Latest Updates
-
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.!
చింతపండుతో గోరింటా తయారుచేసుకోవచ్చని తెలుసా? ఇంట్లోనే సింపుల్ గా గోరింటా ఎలా చేసుకోవాలో చూడండి
గోరింటాకు అంటే ఇప్పటి జనరేషన్ కి పెద్దగా తెలీదు. ఇప్పటోళ్లకు తెలిసింది మెుహందీలే. అయితే కొన్నేళ్ల క్రితం ఈ మెహందీల ప్లేస్ లో లేని గోరింటాకును వాడేవాళ్లు. ఒకప్పుడు ఇంటికి గోరింటాకు తెచ్చారంటే పెద్ద పండగే..దాన్ని రోట్లో వేసి బాగా రుబ్బి ఆడోళ్లు, మొగోళ్లు, పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా చేతులకు, కాళ్లకు పెట్టించుకునేవాళ్లు. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండుగలు, ఇతర ప్రత్యేక సందర్భాలలో చేతులు, కాళ్లకు గోరింటాకుతో అందమైన డిజైన్లు వేసుకునేవాళ్లు.
గోరింటాకు చర్మానికి సహజమైన రంగును అందించి అందంగా కనబడేలా చేస్తుంది. ఇది ఎలాంటి హానికరమైన రసాయనాలు లేకుండా వచ్చే అందం. ఇప్పటికీ పల్లెటూర్లలో ఇళ్ల దగ్గరే గోరింటాకు చెట్లను పెంచుకునేటోళ్లు చాలామందే ఉంటారు. గోరింటాకు కేవలం అందం కోసం మాత్రమే కాదండోయ్ కొన్ని సంప్రదాయాల్లో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గోరింటాకు శుభసూచకంగా భావిస్తారు. దీనికి చల్లబరిచే గుణాలు కూడా ఉన్నాయని చెబుతుంటారు. గోరింటాకును జుట్టుకి రంగేయడానికి కూడా ఉపయోగిస్తుంటారు. ఇది జుట్టుకు సహజంగా రంగు వేయడమే కాకుండా కొన్ని పోషకాలను కూడా ఇస్తుందని నిపుణులు చెబుతుంటారు.

చాలామంది పచ్చబొట్లు వేసుకుంటారు. కొన్ని పచ్చబొట్లు శాశ్వతమైనవిగా ఉంటాయి..కానీ గోరింటాకు తాత్కాలికమైనది. కాబట్టి మీరు వివిధ సందర్భాలలో వివిధ రకాల డిజైన్లను ప్రయత్నించవచ్చు. సిటీల్లో చాలామందికి గోరింటాకు లభించే అవకాశం ఉండదు. దీంతో రసాయనాలను కలిపిన మెహందీలను పెట్టుకుంటుంటారు. అయితే సహజమైన పద్దతిలో ఇంట్లోనే గోరింటా సులభంగా తయారుచేసుకోవచ్చు. చింతపండుతో గోరింటా తయారుచేసుకోవచ్చని మీకు తెలుసా? అంతేకాకుండా దీనిని సంవత్సరం వరకు కూడా నిల్వ చేసుకోవచ్చు అంట. మరి ఇంకెందుకు ఆలస్యం చింతపండుతో గోరింటా ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఇంట్లోనే గోరింటా ఎలా తయారుచేసుకోవాలో చూడండి
-ముందుగా ఒక గిన్నెలో నిమ్మకాయ సైజు అంత చింతపండు, 10 లవంగ మొగ్గలు, 1 స్పూన్ సోంపు, 2 స్పూన్ల టీపౌడర్, 1 గ్లాస్ నీళ్లు పోసి మొత్తం కలిసేలా కలపండి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టండి. నీరు సగం అయ్యే వరకు బాగా మరగించి పక్కనపెట్టుకోండి.
-తర్వాత దీనిని వడగట్టుకోండి.
-వడకట్టగా వచ్చిన రసంలో బాగా ఎర్రగా ఉన్న కుంకుమ వేసి ఉండలు రాకుండా బాగా కలపాలి.
-తర్వాత దీనిని చేతికి గోరింటాకు పెట్టుకున్నట్లుగా డిజైన్ వేసుకొని 1 గంట పాటు ఆరనివ్వాలి.
-తర్వాత నీళ్లతో శుభ్రంగా కడుక్కుంటే గోరింటాకు పండితే ఎలా ఉంటుందో అలా వస్తుంది. ఇది చర్మానికి హాని కలిగించకుండా అందమైన రంగును అందిస్తుంది.



Click it and Unblock the Notifications