభావితం చేస్తుంది

ఇది చిగుళ్ళను కూడా ప్రభావితం చేస్తుంది

ఈ మిశ్రమం తరచుగా వాడటం వల్ల చిగుళ్ళకు హాని చేస్తుంది. ఇందులో ఉండే ఎసిడిక్ లెవల్స్ పంటి చిగుళ్ళను, పంటి చుట్టూ ఉన్న కండను దెబ్బతీస్తుంది మరియు నోటిపూత వంటి చీకాకును కలిగిస్తుంది. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడం చాలా మందికి కష్టం అవుతుంది.

దంతాల పసుపు రంగులో ఉంటే

దంతాల పసుపు రంగులో ఉంటే

మీ పళ్ళు తెల్లబడటానికి నిమ్మ రసం మరియు బేకింగ్ సోడాను ఉపయోగించినప్పుడు, మీ దంతాలు తెల్లగా మారుతాయి. అయితే అదే సమయంలో దంతాల్లో దంతాల సెన్సిటివిటి పెరుగుతుంది. దంత క్షయానికి గురిచేస్తుంది. దంతాలపైన డెంటినా అనే పొర తొలగిపోవడం వల్ల దంతాలు పసుపుగా మారుతాయి. కాబట్టి దంతాలపై ఎనామిల్ తగ్గిపోకుండా ముందు జాగ్రత్త తీసుకోండి.

నిమ్మరసం మరియు బేకింగ్ సోడా

నిమ్మరసం మరియు బేకింగ్ సోడా

నిమ్మరసం మరియు బేకింగ్ సోడా ఆరోగ్య పరంగా మంచి ప్రయోజనాలు అందిస్తాయి. కానీ వీటిని దంత సంరక్షణకు ఉపయోగించనప్పుడు, ప్రతికూలతలను కలిగిస్తుంది. ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలను ఉపయోగించే ముందు జాగ్రత్త తీసుకోవాలి. ఆహారం , టీ, కాఫీలు తీసుకున్న వెంటనే నీటితో నోటి శుభ్రపరుచుకోవడం, పరిశుభ్రతను పాటించడం వల్ల దంతాలు శుభ్రంగా..తెల్లగా..మెరుస్తుండటం మాత్రమే కాకుండా, హెల్తీగా కూడా ఉంటాయి.

English summary

Is it safe to whiten teeth with baking soda and lemon juice

Is it safe to whiten teeth with baking soda and lemon juice. Find out here.
Story first published: Monday, September 9, 2019, 13:49 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more