Latest Updates
-
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్
తస్సాదియ్యా కత్రినా అందం వెనుక ఇంత కథ ఉందా..పొద్దున్నే ఏం చేస్తదో తెలుసా
కత్రినా కైఫ్(Katrina kaif) పేరు వినగానే గొప్ప అందగత్తె అనే ఫీల్ మనసులో వస్తుంది. చాలా ఫిట్ గా నాజూగ్గా ఉండే ఈ బాలీవుడ్ హీరోయిన్ తన అభినయం,అందంతో కోట్లాది అభిమానులను సంపాదించుకుంది. తీగలాంటి శరీరంతో పాలరాతి శిల్పంలా మెరిసిపోతూ కనబడే కత్రినా కైఫ్ అసలు ఏం తింటది?ఫిజిక్ ఎలా మెయింటెయిన్ చేస్తుంది?ఎలాంటి డైట్ పాలో అవుతుంటది?ముఖ్యంగా స్కిన్ కి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకుంటది అనే విషయాలను తెలుసుకునేందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. తాము కూడా కత్రినా కైఫ్ లా కనబడాలని కోరుకుంటుంటారు చాలామంది. అలాంటివారికోసం చర్మ సంరక్షణకు సంబంధించి తాను రోజూ ఏం చేస్తాను అనే విషయాలను కొన్ని నెలల క్రితం ఓ వీడియో ద్వారా కత్రినా కైఫ్ తెలిపింది.
కత్రినా కైఫ్ మెరిసే చర్మం వెనుక సీక్రెట్ ఇదే
మంచి చర్మ సంరక్షణ దినచర్య.. అందంలో చాలా ముఖ్యమైన భాగం అని తాను నమ్ముతానని కత్రినా తెలిపింది. ప్రతిరోజూ ఉదయం రెండు గ్లాసుల గోరువెచ్చని నీటితో తన దినచర్య ప్రారంభమవుతుందని.. సెలెరీ జ్యూస్ తాగుతానని చెప్పింది. సెలరీ అనేది అపియాసి కుటుంబానికి చెందిన కూర. ఇది చూడడానికి కొంచెం కొత్తిమీరలా ఉంటుంది. ఉదయాన్నే ఫేస్ ఆయిల్ మసాజ్ లు కూడా చేసుకుంటానని కత్రినా చెప్పింది. ముఖానికి మంచిగా ఆయిల్ తో మసాజ్ చేస్తానని చెప్నింది.

షూటింగ్స్ లేని టైంలో మేకప్ లైట్ గా మాత్రమే వేసుకుంటానని తెలిపింది. తాను ఇల్యూమినేటింగ్ ప్రైమర్ డ్రాప్స్‌ని ఉపయోగిస్తానని..అవి చర్మానికి మంచు గ్లో తీసుకురావడంలో సహాయపడతాయని చెప్పింది. ఈ డ్రాప్స్ ని తన డార్క్ సర్కిల్స్ పై పూస్తానని.. కళ్ల కింద,బుగ్గలు,గడ్డం, నుదిటిపై వాటిని వాడతానని తెలిపింది.
కాగా,హిందీలోనే కాకుండా తెలుగు,మళయాలం సినిమాల్లో కూడా కత్రినా నటించింది. తెలుగులో విక్టరీ వెంకటేష్ తో మల్లీశ్వరి సినిమాలో నటించిన కత్రినా మొదటి తెలుగు సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత బాలకృష్ణ సరసన అల్లరి పిడుగులో హీరోయిన్ గా నటించగా ఈ సినిమా పెద్దగా హిట్ అవలేదు. సినీ కెరీర్ లో అనేక అవార్డులను అందుకుంది. అంతేకాకుండా మనదేశంలో అత్యధిక పారితోషకం తీసుకునే సినీతారల్లో కత్రినా కూడా ఒకరు.
కత్రినాకైఫ్ 2021 డిసెంబర్ 9న బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దగ్గరివ్యక్తులు,కుటుంబసభ్యుల సమక్షంలో రాజస్తాన్ లోని ఓ రిసార్ట్ లో హిందూ సంప్రదాయాల ప్రాకారం వీరి పెళ్లి జరిగింది. అయితే ఇప్పటికీ కత్రినా క్రేజ్ మాత్రం ఇంచు కూడా తగ్గలేదు.



Click it and Unblock the Notifications