For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ యోగాసనాలతో కళ్ల కింద బ్లాక్ సర్కిల్స్ ను తొలగించుకోవచ్చు...!

మీ కళ్ల కింద వలయాలను తొలగించుకోవడానికి ఈ యోగాసనాలు ఎంతగానో ఉపయోగపడతాయట. అవేంటో చూసెయ్యండి.

|

మనలో చాలా మందికి కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడుతుంటాయి. అయితే ఇది ప్రస్తుతం అందరిలో కనిపించే సాధారణ సమస్యగా మారిపోతోంది.ఈ నల్లని వలయాలను తొలగించుకునేందుకు కొందరు వ్యక్తులు ఖరీదైన మరియు కెమికల్ ఉత్పత్తులను వాడుతూ ఉంటారు. అయినా కూడా ఫలితం తాత్కాలికమే. కొందరికి అయితే మాత్రం ఆ మాత్రం ఫలితం కూడా రాదు. దీంతో చాలా మంది నిరాశ పడుతూ ఉంటారు. అయితే యోగా చేయడం వల్ల ఈ సమస్య నుండి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Yoga Asanas Get Rid of Dark Circles Under Eyes in Telugu

ప్రతిరోజూ యోగా చేయడం వల్ల మీరు ఆరోగ్యగంగా ఉండటమే కాదు.. అందంగా కూడా తయారవ్వొచ్చు. మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందొచ్చు. అంతేకాదండోయ్ యోగాసనాల వల్ల చర్మ సమస్యలు కూడా తగ్గిపోతాయి. ముఖ్యంగా కళ్ల కింద నల్లని వలయాలను తొలగించడంలో యోగా మీకు మెరుగైన పరిష్కారంగా పని చేస్తుందని నిరూపితం అయ్యింది. కళ్ల కింద డార్క్ సర్కిల్స్ మాత్రమే కాకుండా ముడతలు, మొటిమలు, ఫైన్ లైన్స్ వంటి అనేక ఇతర సమస్యలకు యోగా ద్వారా చెక్ పెట్టొచ్చు. ఈ సందర్భంగా కళ్ల కింద నల్లని వలయాలను తొలగించుకునేందుకు ఎలాంటి యోగాసనాలు చేయాలనే ఆసక్తికరమైన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సర్వంగాసనం..

ఈ పద్ధతిలో యోగా చేయడానికి ముందుగా మీరు వెనుకభాగంలో నిటారుగా పడుకోవాలి. ఆ తర్వాత మీ కాళ్లు, నడుమును నెమ్మదిగా పైకి లేపాలి. అనంతరం భుజాల మీద మొత్తం బరువు ఉండేలా బ్యాలెన్స్ చూసుకోండి. మీ చేతులతో మీ వెనుక వైపునకు సపోర్ట్ ఇవ్వండి. దీని తర్వాత మోచేతులను నేలపై ఉంచి, నడుముపై చేతులు ఉంచి, మీ నడుము మరియు కాళ్లను నిటారుగా ఉంచండి. గుర్తుంచుకోండి.. మీ బాడీ వెయిట్ అంతా భుజాలు మరియు చేతుల ఎగువ భాగంలోనే ఉండాలి. కాళ్లను నిటారుగా ఉంచాలి. తర్వాత పాదాల కాలి వేళ్లను ముక్కుకు అనుగుణంగా తీసుకుని దీర్ఘంగా శ్వాస తీసుకుని 30 సెకన్ల పాటు ఈ భంగిమలో ఉండాలి.

Yoga Asanas Get Rid of Dark Circles Under Eyes in Telugu

సింహాసనం..
ఈ పద్ధతిలో యోగా చేయడానికి, ముందుగా మీ పాదాల వేళ్లను కలుపుతూ దానిపై కూర్చోవాలి. ఆ తర్వాత రెండు మడమలను ఫొటోలో చూపిన విధంగా ఉంచి, మీ షిన్ ఎముక యొక్క ముందు భాగాన్ని నేలపై ఉంచండి. అదే సమయంలో మీ చేతులను నేలపై ఉంచండి. అనంతరం నోరు తెరచి ఉంచి, మీకు వీలైనంత మేరకు నాలుకను బయటకు చాపాలి. ఆ తర్వాత కళ్లు తెరిచి ఆకాశం వైపు చూసి ముక్కుతో పీల్చాలి. దీని తర్వాత, నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటూ, గొంతు నుండి స్పష్టమైన మరియు స్థిరమైన శబ్దం చేయండి. ఈ విధానాన్ని రోజుకు కనీసం 5 సార్లు రిపీట్ చేయండి.

Yoga Asanas Get Rid of Dark Circles Under Eyes in Telugu

పర్వతాసనం..
ఈ ఆసనం చేయడానికి ముందుగా శుభ్రంగా ఉండే ప్రదేశంలో వజ్రాసనం స్థానంలో కూర్చోవాలి. అనంతరం నెమ్మదిగా రెండు చేతులు మరియు పాదాల కాలి వేళ్లను నేలపై ఉంచండి. బరువును నేలపై ఉంచి, త్రిభుజాకార ఆకారంలో మీ నడుమును వీలైనంత పైకి లాగండి. ఈ ఆసనం సమయంలో మీ శరీరం యొక్క ఆకారం పర్వతం నిలబడి ఉన్నట్లుగా కనిపించాలని గుర్తుంచుకోండి. అప్పుడు లోతైన శ్వాసను ప్రాక్టీస్ చేయండి.

English summary

Yoga Asanas Get Rid of Dark Circles Under Eyes in Telugu

International Yoga Day : Here we are going to tell you about some yogasanas to get rid of dark circles, which will prove beneficial for you
Story first published:Tuesday, June 21, 2022, 12:05 [IST]
Desktop Bottom Promotion