Latest Updates
-
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా..
కళ్లకింద డార్క్ సర్కిల్స్ వస్తున్నాయా.. అయితే ఆలస్యం వద్దు, ఈ చిట్కాలు పాటించండి!
కాస్త నిద్ర తక్కువైనా, తరచుగా పోన్లు, ల్యాప్ టాప్ లు, ట్యాబులు, టీవీలు చూస్తూ ఉండడం వల్ల కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వస్తుంటాయి. ఈ మధ్య కాలంలో అయితే చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ల వరకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల వాడకం ఎక్కువ అయింది. దీంతో చాలా మందికి డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి. వీటి వల్ల మొహం అంతా అందవికారంగా మారుతుంది. అలాగే అనారోగ్య సమస్యలు ఎక్కువైనా ఇలా కళ్లకింద నల్లని వలయాలు ఏర్పడతాయని నిపుణులు సూచిస్తున్నారు.

తగినంత నిద్రపోకపోవడం, నీరు తాగకపోవడం, కళ్లను తరచుగా రుద్దడం, జన్యూశాస్త్రీ కారణం అని చెప్పవచ్చు. నల్లని వలయాలకు కారణాలు తెలిస్తే వాటిని నివారించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సమర్థవంతంగా చికిత్స చేసుకునేందుకు చక్కటి మార్గం లభించినట్లే. అందుకే మీ జీవన శైలిని మార్చుకుంటే కంటి కింది డార్క్ సర్కిల్స్ ను ఈజీగా తొలిగించుకోవచ్చు. కాబట్టి మీ జీవన శైలిలో మార్పులు చేసుకోవడం మరింత మంచిది. అలాగే ఈ చిట్కాలు పాటిస్తే కచ్చితంగా డార్క్ సర్కిల్స్ ను తగ్గించుకోవచ్చు.
కీరదోసతో డార్క్ సర్కిల్స్ కు చెక్:
కళ్లకింది డార్క్ సర్కిల్స్ ను నివారించడంలో కీరదోస కీలక పాత్ర పోషిస్తుంది. కీరదోసకాయ మంచి ఆస్ట్రిజెంట్. అలాగే స్కిన్ టోనర్ కూడా. కీరదోసను స్లైస్ గా కట్ చేసు కళ్ల మీద పెట్టుకోవాలి. ఇలా రోజులో రెండు మూడు సార్లు పెట్టుకుంటూ ఉంటే కళ్లకు విశ్రాంతిని ఇచ్చి డార్క్ సర్కిల్స్ ను తగ్గిస్తుంది.
తరచుగా నీళ్లు తాగాలి:
ప్రతి రోజూ శరీరానికి తగినంత నీటిని తాగడం వల్ల నల్లని వలయాలు ఎఫెక్టివ్ గా తొలగిపోతాయి. కళ్ల కింద మచ్చలను నివారించడంలో సులభమైన రెమిడీ ఇది. ఇది మీ చర్మాన్ని హైడ్రేట్ లో ఉంచి డార్క్ సర్కిల్స్ తో పోరాడుతుంది. సత్ఫలితంగా మచ్చలు పోయి మొహం కాంతివంతంగా తయారు అవుతుంది.
తగినంత నిద్ర పోవాలి:
చాలా మందికి సరిపడా నిద్రలేకే కళ్ల కింద నల్లటి మచ్చలు వస్తుంటాయి. అయితే వీటిని తగ్గించుకోవాలి అనుకుంటే రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్ర పోవాలి. నిద్ర బాగా పట్టేందుకు చేసుకోవాల్సిన అన్ని ఏర్పాట్లను చేసుకోవాలి. ముఖ్యంగా ఫోన్లు, ల్యాప్ టాప్ లు వంటి వాటిని పక్కన పెట్టేయాలి. బెడ్ మీదకు వెళ్లాక నిద్ర తప్ప మరొకటి ఉండకూడదు.
టమోటోతో ఇలా ట్రై చేసి చూడండి:
టమోటాల్లో చర్మం రంగును మరింత పెంచడానికి ఉపయోగపడే అనేక కారకాలు ఉంటాయి. అందుకే మీరు ఒక చెంచా టమోటా గుజ్జు, చెంచా నిమ్మరం మిక్స్ చేసి డార్క్ సర్కిల్స్ పై అప్లై చేయాలి. కొన్ని నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఫలితంగా నల్లటి వలయాలు త్వరలోనే మటుమాయం అయిపోతాయి.
బాదాం నూనెతో మసాజ్:
బాదాం నూనె న్యాచురల్ ప్రాడక్ట్. ఇది చర్మ సౌందర్యాన్ని కాపాడేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నల్లటి వలయాలు ఉన్న వాళ్లు.. వీటిని తొలగించుకోవడానికి బాదాం నూనెతో తరచుగా మసాజ్ చేయాలి. కళ్ల చుట్టూ మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రాత్రంతా నూనెను ఇలాగే ఉంచుకొని ఉదయమే గోరు వెచ్చటి నీటితో కడిగేయాలి. ఆ తర్వాత మొత్తటి బట్టతో మొహం తుడుచుకోవాలి. వారం రోజులు ఇలా చేశారంటే మచ్చలు పోవడం గ్యారీంటీ.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications