Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
తెలియక కూడా ఈ తప్పులు చేయవద్దు.. చేస్తే ఉన్న జుట్టు ఊడిపోతుంది
ఆరోగ్యకరమైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. జుట్టు నల్లగా, లావుగా, దృఢంగా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. క్రీములు, షాంపూలు, సీరమ్, మాయిశ్చరైజర్లు ఇలా చాలా రకాల క్రీములు వాడుతుంటారు.
అయినా మంచి జుట్టు సొంతం అవుతుందన్న గ్యారెంటీ లేదు. జుట్టు ఆరోగ్యం అనేది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునేందుకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తారో.. కొన్ని తెలియకుండా చేసే తప్పుల వల్ల పడ్డ కష్టమంతా వృథా అయిపోతుంది. ఆ తప్పులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

హాట్ టూల్స్:
స్ట్రెయిట్‌నర్‌లు, కర్లింగ్ ఐరన్ లు, హెయిర్ డ్రైయర్ లు వంటి హాట్ స్టైలింగ్ టూల్స్ ఉపయోగించడం వల్ల జుట్టు పాడైపోతుంది. జుట్టు ఎండబెట్టడం, చివర్లు చీలిపోవడం, హెయిర్ షాఫ్ట్ బలహీనపడటం వంటి వాటి వల్ల జుట్టు దెబ్బతింటుంది.
రసాయన చికిత్సలు:
హెయిర్ డైస్, కెరాటిన్ హెయిర్ బోటాక్స్ లాంటి మొదలైన రసాయన చికిత్సలు జుట్టు నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. అలాగే జుట్టును బలహీనపరుస్తాయి. వీటి వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది.
టైట్ హెయిర్ స్టైల్స్:
సెలబ్రిటీలు రకరకాల హెయిర్ స్టైల్స్ క్యారీ చేస్తుంటారు. వాటిని చూస్తున్నప్పుడు అలా విభిన్నంగా ప్రయత్నించాలన్న కోరిక చాలా మందికి కలుగుతుంది. అయితే అలా జుట్టును టైట్ చేసే స్టైల్స్ వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. గట్టిగా లాగి కట్టే హెయిర్ స్టైల్స్ వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి.
సాధారణ ట్రిమ్‌లు:
ఎప్పటికప్పుడు జుట్టును కట్ చేసుకోవాలి. అలా చేసుకోకపోవడం వల్ల కూడా జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. జుట్టు షాఫ్ట్ పైకి వెళ్లి, ఎక్కువ నష్టాన్ని కలిగించేలా చివర్లు చిట్లిపోతాయి.
తప్పు హెయిర్ ప్రొడక్ట్స్:
జుట్టు రకానికి సరిపడని హెయిర్ ప్రొడక్ట్ లను ఉపయోగించడం వల్ల జుట్టు పొడిబారుతుంది. చివర్లు చిట్లిపోతాయి. జుట్టు ఆరోగ్యం పాడవుతుంది. ఏ ఉద్దేశంతో ఆయా హెయిర్ ప్రొడక్ట్స్ ను వాడతామో... ఆ లక్ష్యం నెరవేరకపోగా ఆరోగ్యం దెబ్బతింటుంది.
బ్రషింగ్:
కొందరు జుట్టును అతిగా దూస్తుంటారు. చిక్కులు పడ్డ జుట్టును అలాగే బలంగా బ్రషింగ్ చేస్తుంటారు. అలా తరచూ చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనమవుతాయి. అలాగే జుట్టు చిట్లిపోతాయి.
పర్యావరణ కారకాలు:
ఎండ, గాలి, విపరీతమైన ఉష్ణోగ్రతలు వంటి కఠినమైన వాతావరణ పరిస్థితులు జుట్టుపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతాయి. పర్యావరణ కారకాలు జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications