Latest Updates
-
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.?
తియ్యని పదార్థాలు తెగ తినేస్తున్నారా.. అయితే చర్మంపై ముడతలు రావడం ఖాయం!
చాలా మందికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం. ఒక్కొక్కరూ ఒక్కో స్వీట్ ను చూస్తే ఆగలేకపోతారు. వెంటనే నోట్లో వేసుకొని మింగేస్తుంటారు. ముఖ్యంగా చాలా మంది ఇంట్లో ప్రతిరోజూ స్వీట్లు తింటుంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. దీని వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా చర్మ సౌందర్యం తగ్గిపోతుంది. చర్మానికి తీపి పదార్థాలు ఎంతో హాని చేస్తాయి. చక్కెరతో చేసిన ఆహారాన్ని అతిగా తినడం వల్ల మొటిమలు త్వరగా వచ్చే అవకాశం ఉంది.
ఆహారంలో పండ్లు, తాజా కూరగాయలు, పాలకూర, చేపలు, నట్స్, వంటివి అధికంగా తినాలి. వీటిని తరచుగా తింటే చాలా అందంగా తయారవుతారు. తీపి కోరికలను చంపుకుంటేనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పోషాకాహార నిపుణులు సూచిస్తున్నారు. తీపి పదార్థాలు ఎంత తక్కువగా తింటే అంత మంచిది. అసలు స్వీట్లు తినడం వల్ల చర్మంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1. మొటిమలు:
ఎక్కువగా చక్కెర తినడం వల్ల శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ పెరుగుతుంది. ఇది చర్మంపై మొటిమల రూపంలో బయటపడుతుంది. అధిక చక్కెర తీసుకోవం వల్ల ఇన్సులిన్ స్థాయిలు కూడా పెరుగుతుంటాయి. ఇది అదనపు సెబమ్ ఉత్పత్తికి కారణం అవుతుంది. ఈ సెబర్ రంధ్రాలను మూసివేస్తుంది. దీని వల్ల మొటిమలు కల్గించే బ్యాక్టీరియా పెరుగుదులకు దారి తీస్తుంది. ముఖంపై అధికంగా మొచిమలు వచ్చేస్తాయి.
2. జిడ్డు:
అధిక మొత్తంలో చక్కెరను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరుగుతాయి. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిలో పెరుగుదలకు దారి తీస్తుంది. పెరిగిన ఇన్సులిన్ స్థాయిలు సేబాషియన్ గ్రంథులను మరింతగా సెబమ్ ఉత్పత్తి చేసేలా ప్రేరేపిస్తాయి. ఈ అదనపు సెబమ్ వల్ల చర్మం జిడ్డుగా మారుతుంది. చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. దీని వల్ల మరింత జిడ్డుగా కనిపిస్తుంది. దీని వల్ల చర్మం నిస్తేజంగా మారుతుంది.
చక్కెరతో నిండిన పదార్థాలు తనిడం వల్ల శరీరానికి చేకూరే ప్రయోజనం ఏమీ ఉండదు. కాబట్టి వారానికి ఒఖ స్వీటు తిని సంతోష పడిపోండి. పంచదారతో చేసే స్వీట్ల కంటే బెల్లంతో చేసే పదార్థాలు తినడం వల్ల ఆనందానికి ఆనందం, ఆరోగ్యానికి ఆరోగ్యం.
3. ముడతలు:
స్వీట్లలో ఉండే చక్కెర గ్లైకేషన్ అనే ప్రక్రియను బాగా ప్రోత్సహిస్తుంది. ఇక్కడ చక్కెర అణువులు చర్మంలోని కొల్లైజెన్, ఎలాస్టిన్ ఫైబర్ లతో కలుస్తాయి. దీని వల్ల ముడతలు వచ్చే అవకాశం చాలా అధికంగా ఉంటుంది. ఇది త్వరగా వృద్ధాప్యం వచ్చేలా చేస్తుంది. స్వీట్లు తినడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి. పెరిగిన ఇన్సులిన్ ల ద్వారా అధునాతన గ్లైకేషన్ ఎండ్ృప్రొడక్ట్స్ నిర్మామం పెరిగిపోతుంది. ఈ ఏజ్ లో కొల్లాజెన్, ఎలాస్టిన్ ఫైబర్లను దెబ్బతీస్తాయి. దీని వల్లే చర్మంపై ఎక్కువగా ముడతలు పెరిగిపోతాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications